ICC World cup 2023: 49.4 ఓవర్లలో 212 పరుగులకి ఆలౌట్ అయిన సౌతాఫ్రికా... అద్భుత సెంచరీతో సఫారీ టీమ్‌కి మంచి స్కోరు అందించిన డేవిడ్ మిల్లర్..
వరల్డ్ కప్ చరిత్రలో ఇంతకుముందు నాలుగు సార్లు సెమీస్ ఆడినా, ఒక్కసారి కూడా ఫైనల్ వెళ్లలేకపోయింది సౌతాఫ్రికా. మరోసారి ఫైనల్ చేరే అవకాశం వచ్చినా దాన్ని సరిగ్గా వాడుకోలేకపోయింది సఫారీ జట్టు. 2023 ప్రపంచ కప్‌లో అదరగొట్టిన బ్యాటర్లు అందరూ సెమీస్‌లో మూకుమ్మడిగా ఫెయిల్ అయ్యాడు. డేవిడ్ మిల్లర్ వీరోచిత సెంచరీతో పోరాటంతో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా... 49.4 ఓవర్లలో 212 పరుగులకి ఆలౌట్ అయ్యింది..
ఇన్నింగ్స్ మొదటి ఓవర్ ఆఖరి బంతికి సౌతాఫ్రికా కెప్టెన్ తెంబ భవుమాని అవుట్ చేశాడు మిచెల్ స్టార్క్. 14 బంతులు ఆడి 3 పరుగులు చేసిన క్వింటన్ డి కాక్, జోష్ హజల్‌వుడ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు..
undefined
మొదటి 10 ఓవర్లు ముగిసే సమయానికి 18 పరుగులు మాత్రమే చేసి 2 వికెట్లు కోల్పోయింది సౌతాఫ్రికా. మొదటి 5 ఓవర్లలో 6 పరుగులే ఇచ్చాడు జోష్ హజల్‌వుడ్.
20 బంతుల్లో 2 ఫోర్లతో 10 పరుగులు చేసిన అయిడిన్ మార్క్‌రమ్, మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. వాన్ దేర్ దుస్సేన్‌ని జోష్ హజల్‌వుడ్ అవుట్ చేశాడు. 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది సౌతాఫ్రికా..
వర్షం కారణంగా ఆటకు కాసేపు అంతరాయం కలిగింది. బ్రేక్ తర్వాత హెన్రీచ్ క్లాసిన్, డేవిడ్ మిల్లర్ కలిసి ఐదో వికెట్‌కి 95 పరుగులు జోడించి, ఆదుకునే ప్రయత్నం చేశారు. ట్రావిస్ హెడ్ బౌలింగ్‌లో వరుసగా 2 ఫోర్లు బాదిన హెన్రీచ్ క్లాసిన్, అదే ఓవర్‌లో అవుట్ అయ్యాడు.
48 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 47 పరుగులు చేసిన క్లాసిన్‌ని అవుట్ చేసిన ట్రావిస్ హెడ్, ఆ తర్వాతి బంతికి మార్కో జాన్సెన్‌ని గోల్డెన్ డకౌట్ చేశాడు.
39 బంతుల్లో 2 ఫోర్లతో 19 పరుగులు చేసిన గెరాల్డ్ కాట్జే, ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. అయితే టీవీ రిప్లైలో బంతి అతని గ్లవ్స్‌కి కాకుండా మోచేతికి పైన తగిలినట్టు కనిపించింది.
కేశవ్ మహరాజ్ 4 పరుగులు చేసి అవుట్ కాగా. ఓ ఎండ్‌లో పాతుకుపోయిన డేవిడ్ మిల్లర్ 116 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 101 పరుగులు చేసి... అద్భుత సెంచరీ అందుకున్నాడు. వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచుల్లో సెంచరీ చేసిన మొట్టమొదటి సౌతాఫ్రికా బ్యాటర్‌గా నిలిచాడు డేవిడ్ మిల్లర్.. మిల్లర్‌ని అవుట్ చేసిన ప్యాట్ కమ్మిన్స్, ఆఖరి ఓవర్‌లో రబాడాని అవుట్ చేయడంతో సౌతాఫ్రికా ఇన్నింగ్స్ ముగిసింది.