ICC World cup 2023: రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ అందుకున్న ఆస్ట్రేలియా, వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్‌కి..
213 పరుగుల ఈజీ టార్గెట్! 6 ఓవర్లలో 60 పరుగులు చేసిన ఓపెనర్లు... ఆస్ట్రేలియా ఈజీగా గెలిచేస్తుందని అనుకున్నారంతా. అయితే సౌతాఫ్రికా బౌలర్లు అద్భుతంగా పోరాడడంతో రెండో సెమీ ఫైనల్... ఉత్కంఠభరితంగా సాగింది.
చివరికి ప్రెషర్‌ని హ్యాండిల్ చేయలేకపోయిన సౌతాఫ్రికా 6 క్యాచులు మిస్ చేసి భారీ మూల్యం చెల్లించుకోగా, 3 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ అందుకున్న ఆస్ట్రేలియా, వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్‌కి దూసుకెళ్లింది.
undefined
స్వల్ప లక్ష్యఛేదనలో ఆస్ట్రేలియాకి మంచి ఆరంభం దక్కింది. 18 బంతుల్లో ఓ ఫోర్, 4 సిక్సర్లతో 29 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్, 2023 వరల్డ్ కప్‌లో 500+ పరుగులు అందుకున్నాడు.
వార్నర్‌ని మార్క్‌రమ్ అవుట్ చేయగా మిచెల్ మార్ష్ 6 బంతులు ఆడి రబాడా బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు. 48 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 62 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్‌ని కేశవ్ మహరాజ్ బౌల్డ్ చేశాడు.
31 బంతుల్లో 2 ఫోర్లతో 18 పరుగులు చేసిన మార్నస్ లబుషేన్‌ని గెరాల్డ్ అవుట్ చేశాడు. గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ని షంసీ క్లీన్ బౌల్డ్ చేయడంతో వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది ఆస్ట్రేలియా..
62 బంతుల్లో 2 ఫోర్లతో 30 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్ కూడా గెరాల్డ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. స్మిత్ అవుట్ అయ్యే సమయానికి ఆస్ట్రేలియా విజయానికి 39 పరుగులు కావాలి.
49 బంతుల్లో 3 ఫోర్లతో 28 పరుగులు చేసిన జోష్ ఇంగ్లీష్, గెరాల్డ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇంగ్లీష్ అవుట్ అయ్యే సమయానికి ఆస్ట్రేలియాకి ఇంకా 20 పరుగులు కావాలి. ఆసీస్ బ్యాటర్లు ఇచ్చిన క్యాచ్‌లను డ్రాప్ చేసిన సఫారీ ఫీల్డర్లు మ్యాచ్‌ని డ్రాప్ చేసుకుని, ఫైనల్ చేరే అవకాశాన్ని చేజార్చుకున్నారు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా, 49.4 ఓవర్లలో 212 పరుగులకి ఆలౌట్ అయ్యింది. తెంబ భవుమా డకౌట్ కాగా, క్వింటన్ డి కాక్ 3 పరుగులు, అయిడిన్ మార్క్‌రమ్ 10, వాన్ దేర్ దుస్సేన్ 6 పరుగులు చేసి అవుట్ కావడంతో 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది సౌతాఫ్రికా.
హెన్రీచ్ క్లాసిన్, డేవిడ్ మిల్లర్ కలిసి ఐదో వికెట్‌కి 95 పరుగులు జోడించారు.48 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 47 పరుగులు చేసిన క్లాసిన్‌ని అవుట్ చేసిన ట్రావిస్ హెడ్, ఆ తర్వాతి బంతికి మార్కో జాన్సెన్‌ని గోల్డెన్ డకౌట్ చేశాడు.
39 బంతుల్లో 2 ఫోర్లతో 19 పరుగులు చేసిన గెరాల్డ్ కాట్జే, ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. డేవిడ్ మిల్లర్ 116 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 101 పరుగులు చేసి... అద్భుత సెంచరీ అందుకున్నాడు. వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచుల్లో సెంచరీ చేసిన మొట్టమొదటి సౌతాఫ్రికా బ్యాటర్‌గా నిలిచాడు డేవిడ్ మిల్లర్..
ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్, ప్యాట్ కమ్మిన్స్ మూడేసి వికెట్లు తీయగా ట్రావిస్ హెడ్, జోష్ హజల్‌వుడ్ రెండేసి వికెట్లు తీశారు.