IPL 2024: లక్నో సూపర్ జెయింట్స్‌లోకి వెస్టిండీస్ యువ సంచ‌ల‌నం షమర్ జోసెఫ్ !

By Mahesh RajamoniFirst Published Feb 11, 2024, 3:44 PM IST
Highlights

Shamar Joseph: ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో కాలికి గాయం ఉన్న‌ప్ప‌టికీ మ్యాచ్ ఆడి అద్భుత‌మైన ఫాస్ట్ బౌలింగ్‌తో వెస్టిండీస్ యువ సంచ‌ల‌నం షమర్ జోసెఫ్  ఏడు వికెట్లు తీసుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు. 
 

Lucknow Super Giants - Shamar Joseph: ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఒంటిచేత్తో వెస్టిండీస్ కు విజ‌యాన్ని అందించిన విండీస్ యువ సంచ‌ల‌నం,  పేసర్ షమర్ జోసెఫ్ ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ లో అడుగుపెట్టాడు. లక్నో సూపర్‌జెయింట్స్ జట్టు త‌ర‌ఫున ఐపీఎల్ 2024 సీజ‌న్ లో లో ఆడ‌నున్నాడు. రాబోయే టాటా ఐపీఎల్‌కు ల‌క్నో  జ‌ట్టు అత‌న్ని తీసుకుంది. ఇంగ్లాండ్ పేసర్ మార్క్ వుడ్ స్థానంలో ష‌మ‌ర్ జోసెఫ్ ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ తో చేర‌నున్నాడు.

24 ఏళ్ల జోసెఫ్ గత నెలలో బ్రిస్బేన్‌లో జరిగిన టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 68 పరుగులకు 7 వికెట్లు పడగొట్టాడు. బలమైన బ్యాట్స్‌మెన్ ఉన్న ఆస్ట్రేలియా లైనప్‌ను దెబ్బ‌తీసి దాదాపు ఓడిపోవ‌డం ఖాయ‌మైన మ్యాచ్ ను మ‌లుపుతిప్పి వెస్టిండీస్ కు ష‌మ‌ర్ జోసెఫ్ విజ‌యం అందించాడు. దీంతో క్రికెట్ ప్ర‌పంచ దృష్టిని ఆక‌ర్షించాడు. ష‌మ‌ర్ జోసెఫ్ ను ల‌క్నో రూ. ₹3 కోట్లకు ద‌క్కించుకుంది. అత‌నికి ఇదే తొలి ఐపీఎల్ కావ‌డం విశేషం.

Latest Videos

BETWAY SA20 ఛాంపియన్‌గా సన్‌రైజర్స్.. వ‌రుస‌గా రెండో టైటిల్

రాబోయే ఐపీఎల్‌కు మార్క్ వుడ్ అందుబాటులో లేకపోవడం ఖాయమైంది. దీనికి అస‌లు కార‌ణం ఇంకా తెలియ‌లేదు. ప్రస్తుతం భారత్‌తో జరిగే ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు ఇంగ్లాండ్ జ‌ట్టులో భాగంగా ఉన్నాడు. ఈ క్ర‌మంలోనే ష‌మ‌ర్ జోసెఫ్ ఎంట్రీ ఇచ్చాడు.  ఐపీఎల్ అధికారిక వెబ్ సైట్ ప్ర‌కారం "టాటా ఐపీఎల్ 17వ ఎడిషన్‌లో ఇంగ్లాండ్ పేస‌ర్ మార్క్ వుడ్ స్థానంలో వెస్టిండీస్ యువ పేసర్ షమర్ జోసెఫ్‌ను లక్నో సూపర్‌జెయింట్స్ జట్టు రూ. 3 కోట్లకు కొనుగోలు చేసింది. యువ పేసర్ గబ్బా టెస్ట్ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో ఆక‌ట్టుకున్నాడు. రెండో మ్యాచ్‌లో 7 వికెట్లు పడగొట్టాడు. గ‌బ్బాలో ఆస్ట్రేలియాపై వెస్టిండీస్‌కు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు. జోసెఫ్‌కు ఇది మొదటి ఐపీఎల్" అని పేర్కొంది.

Under 19 World Cup: అండ‌ర్19 వ‌ర‌ల్డ్ క‌ప్ లో భార‌త్ దే పైచేయి.. !

 

Shamar Joseph Replaces Mark Wood In Lucknow Super Giants
For IPL 2024 pic.twitter.com/dRm7YPW1Qm

— Majid speak (@majidamjad2017)
click me!