చాలా ఉన్నాయి, కానీ సచిన్ తో మాత్రం స్పెషల్ : ప్రజ్ఞాన్ ఓజా

By telugu news teamFirst Published Feb 22, 2020, 10:54 AM IST
Highlights

తన ఈ క్రికెట్ జీవితంలో చాలా మధుర స్మృతులు ఉన్నాయన్నాడు. కానీ సచిన్ చేతుల మీదుగా టెస్ట్ క్యాప్ అందుకోవడం మాత్రం తన జీవితంలో అత్యంత అద్భుతమైన విషయమని.. దానిని మాత్రం ఎప్పిటికీ మర్చిపోనని చెప్పాడు.

భారత స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తాను తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించాడు. తక్షణమే తాను దాన్ని అమలులో పెడుతున్నట్లు కూడా చెప్పాడు.  అంతర్జాతీయ క్రికెట్ నుంచి మాత్రమే కాకుండా దేశవాళీ క్రికెట్ నుంచి కూడా తప్పుకుంటున్నట్లు తెలిపాడు. 

తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తానని ఆయన చెప్పారు. ట్విట్టర్ వేదికగా ఆయన తన రిటైర్మెంట్ విషయాన్ని ప్రకటించాడు. ఈ రిటైర్మెంట్ సందర్భంగా తన క్రికెట్ జీవితంలో తనకు ఉన్న కొన్ని మధురస్మృతుల గురించి ఓజా వివరించాడు.

తన ఈ క్రికెట్ జీవితంలో చాలా మధుర స్మృతులు ఉన్నాయన్నాడు. కానీ సచిన్ చేతుల మీదుగా టెస్ట్ క్యాప్ అందుకోవడం మాత్రం తన జీవితంలో అత్యంత అద్భుతమైన విషయమని.. దానిని మాత్రం ఎప్పిటికీ మర్చిపోనని చెప్పాడు.

ఆ కప్ అందుకున్న నాటి  సందర్భాన్ని కూడా ఓజా గుర్తు చేసుకున్నాడు. ‘‘ సచిన్ టెండుల్కర్ సర్ చేతుల మీదుగా టెస్ట్ క్యాప్ అందుకోవడం నేను జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేను. ఆ సమయంలో నేను చాలా నెర్వస్ గా ఫీలయ్యాను. కానీ... ఆయన నన్ను కంఫర్ట్ గా ఫీలయ్యేలా  చేశారు. భారత్ తరపున ఆడటం అనేది చాలా గొప్ప విషయం. అందులోనూ సచిన్ సర్ లాంటి వ్యక్తి స్వాగతం పలకడం ఇంకా గొప్ప అనుభూతి’ అంటూ ప్రజ్ఞాన్ ఓజా ఆనాటి రోజులను గుర్తు చేసుకున్నాడు. 

Also Read సెకండ్స్ ఇన్నింగ్స్ క్లబ్ కు వెల్కమ్: ప్రజ్ఢాన్ ఓజా రిటైర్మెంట్ పై సచిన్...

ఓజా 2009లో శ్రీలంకపై జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లో ప్రవేశించాడు. అంతర్జాతీయ టెస్టు క్రికెట్ లో ఆయన 24 మ్యాచుల్లో 113 వికెట్లు తీసుకున్నాడు. 33 ఏళ్ల ఓజా భారత్ తరఫున 18 అంతర్జాతీయ వన్డేలు, 6 అంతర్జాతీయ టీ20 మ్యాచులు ఆడాడు.

వన్డేల్లో ఓజా 21 వికెట్లు తీసుకోగా, టీ20ల్లో 10 వికెట్లు తీసుకన్నాడు. ఒడిశాలో పుట్టిన ప్రజ్ఞాన్ ఓజా2013లో వెస్టిండీస్ పై జరిగిన మ్యాచులో చివరిసారిగా ఆడాడు. అది 2013లో సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ మ్యాచ్. ఇక కుమారుడు యోహాన్ కు జీవితానికి సంబంధించిన పాఠాలు చెప్పడం తన లక్ష్యమని ఓజా అన్నాడు. 
 

click me!