T20 World Cup: భారత్ పై మేమే గెలుస్తాం.. విజయంపై ధీమాగా ఉన్న పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్

By team teluguFirst Published Oct 14, 2021, 3:54 PM IST
Highlights

IND vs Pak: దాయాదుల మధ్య పోరు ఎప్పుడూ రసవత్తరమే. అభిమానులతో పాటు దేశ అధ్యక్షులు, సెలబ్రిటీలు సైతం ఈ మ్యాచ్ ను వీక్షిస్తారు. అయితే ఈసారి టీ20 వరల్డ్ కప్ లో భాగంగా భారత్ తో జరిగే మ్యాచ్ లో తామే విజయం సాధిస్తామని పాక్  సారథి బాబర్ ఆజమ్ ధీమాగా ఉన్నాడు. 

చిరకాల ప్రత్యర్థుల మధ్య సమరానికి కౌంటౌడౌన్ దగ్గరపడింది. మరో మూడు రోజుల్లో యూఏఈ వేదికగా ఐసీసీ టీ20 ప్రపంచకప్ (ICC T20 World cup) ప్రారంభంకానుండగా.. ఈనెలద 24న భారత్-పాక్  బిగ్ ఫైట్ లో తలపడనున్నాయి. అయితే రికార్డులు, గత మ్యాచ్ ఫలితాలు ఎలా ఉన్నా త్వరలో జరుగబోయే మ్యాచ్ లో విజయంపై ఎవరి ధీమా వారికుంది. ఈ నేపథ్యంలో పాక్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్ (Babar Azam) స్పందించాడు. 

భారత్ (India)తో మ్యాచ్ లో తామే విజయం సాధిస్తామని అన్నాడు. అందుకు గల ప్రణాళికలు, వ్యూహాలను అతడు వివరించాడు. ఆజమ్ మాట్లాడుతూ..  ‘యూఏఈ మాకు సొంత గ్రౌండ్ వంటిది. గత మూడు నాలుగేండ్లుగా మేం ఇక్కడ ఆడుతున్నాం. ఈ ఫిచ్  ఎలా స్పందిస్తుందో..  ఇక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయనేదానిమీద మాకు పూర్తి అవగాహన ఉంది. ఇక మ్యాచ్ రోజు ఏ జట్టు బాగా ఆడితే  ఆ జట్టు విజయం  సాధిస్తుంది. నా దృష్టిలో చెప్పాలంటే మేం (పాకిస్థాన్) విజయం సాధిస్తాం’ అని అన్నాడు. 

ఇది కూడా చదవండి: పీలే రికార్డు బద్దలుకొట్టిన భారత ఫుట్ బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రి.. సాఫ్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఇండియా

2009లో పాకిస్తాన్ (Pakistan) పర్యటనకు వెళ్లిన శ్రీలంక క్రికెటర్ల మీద ఉగ్రవాదులు దాడి చేయేడంతో అప్పట్నుంచి విదేశీ జట్టు పాక్ కు రావడం లేదు. దీంతో అవి స్వదేశానికి బదులు యూఏఈ (UAE) నే వేదికగా ఎంచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పాక్ కు యూఏఈ ఫిచ్ లు  హోమ్ గ్రౌండ్ అయ్యాయి. ఇదే విషయాన్ని ఆజమ్ ఊటంకించాడు.

అంతేగాక.. మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఒత్తిడిని కంట్రోల్ చేసుకున్న జట్టే విజయం సాధిస్తుందని ఆజమ్ చెప్పాడు. ‘ఈ మ్యాచ్ లో ఒత్తిడి ఎలా ఉంటుందో మాకు తెలుసు. మరీ ముఖ్యంగా ఇరుజట్లకు ఇది మొదటి మ్యాచ్. జట్టుగా  ఈ మ్యాచ్ లో గెలుస్తామని మాకు నమ్మకం ఉంది. గతం, భవిష్యత్ గురించి మేం ఆలోచించడం లేదు. ఆ రోజు మేం మంచి క్రికెట్ ఆడతాం’ అని అన్నాడు. 

ఇది కూడా చదవండి:భారత్-పాక్ అభిమానులను ఉర్రూతలూగించే ‘మోకా మోకా’ యాడ్ మళ్లీ వచ్చేసింది.. ఐసీసీ టోర్నీల్లో దీని క్రేజే వేరప్పా..

పాకిస్తాన్ క్రికెటర్లలో దాదాపు ఏడుగురు  సీనియర్ క్రికెటర్లున్నారని,  వారి అనుభవం జట్టకు ఎంతో ఉపయోగపడుతుందని ఆజమ్ అన్నాడు.  అంతేగాక ఆసీస్ మాజీ ఓపెనర్ మాథ్యూ హెడెన్, సౌతాఫ్రికా స్పీడ్ బౌలర్ ఫిలాండర్ సేవలు జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతాయని చెప్పాడు. ఆ ఇద్దరూ ఇప్పటికే ఆటగాళ్ల మీద ఫోకస్ చేశారని తెలిపాడు. కాగా, వార్మప్ మ్యాచ్ లలో భాగంగా పాకిస్తాన్ 18న వెస్టిండీస్, 20 న దక్షిణాఫ్రికా తో తలపడనుంది. 

click me!