India vs Newzealand: విరాట్ ను ఊరిస్తున్న రికార్డులు.. నేటి పోరులో భారత సారథి పాక్ కెప్టెన్ ను దాటుతాడా?

By team teluguFirst Published Oct 31, 2021, 1:58 PM IST
Highlights

T20 Worldcup2021: కోహ్లి పేరిట ఇప్పటికే వందలాది రికార్డులు నమోదయ్యాయి. అయితే ఇప్పుడు మరో అరుదైన మైలురాయి కోహ్లిని ఊరిస్తున్నది.  T20లలో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన కెప్టెన్ గా నిలవడానికి విరాట్ మరో 50 పరుగులు చేస్తే చాలు..

భారత సారథి విరాట్ కోహ్లి (Virat Kohli) కి రికార్డులు కొత్తేం కాదు. టీ20, వన్డే, టెస్టులతో పాటు ఐపీఎల్ లో విరాట్ కోహ్లి పేరిట ఇప్పటికే వందలాది రికార్డులు నమోదయ్యాయి. అయితే ఇప్పుడు మరో అరుదైన మైలురాయి కోహ్లిని ఊరిస్తున్నది. టీ20 (T20) లలో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన కెప్టెన్ గా నిలవడానికి విరాట్ మరో 50 పరుగులు చేస్తే చాలు.. పాకిస్థాన్ (pakistan) సారథి బాబర్ ఆజమ్ (Babar Azam) ను వెనక్కినెట్టడానికి. మరి నేటి పోరులో కోహ్లి ఆ రికార్డును సాధిస్తాడా..? 

18 ఏండ్లుగా ఐసీసీ టోర్నీలలో న్యూజిలాండ్ (Newzealand) పై నెగ్గని టీమిండియా (Team india).. నేటి మ్యాచ్ లో ఆ రికార్డును చెరిపేయాలని బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే.  సెమీస్ బరిలో నిలవాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్ లో భారత్.. ఈ మ్యాచ్ లో గెలిచి తీరాల్సిందే. 

ఇక విరాట్ రికార్డుల విషయానికొస్తే.. భారత కెప్టెన్ టీ20 లలో సారథిగా 13 ఫిఫ్టీలు చేశాడు. మొన్నటి మ్యాచ్ లో బాబర్ ఆజమ్ ఆ రికార్డును సమం చేశాడు. ఇప్పటివరకు కెప్టెన్ గా 44 ఇన్నింగ్స్ లో కోహ్లి.. 13 హాఫ్ సెంచరీలు చేశాడు. బాబర్ మాత్రం 26 ఇన్నింగ్స్ లోనే ఆ ఫీట్ సాధించాడు.  నేటి మ్యాచ్ లో కోహ్లి గనుక మరో 50 పరుగులు చేస్తే 14 హాఫ్ సెంచరీలు చేసి రికార్డు నెలకొల్పుతాడు. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ESPNcricinfo (@espncricinfo)

కోహ్లి, బాబర్ తర్వాత ఈ జాబితాలో న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ (kane Williamson), ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ (aron finch), ఇంగ్లాండ్ కు నాయకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఇయాన్ మోర్గాన్ ఉన్నారు. విలియమ్సన్ 50 ఇన్నింగ్స్  లలో 11 హాఫ్ సెంచరీలు చేయగా.. ఫించ్ 51 ఇన్నింగ్సులు ఆడి 11 అర్థ సెంచరీలు చేశాడు. ఇక మోర్గాన్.. 60 ఇన్నింగ్స్ లో 9 ఫిఫ్టీలు చేశాడు. 

ఇక  అత్యధిక హాఫ్ సెంచరీలతో పాటు మరో రికార్డు కూడా కోహ్లిని ఊరిస్తున్నది. టీ20లలో అత్యధిక ఫోర్లు కొట్టిన ఆటగాడిగా విరాట్ రికార్డు సృష్టించనున్నాడు. మరో 5 ఫోర్లు కొడితే ఈ రికార్డు అతడి సొంతమవుతుంది. ప్రస్తుతం ఐర్లాండ్ కు చెందిన పీఆర్ స్టిర్లింగ్.. 295 ఫోర్లతో తొలి స్థానంలో ఉన్నాడు.  కోహ్లి (290) రెండో స్థానం. 

ఇదిలాఉండగా.. కోహ్లి ఓ చెత్త రికార్డు కూడా వెంటాడుతోంది. ఇప్పటివరకు పరిమిత ఓవర్ల క్రికెట్ లో కోహ్లిని ఐదు సార్లు ఔట్ చేసిన బౌలర్ గా న్యూజిలాండ్ ఆటగాడు ఇష్ సోధి నిలిచాడు. ఈ మ్యాచ్ లో అతడు కోహ్లిని మళ్లీ ఔట్ చేయాలని ప్రణాళికలు రచిస్తున్నాడు. మరి విరాట్.. అతడిని ఎలా ఎదుర్కుంటాడో చూడాలి. భారత్ పై కూడా సోధికి మంచి రికార్డే ఉంది. భారత్ తో ఆడిన 12 మ్యాచ్ లలో అతడు.. 17 వికెట్లు పడగొట్టాడు. 

click me!