ప్రతి ఇన్నింగ్స్ ఎంత ముఖ్యమో నాకు తెలుసు.. య‌శ‌స్వి జైస్వాల్ కామెంట్స్ వైరల్ !

By Mahesh RajamoniFirst Published Feb 19, 2024, 1:40 PM IST
Highlights

Yashasvi Jaiswal: భార‌త్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ లో ఇప్ప‌టికే య‌శ‌స్వి జైస్వాల్ రెండు డ‌బుల్ సెంచ‌రీలు సాధించాడు. రెండో టెస్టులో విశాఖ‌లో, మూడో టెస్టులో రాజ్ కోట్ లో ప‌రుగుల వ‌ర‌ద పారించాడు. 
 

Yashasvi Jaiswal : టీమిండియా యంగ్ ఓపెన‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ ప‌రుగుల వ‌ర‌ద పారిస్తూ టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ గా  ఎదుగుతున్నాడు. అత‌ని ఇప్ప‌టివ‌ర‌కు సాగించిన ప్ర‌యాణం ఎంతో మందికి స్ఫూర్తిదాయ‌కం. ముంబైలోని స్ల‌మ్స్ నుంచి టీమిండియా ఓపెన‌ర్ గా సాగిన అత‌ని జీవిత‌తం యువ‌కుల‌కు ఆద‌ర్శంగా నిలుస్తోంది. స్వ‌స్థ‌లం ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అయిన‌ప్ప‌టికీ.. ముంబై మారిన‌ప్పుడు జైశ్వాల్ వ‌య‌స్సు 13 సంవ‌త్స‌రాలు. అప్పుడు నిత్యం పోరాటంగానే అత‌ని జీవితం ముందుకు సాగింది. ఆ ప్రారంభ పోరాటాల నుంచే నేడు దిగ్గ‌జ క్రికెట‌ర్ల స‌ర‌స‌న చేరేలా మారాడు. ప‌రుగుల దాహంతో ఉర‌క‌లేస్తున్నాడు. తన కెరీర్లో కేవలం ఏడు టెస్టులు మాత్రమే ఆడిన జైస్వాల్ తన తొలి మూడు టెస్టు సెంచరీలను 150+ స్కోర్లుగా మార్చిన క్రికెటర్ల ప్రత్యేక జాబితాలో చేరాడు.

India vs England : టీమిండియా గెలుపులో ఆరుగురు హీరోలు.. !

"భారతదేశంలో మీరు ఎదుగుతున్న క్ర‌మంలో ప్రతిదానికీ చాలా కష్టపడతారు" అని 22 ఏళ్ల ఋ యంగ్ ప్లేయ‌ర్ హోస్ట్ బ్రాడ్కాస్టర్ తో చెప్పాడు. తాను ఉన్న ప‌రిస్థితుల‌ను గురించి ప్ర‌స్తావిస్తూ.. "బస్సు ఎక్కేటప్పుడు కూడా బస్సు ఎక్కాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. మీరు రైలు, ఆటో, ప్రతిదానికి చేరుకోవడానికి చాలా కష్టపడాలి. నేను నా చిన్నప్పటి నుండి అలా చేశాను. అందుకే ప్రతి ఇన్నింగ్స్ ఎంత ముఖ్యమైనదో నాకు తెలుసు, అందుకే నేను నా ప్రాక్టీస్ సెషన్లలో కష్టపడతాను. ప్రతి ఇన్నింగ్స్ నాకు.. నా జట్టుకు లెక్కించబడుతుంది. ఇది నా దేశం కోసం ఆడటానికి నా అతిపెద్ద ప్రేరణ.. నేను అక్కడ ఉన్నప్పుడల్లా నేను తిరిగి ఇవ్వాల్సిన అవసరం ఉందని నేను నిర్ధారించుకుంటాను. దాని కోసం 100కు వంద శాతం ప‌నిచేస్తాను.." అని జైస్వాల్ పేర్కొన్నాడు.

 

 

వైజాగ్ లో ఉత్కంఠభరితంగా డబుల్ సెంచరీతో చెల‌రేగిన య‌శ‌స్వి జైస్వాల్.. రాజ్ కోట్ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో తక్కువ స్కోరుకే మార్క్ వుడ్ చేతిలో ఔట్ అయ్యాడు. టెస్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 33/3తో క‌ష్టాల్లో ప‌డింది. ఈ క్ర‌మంలో రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా డబుల్ సెంచరీ భాగస్వామ్యంతో ఆదుకున్నారు. తొలి ఇన్నింగ్స్ లో రోహిత్ భాయ్, జడ్డూ భాయ్ ఆడిన తీరు తనను ఎంతగానో ప్రేరేపించిందని జైస్వాల్ వెల్లడించాడు. "అభిరుచి ఉంది, చర్చ ఉంది, వారు సెషన్ వారీగా ఆడాలని నిశ్చయించుకున్నారు. నేను డ్రెస్సింగ్ రూమ్ లోపల ఉన్నప్పుడు నేను గ్రౌండ్ కు వెళ్లిన త‌ర్వాత అదే చేయాల‌ని అనుకున్నాను. వారు ఆట గురించి మాట్లాడుతున్న తీరు, మమ్మల్ని ప్రేరేపించిన తీరు, వారు ఎంతో శ్రమించడం న‌న్ను మ‌రింత గొప్ప బ్యాటింగ్ చేసేలా చేసింది" అని తెలిపాడు.

IND vs ENG: కోహ్లీ, ధోని, గంగూలీల రికార్డులను బ్రేక్ చేసిన రోహిత్ శర్మ

అంతర్జాతీయ క్రికెట్ లో అత్యుత్తమ స్వభావం ఉన్న తనను కోచ్ లు రాహుల్ ద్రావిడ్, విక్రమ్ రాథోడ్ లు అభినందించారని జైస్వాల్ పేర్కొన్నాడు. 'ఒక క్రికెటర్ గా నేను ఎప్పుడూ భావోద్వేగంతోనే వెళ్తాను. కొన్నిసార్లు నేను బాగా ఆడ‌తాను. మ‌రి కొన్నిసార్లు అలా ఉండ‌క‌పోవ‌చ్చు. కానీ, మా టీం చెప్పే విష‌యాల‌తో న‌న్ను ఎంత‌గానో ప్రేరేపిస్తాయి. దానిని వాస్త‌వం చేసేలా నేను కృషి  చేస్తాను అని జైస్వాల్ పేర్కొన్నాడు. తాను గేమ్ ఆడ‌టానికి మ‌రింత స్వేచ్ఛ‌ను కూడా అందించార‌ని చెప్పాడు. స్వీప్, రివ‌ర్స్ స్వీప్  ఆడ‌తాన‌నీ వారికి తెలుసు కానీ, బంతి ఎలా వుంద‌నేది నిర్దారించుకున్న త‌ర్వాత అలాంటి షాట్స్ ఆడ‌తాన‌ని చెప్పాడు.

"రోహిత్ భాయ్, రాహుల్ భాయ్ వంటి సీనియర్లతో నేను ఆటకు ఎలా సన్నద్ధం కావాలో, నా మనసును ఎలా మార్చుకోవాలో ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటాను. నా మనస్సుపై పనిచేయడం చాలా ముఖ్యం అని నేను అనుకుంటున్నాను.. నేను నిజంగా నా మనస్సుపై పనిచేయడానికి ప్రయత్నిస్తాను, ఆపై నన్ను నేను వ్యక్తీకరించడానికి ప్రయత్నిస్తాను" అని యశస్వి జైస్వాల్ తెలిపాడు.

పిల్లలు బరువు పెరగడం లేదా..? ఈ ఫుడ్స్ పెట్టండి..!

click me!