T20 Worldcup2021: ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తున్నది.. మరి మీరో..? భారత్-పాక్ మ్యాచ్ పై ఐసీసీ జబర్ధస్త్ ప్రోమో

Published : Oct 24, 2021, 04:53 PM IST
T20 Worldcup2021: ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తున్నది.. మరి మీరో..? భారత్-పాక్ మ్యాచ్ పై ఐసీసీ జబర్ధస్త్ ప్రోమో

సారాంశం

India vs Pakistan: చిరకాల ప్రత్యర్థుల మధ్య పోరాటానికి సర్వం సిద్ధమైన వేళ ఐసీసీ ఈ మ్యాచ్ కు ముందు విడుదల చేసిన ప్రోమో.. నేటి పోరుపై మరింత హైప్ పెంచింది. 

దాయాదుల మధ్య పోరుకు అంతా సిద్ధమైంది. స్టేడియంలో హోరాహోరి తలపడటానికి రెండు జట్ల ఆటగాళ్లు  బ్యాట్లు, బంతులు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ హై ఓల్జేజీ మ్యాచ్ ను వీక్షించడానికి భారత్ , పాకిస్థాన్ తో పాటు ప్రపంచ నలుమూలల నుంచి క్రికెట్ అభిమానులు కండ్లు అప్పగించి చూస్తున్నారు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ (ICC T20 World cup 2021) లో భాగంగా గ్రూప్-2 లో ఉన్న భారత్, పాక్ (India vs Pakistan) ల మ్యాచ్ మరికొద్దిసేపట్లో దుబాయ్ వేదికగా మొదలుకానున్నది. 

చిరకాల ప్రత్యర్థుల మధ్య పోరాటానికి సర్వం సిద్ధమైన వేళ ఐసీసీ (ICC) ఈ మ్యాచ్ కు ముందు విడుదల చేసిన ప్రోమో (ICC india vs pakistan match promo).. నేటి పోరుపై మరింత హైప్ పెంచింది. ఇందులో ఇరు దేశాలకు చెందిన ఆటగాళ్ల గత ప్రదర్శనలు, హైలైట్ లతో ఐసీసీ ఈ వీడియోను రూపొందించింది. 58 సెకన్ల నిడివి ఉన్న ఈ ప్రోమోను ఐసీసీ.. సోషల్ మీడియా ఖాతాలలో పోస్టు చేసింది. 

 

నేటి సాయంత్రం 7:30 గంటలకు రెండు జట్ల మధ్య టీ20 ప్రపంచకప్ లో భాగంగా మ్యాచ్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐసీసీ విడుదల చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నది. టీ 20 ప్రపంచకప్ లో ఎన్ని మ్యాచ్ లున్నా భారత్-పాక్ కు ఉండే క్రేజే వేరు కాబట్టి ఐసీసీ కూడా ఈ ఈవెంట్ ను బాగానే సొమ్ము చేసుకుంటున్నది. 

‘టుడే ఈజ్ ది బిగ్ డే’ అంటూ మొదలయ్యే ఈ వీడియోలో.. ఒక్కొక్క పదం అభిమానుల నాడిని, రెండు దేశాల మధ్య ఉన్న వైరాన్ని తెలియజెప్పే పదాలున్నాయి.  ఇక చివర్లో ‘ప్రపంచం మొత్తం మిమ్మల్ని చూస్తుంది’ అని వ్యాఖ్యంతో వీడియో ముగుస్తుంది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరుగనున్న భారత్-పాక్ పోరుకు ముందు  విడుదలైన  ఈ వీడియో అభిమానులను అలరించడమే గాక..  చూస్తున్న ప్రేక్షకులలో మ్యాచ్ పై మరింత ఉత్కంఠను పెంచేలా చేస్తున్నది. 

PREV
click me!

Recommended Stories

స్మృతి మంధాన చేతికి టీమిండియా పగ్గాలు.. హర్మన్‌ప్రీత్ స్థానంలో కొత్త కెప్టెన్
శ్రేయాస్ అయ్యర్ విధ్వంసక సెంచరీ.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం