ICC World cup 2023: బాబర్ ఆజమ్ హాఫ్ సెంచరీ... వన్డే నెం.1 బ్యాటర్ ర్యాంక్ సేఫ్ బ్రదర్...

By Chinthakindhi Ramu  |  First Published Oct 23, 2023, 4:49 PM IST

పసికూనపై ప్రతాపం చూపుతున్న బాబర్ ఆజమ్... వన్డేల్లో 30వ హాఫ్ సెంచరీ నమోదు.. సెంచరీ దిశగా పరుగులు... 


ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో మొదటి రెండు మ్యాచుల్లో ఘన విజయాలు అందుకుంది పాకిస్తాన్. పసికూన నెదర్లాండ్స్, ఫామ్‌లో లేని శ్రీలంక జట్లపై భారీ విజయాలు అందుకుంది. అయితే టీమిండియాతో మ్యాచ్ ఓడిన తర్వాత ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లోనూ పాకిస్తాన్‌కి పరాజయం తప్పలేదు..

టాప్ క్లాస్ టీమ్స్ చేతుల్లో రెండు వరుస ఓటముల తర్వాత మరో పసికూన ఆఫ్ఘాన్‌తో మ్యాచ్ ఆడుతోంది పాకిస్తాన్. చెన్నైలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్, బ్యాటింగ్ ఎంచుకుంది. ఇమామ్ ఉల్ హక్, అబ్దుల్లా షెఫీక్ కలిసి పాకిస్తాన్‌కి శుభారంభం అందించారు.

Latest Videos

undefined

తొలి వికెట్‌కి 56 పరుగులు జోడించిన తర్వాత ఇమామ్ ఉల్ హక్ అవుట్ అయ్యాడు. 22 బంతుల్లో 2 ఫోర్లతో 17 పరుగులు చేసిన ఇమామ్ ఉల్ హక్‌ని అజ్మతుల్లా ఓమర్‌జాయ్ అవుట్ చేశాడు. 2 సిక్సర్లు బాదిన అబ్దుల్లా షెఫీక్, 2023లో పవర్ ప్లేలో సిక్సర్ బాదిన పాకిస్తాన్ బ్యాటర్‌గా నిలిచాడు.

75 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 58 పరుగులు చేసిన అబ్దుల్లా షెఫీక్, నూర్ అహ్మద్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. మమ్మద్ రిజ్వాన్ ఓ సిక్సర్‌తో 8 పరుగులు చేసి నూర్ అహ్మద్ బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు. 34 బంతుల్లో 3 ఫోర్లతో 25 పరుగులు చేసిన సౌద్ షకీల్, మహ్మద్ నబీ బౌలింగ్‌లో రషీద్ ఖాన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..

163 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది పాకిస్తాన్. మరో ఎండ్‌లో బాబర్ ఆజమ్ 69 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు. బాబర్ ఆజమ్ వన్డే కెరీర్‌లో ఇది 30వ హాఫ్ సెంచరీ. 

ఐసీసీ నెం.2 ర్యాంకులో ఉన్న శుబ్‌మన్ గిల్, బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో 53 పరుగులు చేశాడు. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో 26 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఈ రెండు ఇన్నింగ్స్‌ల కారణంగా వన్డే నెం.1 బ్యాటర్ ర్యాంక్‌ని కోల్పోయే ప్రమాదంలో పడ్డాడు బాబర్ ఆజమ్. మ్యచ్ రిజల్ట్ ఎలా ఉన్నా తాజా హాఫ్ సెంచరీతో బాబర్ ఆజమ్ నెం.1 ర్యాంక్ సేఫ్ అయినట్టే.. 

click me!