విరాట్ కోహ్లీ వల్లే ఓడిపోయాం, ఇలా ఆడితే ఎన్ని ప్లాన్స్ వేసినా ఏం లాభం... - న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్

By Chinthakindhi Ramu  |  First Published Oct 23, 2023, 4:26 PM IST

విరాట్ కోహ్లీని ప్రెషర్‌లో పెట్టేందుకు ఎంత ప్రయత్నించినా మా ప్లాన్స్ అన్నింటికీ అతని దగ్గర సమాధానాలు ఉన్నాయి... - న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్..


ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో మొదటి నాలుగు మ్యాచుల్లో ఘన విజయాలు అందుకుంది న్యూజిలాండ్. ధర్మశాలలో టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో తొలి పరాజయాన్ని ఎదుర్కొంది కివీస్...

రెగ్యూలర్ కెప్టెన్ కేన్ విలియంసన్ ఒకే ఒక్క మ్యాచ్ ఆడినా, తాత్కాలిక కెప్టెన్ టామ్ లాథమ్ కెప్టెన్సీలో వరుస విజయాలు అందుకుంది. ధర్మశాలలో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్, 273 పరుగులకి ఆలౌట్ అయ్యింది..

Latest Videos

undefined

రచిన్ రవీంద్ర 75 పరుగులు చేయగా డార్ల్ మిచెల్ 130 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ ఐదు వికెట్లు తీయగా కుల్దీప్ యాదవ్‌కి 2 వికెట్లు దక్కాయి. 274 పరుగుల లక్ష్యాన్ని 48 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది న్యూజిలాండ్...

కెప్టెన్ రోహిత్ శర్మ 46, శుబ్‌మన్ గిల్ 26, శ్రేయాస్ అయ్యర్ 33, కెఎల్ రాహుల్ 27, సూర్యకుమార్ యాదవ్ 2 పరుగులు చేయగా విరాట్ కోహ్లీ 104 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 95 పరుగులు చేసి, సెంచరీకి 5 పరుగుల దూరంలో అవుట్ అయ్యాడు..

44 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 39 పరుగులు చేసిన రవీంద్ర జడేజా, బౌండరీతో మ్యాచ్‌ని ముగించాడు. ‘వరుస విరామాల్లో వికెట్లు తీసి, భారత బ్యాటర్లపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశాం. అయితే విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడాడు. అతన్ని ప్రెషర్‌లో పెట్టేందుకు ఎంత ప్రయత్నించినా మా ప్లాన్స్ అన్నింటికీ అతని దగ్గర సమాధానాలు ఉన్నాయి. మొదటి నుంచి చివరి వరకూ ఒకే రకమైన టెంపో కొనసాగించాడు.

మిగిలిన బ్యాటర్లు, విరాట్ కోహ్లీ చుట్టూ బ్యాటింగ్ చేశారు. విరాట్ ఇన్నింగ్స్ వల్లే ఓడిపోయాం..’ అంటూ కామెంట్ చేశాడు న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్..

‘విరాట్ కోహ్లీ గురించి ఎంతని చెప్పాలి. అతను ఎన్నో ఏళ్లుగా ఇలా ఆడుతూ ఎన్నో మ్యాచులు గెలిపించాడు. టీమ్‌కి అవసరమైనప్పుడు బాధ్యత తీసుకుని ఆడతాడు. వికెట్లు పడగానే కాస్త ప్రెషర్ క్రియేట్ అయ్యింది. అయితే విరాట్ మాత్రం ఎలాంటి ప్రెషర్‌ ఫీల్ అవ్వకుండా మ్యాచ్‌ని టీమిండియా చేతుల్లో పెట్టాడు..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ..  

click me!