రోహిత్ శర్మ కోసం మ్యాచ్ మధ్యలోనే బంగ్లాదేశ్ ప్లేయర్ తో ధోని బిగ్ ఫైట్

By Mahesh RajamoniFirst Published Jun 22, 2024, 10:31 AM IST
Highlights

India-Bangladesh players big fight : క్రికెట్ గ్రౌండ్ లో భారత్, బంగ్లాదేశ్ ఆటగాళ్లు చాలా సార్లు బిగ్ ఫైట్ చేశారు. ఎప్పుడూ కూల్ గా ఉండే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (ఎంఎస్ ధోని) సైతం మ‌న ప్లేయ‌ర్ల తో దురుసుగా ప్ర‌వ‌ర్తిస్తే వారికి త‌న‌దైన స్టైల్లో గుణ‌పాఠం చెప్పాడు. 
 

India-Bangladesh players fight : టీ20 ప్ర‌పంచ క‌ప్ లో భార‌త్-బంగ్లాదేశ్ మ్యాచ్ అంటే ఉత్కంఠ‌, ఉద్రిక్త‌త‌లు మ‌స్తు క‌నిపిస్తాయి. టీ20 ప్రపంచకప్ 2024 సూపర్-8 మ్యాచ్‌లో శ‌నివారం భారత్, బంగ్లాదేశ్ మధ్య జ‌రిగే మ్యాచ్ లో హోరాహోరీ క‌నిపించ‌డం ఖాయం. ఇరు దేశాల మధ్య ఆంటిగ్వాలో భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటల నుంచి మ్యాచ్ జరగనుంది. క్రికెట్ మైదానంలో భారత్, బంగ్లాదేశ్ ఆటగాళ్ల మధ్య గతంలో చాలా గొడవలు జరిగాయి. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (ఎంఎస్ ధోని) క్రికెట్ మైదానంలో చాలా ప్రశాంతంగా ఉంటాడు. అయితే, మ‌నోళ్ల ద‌గ్గ‌ర దురుసుగా ప్ర‌వ‌ర్తిస్తే త‌న‌దైన స్టైల్లో గుణ‌పాఠం చెబుతాడు.

రోహిత్ కు అడ్డొచ్చిన‌ బంగ్లాదేశ్ ఆటగాడితో ధోనీ గొడవ.. 

Latest Videos

క్రికెట్ కెరీర్‌లో చాలా కూల్‌గా ఉన్న మహేంద్ర సింగ్ ధోని (ఎంఎస్ ధోని) కోపంతో క‌నిపించ‌డం చాలా అరుదుగా క‌నిపిస్తుంది. అయితే ఒకసారి బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ చేసిన ప‌నికి ధోని తీవ్రంగా ఆగ్ర‌హానికి గుర‌య్యాడు. ధోని కోపం తెప్పించిన అత‌ను భారీ మూల్యం కూడా చెల్లించుకోవాల్సి వచ్చింది. జూన్ 2015, బంగ్లాదేశ్‌లోని మీర్పూర్‌లో ఆతిథ్య జట్టుతో టీమ్ ఇండియా వన్డే మ్యాచ్ ఆడుతున్నప్పుడు జ‌రిగింది. భారత ఇన్నింగ్స్ సమయంలో, ముస్తాఫిజుర్ పదే పదే బ్యాట్స్‌మన్‌కు అడ్డుగా వస్తున్నాడు. ఈ సమయంలో ఒక‌సారి రోహిత్ శర్మ కూడా అతన్ని హెచ్చరించాడు, అయినప్పటికీ అంపైర్ వచ్చి విషయాన్ని శాంతింపజేశాడు. ముస్తాఫిజుర్ రెహ్మాన్ తన చేష్టలను మానుకోకుండా బ్యాటింగ్ చేస్తున్న మహేంద్ర సింగ్ ధోని (ఎంఎస్ ధోని)కి అడ్డుగా నిలిచాడు, అయితే ఈసారి ధోనీకి కోపం వచ్చి ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను బలంగా ఢీకొట్టి పరుగును పూర్తి చేశాడు.

టీమిండియాను టెన్షన్ పెడుతున్న రోహిత్ శర్మ-విరాట్ కోహ్లీ

బౌలింగ్ చేసిన తర్వాత, ముస్తాఫిజుర్ రెహమాన్ పదే పదే క్రీజులో బ్యాట్స్‌మెన్ లైన్‌లోకి వస్తుండగా, ధోనీ రన్నింగ్‌లో చాలా ఇబ్బంది పడ్డాడు, అందుకే ధోనీ ఈ పని చేశాడు. ముస్తాఫిజుర్‌కు గుణపాఠం చెప్పేందుకు ధోనీ ఇలా చేశాడు. చాలా మంది క్రికెట్ అభిమానులు ఈ సంఘటనను చూసి ఆశ్చర్యపోయారు, ఎందుకంటే ధోనీ సాధారణంగా కోపం తెచ్చుకోడు.. అతను ఇలా కూడా చేయడు. కానీ, రోహిత్ శ‌ర్మ‌తో పాటు త‌న‌ను ప‌దేప‌దే ఇబ్బంది క‌లుగ‌జేస్తుండ‌టంతో ధోని ఇలా చేశాడు. ఈ ఘ‌ట‌న‌లో ధోనీకి మ్యాచ్ ఫీజులో 75%, ముస్తాఫిజుర్‌కి 50% జరిమానా విధించారు.

 

When M S Dhoni taught Mustafizur a lesson he'll never forget 😉😅🔥
Saw this & just had to share it -
E N J O Y ⚡👊🇮🇳 https://t.co/uV1RCvQGaP pic.twitter.com/j0MH6Fk4PW

— Sushant Mehta (@SushantNMehta)

 

ప్ర‌త్య‌ర్థుల‌కు వెస్టిండీస్ స్ట్రాంగ్ మెసేజ్.. షాయ్ హోప్ సూపర్ ఇన్నింగ్స్ తో అమెరికా ఓటమి 

click me!