"అంతా నువ్వే చేసావ్"... పంత్ రన్ అవుట్ పై రహానేను దుమ్మెత్తిపోస్తున్న నెటిజెన్లు

Published : Feb 22, 2020, 09:47 AM ISTUpdated : Feb 22, 2020, 09:54 AM IST
"అంతా నువ్వే చేసావ్"... పంత్ రన్ అవుట్ పై రహానేను దుమ్మెత్తిపోస్తున్న నెటిజెన్లు

సారాంశం

చాలా కాలంగా రిజర్వు బెంచ్ కు మాత్రమే పరిమితమైన రిషబ్ పంత్ కు అనూహ్యంగా ఈ టెస్టులో అవకాశం లభించింది. టీములో ఉన్న ఏకైక లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్ మెన్. పిచ్ పై ఒకింత కుదురుకున్నట్టుగానే కనబడుతున్న పంత్ ను అనవసర రన్ కోసం పిలిచి రహానే రన్ అవుట్ చేసాడని..."అంతా నువ్వే చేసావ్"అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

వెల్లింగ్టన్: టెస్టు క్రికెట్లో తీసే ఒక్కో పరుగు ఎంతో అమూల్యమైనది. పరుగు తీయడంకంటే వికెట్లను కాచుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తుంటారు. అలాంటి టెస్టు క్రికెట్లో రన్ అవుట్ అవడమనేదాన్ని అందరూ చాలా సీరియస్ గా పరిగణిస్తుంటారు. ఇప్పుడు న్యూజీలాండ్  తో జరుగుతున్న టెస్టు సిరీస్ లో కూడా ఇలాంటిదే ఒక ఘటన చోటు చేసుకుంది.

చాలా కాలంగా రిజర్వు బెంచ్ కు మాత్రమే పరిమితమైన రిషబ్ పంత్ కు అనూహ్యంగా ఈ టెస్టులో అవకాశం లభించింది. టీములో ఉన్న ఏకైక లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్ మెన్. పిచ్ పై ఒకింత కుదురుకున్నట్టుగానే కనబడుతున్న పంత్ ను అనవసర రన్ కోసం పిలిచి రహానే రన్ అవుట్ చేసాడని..."అంతా నువ్వే చేసావ్"అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

సౌతీ వేసిన 59 వ ఓవర్‌ రెండో బంతిని రహానే ఆఫ్‌సైడ్‌ వైపుగా తరలించి పరుగు తీయాలని ఆరాటపడ్డాడు. అయితే బంతి ఫీల్డర్‌ కి చేరువవడంతో అవతలి ఎండోలో ఉన్న పంత్‌ పరుగు తీయడానికి తటపటాయించాడు.

కానీ అప్పటికే సగం పిచ్ వరకు రహానే వచ్చేయడంతో..... చేసేదేమి లేక పంత్‌ కూడా పరుగు తీసాడు. అప్పటికే బంతి అందుకున్న ఫీల్డర్ అజాజ్‌ పటేల్‌ నేరుగా స్ట్రైకర్స్ ఎండ్ వైపుగా వికెట్ల మీదకు త్రో విసిరాడు.

పంత్‌ ఇంకా క్రీజులోకి అడుగుపెట్టకపోవడంతో.... రనౌట్‌ గా భారంగా క్రీజు వదిలి వెళ్లాడు పంత్. ఇలా అనవసరపు పరుగు కోసం... అందునా వికెట్లు లేని వేళా రహానే లాంటి సీనియర్ ఆటగాడు ప్రయత్నించడం ఎంతవరకు సబబని నెటిజన్లు రహానే పై విరుచుకుపడుతున్నారు.

So looks like Pant’s run out is the first time Ajinkya Rahane has involved in a run out dismissal in his Test career of 63 Test matches! @MazherArshad #NZvInd https://t.co/qgHarxWLvH
— Bharath Seervi (@SeerviBharath) February 21, 2020

అయితే... ఇప్పటివరకు 64 టెస్టులు ఆడిన రహానే ఇలా తన సహచరుడిని రన్ అవుట్ చేసిన చరిత్ర లేదు. ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఒక్కసారిగా రహానే ఇలా చేయడంతో స్టేడియం లో ఉన్నవారితోసహా... అంతా నిర్ఘాంతపోయారు. ఇక సోషల్ మీడియాలో అయితే భలే ఫన్నీ కామెంట్స్ వచ్చాయి.

PREV
click me!

Recommended Stories

Fastest ODI Double Century : వన్డేల్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ.. బద్దలైన మాక్స్‌వెల్, గేల్ రికార్డులు
IND vs SA : టీ20 క్రికెట్ అంటే అంతే బాసూ.. సూర్యకుమార్ యాదవ్ భయం అదే !