వాళ్లిద్దరితో ఓపెనింగ్ చేయించి, కోహ్లీ వన్‌డౌన్‌లో రావాలి... టీ20 వరల్డ్‌కప్ జట్టుపై వీరేంద్ర సెహ్వాగ్...

By Chinthakindhi RamuFirst Published Oct 14, 2021, 3:53 PM IST
Highlights

T20 World cup 2021 టోర్నీలో ఓపెనింగ్ చేసే ఆలోచన ఉందని చెప్పిన విరాట్ కోహ్లీ... ఐపీఎల్ 2021 సీజన్‌లోనూ ఓపెనర్‌గా వచ్చిన విరాట్... మంచి ఫామ్‌లో ఉన్న కెఎల్ రాహుల్‌ను ఓపెనర్‌గా పంపిస్తే బెటర్ అంటున్న వీరేంద్ర సెహ్వాగ్...

ఐపీఎల్ 2021 సీజన్‌ ఫైనల్ మ్యాచ్‌తో ముగియనుంది. టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ కోసం ప్రిపరేషన్స్ కూడా మొదలెట్టేసింది భారత జట్టు. ఐపీఎల్ ఆరంభానికి ముందే టీ20 వరల్డ్‌కప్‌లో ఓపెనింగ్ చేసే ఆలోచన ఉందని భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ కామెంట్ చేశాడు. అందులో భాగంగానే ఐపీఎల్ 2021లో దేవ్‌దత్ పడిక్కల్‌తో కలిసి ఓపెనింగ్ చేశాడు కోహ్లీ...

అయితే సీజన్‌లో ఆడపాదడపా మ్యాచులు మినహా ఓపెనర్‌గా విరాట్ కోహ్లీ సక్సెస్ అయ్యింది చాలా తక్కువ. దీంతో కోహ్లీ ఓపెనర్‌గా రావడం కంటే, తనకి అచొచ్చిన వన్‌డౌన్ పొజిషన్‌లో వస్తేనే బాగుంటుందని కామెంట్ చేశాడు వీరేంద్ర సెహ్వాగ్...

‘నేను టీమిండియా సహాయక సిబ్బందిలో ఉంటే, విరాట్ కోహ్లీని వన్‌డౌన్‌లో వచ్చేలా ఒప్పించే వాడిని. ఎందుకంటే కెఎల్ రాహుల్ చాలా చక్కగా ఆడుతున్నాడు. అతనితో పాటు రోహిత్ శర్మను ఓపెనింగ్ పంపిస్తే, మంచి ఫలితం దక్కుతుంది...

సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్, అనిల్ కుంబ్లే, ఎమ్మెస్ ధోనీ వంటి మాజీ కెప్టెన్లు కూడా ఇద్దరు ముగ్గురు స్టాఫ్ చెప్పే సలహాలను శ్రద్ధగా వినేవాళ్లు. అందుకే వాళ్లు కూడా ఏ మొహమాటం లేకుండా సలహాలు, సూచనలు చేసేవాళ్లు...

అందుకే నాకు తెలిసి విరాట్ కోహ్లీకి సలహా ఇచ్చేందుకు ఇప్పుడు కోచింగ్ స్టాఫ్ పెద్దగా ధైర్యం చేయకపోవచ్చు. కోహ్లీ ఓపెనింగ్ చేయాలని ఫిక్స్ అయ్యాక, వద్దు... వన్‌డౌన్‌లో బ్యాటింగ్ చెయ్, బాగుంటుంది... అని చెప్పేవాళ్లు ఉండాలి...

కెఎల్ రాహుల్ ఐపీఎల్‌లో అదరగొట్టాడు. వరుసగా రెండు సీజన్లలోనూ 600+ పరుగులు చేశాడు. కాబట్టి ఎలాంటి ఒత్తిడి లేకుండా పరుగులు చేయగలడు... కుదురుకుంటే రాహుల్ ఎంత డేంజరస్ ప్లేయరో తెలిసిందే...’ అంటూ కామెంట్ చేశాడు మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్...

ఐపీఎల్ 2021 సీజన్‌లో 13 మ్యాచులు ఆడిన కెఎల్ రాహుల్, 62.60 సగటుతో 6 హాఫ్ సెంచరీలతో 626 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో టాప్‌లో నిలిచాడు. 15 మ్యాచులు ఆడిన విరాట్ కోహ్లీ, 28.92 సగటుతో 405 పరుగులు చేశాడు. ఇందులో 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 

click me!