Latest Videos

ప్ర‌త్య‌ర్థుల‌కు వెస్టిండీస్ స్ట్రాంగ్ మెసేజ్.. షాయ్ హోప్ సూపర్ ఇన్నింగ్స్ తో అమెరికా ఓటమి

By Mahesh RajamoniFirst Published Jun 22, 2024, 9:56 AM IST
Highlights

US vs WI , T20 World Cup 2024: అతిథ్య వెస్టిండీస్ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2024 లో అద‌ర‌గొడుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ లో అద‌ర‌గొడుతూ ప్ర‌త్య‌ర్థి జ‌ట్ల‌ను భ‌య‌పెడుతున్న‌ది. ఈ క్ర‌మంలోనే షాయ్ హోప్ సూప‌ర్ ఇన్నింగ్స్ తో అమెరికాను చిత్తుగా ఓడించింది. 
 

US vs WI , T20 World Cup 2024:  టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2024 46వ మ్యాచ్ లో అతిథ్య దేశాలైన వెస్టిండీస్-అమెరికా జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. ఇరు జ‌ట్ల‌కు సూప‌ర్-8లో తొలి మ్యాచ్ కాగా, బ్యాటింగ్, బౌలింగ్ లో అద‌రగొట్టిన వెస్టిండీస్... యూఎస్ఏను 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన వెస్టిండీస్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా జ‌ట్టు 128 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. ల‌క్ష్యఛేద‌న‌లో షాయ్ హోప్ సూప‌ర్ ఇన్నింగ్స్ తో అద‌ర‌గొట్టాడు. 39 బంతుల్లో 82 పరుగుల ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ తో వెస్టిండీస్ శుక్రవారం యూఎస్ఏను చిత్తు చేసింది. టీ20 ప్రపంచ కప్ సూపర్-8లో 9 వికెట్ల తేడాతో.. 9.1 ఓవర్లు మిగిలి ఉండగానే విండీస్ జ‌ట్టు విజ‌యాన్ని అందుకుంది. 

టోర్నమెంట్ కో-హోస్ట్‌ల ఫైట్ లో కరీబియన్ జట్టు యూఎస్ఏను 128 పరుగులకు ఆలౌట్ చేసింది. 10.5 ఓవర్లలో టార్గెట్ ను అందుకుంది. వెస్టిండీస్ కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆరంభంలోనే అమెరికా జ‌ట్లు వికెట్లు చేజార్చుకుంది. ఆండ్రీస్ గౌస్ 29, కుమార్ 20 , మిలింద్ కుమార్ 19 ప‌రుగులు చేయ‌గా, మిగ‌తా ప్లేయ‌ర్లు రాణించ‌లేక‌పోయారు. దీంతో 19.5 ఓవ‌ర్ల‌లో యూఎస్ఏ జ‌ట్టు 128 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది.

టీమిండియాను టెన్షన్ పెడుతున్న రోహిత్ శర్మ-విరాట్ కోహ్లీ

విండీస్ బౌలింగ్ లో రోస్టన్ చేజ్ 3, ఆండ్రీ ర‌స్సెస్ 3, అల్జారీ జోసెఫ్ 2 వికెట్లు తీసుకున్నారు. బ్యాటింగ్ లో షాయ్ హోప్ ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ ఆడాడు. 39 బంతుల్లో 82 పరుగుల ఇన్నింగ్స్ తో విండీస్ జ‌ట్టుకు విజ‌యాన్ని అందించాడు. హోప్ త‌న ఇన్నింగ్స్ తో 4 ఫోర్లు, 8 సిక్స‌ర్ల‌తో అజేయంగా నిలిచాడు. నికోల‌స్ పూర‌న్ 27 ప‌రుగుల‌తో నాటౌట్ గా జ‌ట్టును విజ‌య‌తీరాల‌కు చేర్చాడు. ఈ వ‌ర‌ల్డ్ క‌ప్ లో సిక్స‌ర్ల రికార్డు బ్రేక్ అయింది. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2024లో ఈ మ్యాచ్ వ‌ర‌కు 412 సిక్సర్లు న‌మోద‌య్యాయి. దీంతో గ‌తంలో అత్య‌ధిక సిక్స‌ర్లు న‌మోదైన 2021లో 405 సిక్స‌ర్ల రికార్డు బ్రేక్ అయింది. 

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఒక‌ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయ‌ర్లు..

11 - క్రిస్ గేల్ (WI) vs ENG, ముంబై, 2016
10 - క్రిస్ గేల్ (WI) vs SA, జోహన్నెస్‌బర్గ్, 2007
10 - ఆరోన్ జోన్స్ (USA) vs CAN, డల్లాస్, 2024
8 - రోసౌ (SA) vs BAN, సిడ్నీ, 2022
8 - నికోలస్ పూరన్ (WI) vs AFG, గ్రాస్ ఐలెట్, 2024
8 - షాయ్ హోప్ (WI) vs USA, బ్రిడ్జ్‌టౌన్, 2024

ఉత్కంఠ పోరులో సౌతాఫ్రికా చేతిలో 7 ప‌రుగుల తేడాలో ఇంగ్లాండ్ ఓట‌మి

click me!