విజయ్ హాజరే ట్రోఫీలో చరిత్ర సృష్టించిన హిమాచల్‌ ప్రదేశ్... తమిళనాడుతో ఫైనల్ మ్యాచ్‌‌లో...

Published : Dec 26, 2021, 05:42 PM ISTUpdated : Dec 26, 2021, 05:45 PM IST
విజయ్ హాజరే ట్రోఫీలో చరిత్ర సృష్టించిన హిమాచల్‌ ప్రదేశ్... తమిళనాడుతో ఫైనల్ మ్యాచ్‌‌లో...

సారాంశం

Vijay Hazare Trophy Final: హిమాచల్ ప్రదేశ్‌కి మొట్టమొదటి దేశవాళీ టైటిల్... వీజేడీ పద్ధతిలో తమిళనాడుపై ఫైనల్‌లో విజయం అందుకుని సరికొత్త చరిత్ర...

విజయ్ హాజరే ట్రోఫీ ఫైనల్‌లో హిమాచల్ ప్రదేశ్ చరిత్ర సృష్టించింది. బ్యాడ్‌లైట్ కారణంగా అర్ధాంతరంగా నిలిచిన ఫైనల్ మ్యాచ్‌లో విజేడీ (వి జయదేవన్‌ పద్ధతి) ప్రకారం విజయాన్ని అందుకుంది హిమాచల్ ప్రదేశ్...  హిమాచల్ ప్రదేశ్ దేశవాళీ టోర్నీలో టైటిల్ గెలవడం ఇదే తొలిసారి.  టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన తమిళనాడు జట్టు 49.4 ఓవర్లలో 314 పరగులకి ఆలౌట్ అయ్యింది. ఓపెనర్ అపరాజిత్ 2, ఎన్ జగదీశన్ 9, సాయి కిషోర్ 18 పరుగులు, మురుగన్ అశ్విన్ 7 పరుగులు చేసి అవుట్ కావడంతో 40 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది తమిళనాడు.

Read: మా పాప అలా చేస్తుంటే, ఏడుపు వచ్చేసింది... చారిత్రక సిడ్నీ టెస్టుకి ముందు రవిచంద్రన్ అశ్విన్...

అయితే ఈ దశతో వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ 103 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 116 పరుగులు చేసి, తమిళనాడును ఆదుకున్నాడు... ఇంద్రజిత్‌తో కలిసి ఐదో వికెట్‌కి 202 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు దినేశ్ కార్తీక్. విజయ్ హాజారే ట్రోఫీ ఫైనల్‌లో సెంచరీ చేయడం దినేశ్ కార్తీక్‌కి ఇది రెండోసారి. 

 

కెప్టెన్ విజయ్ శంకర్ 16 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 22 పరుగులు చేయగా షారుక్ ఖాన్ 21 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 42 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు. వాషింగ్టన్ సుందర్ 1, సిల్వబరసన్ 1 పరుగు చేసి పెవిలియన్ చేరారు. హిమాచల్ ప్రదేశ్ కెప్టెన్ రిషి ధావన్ 3 వికెట్లు తీయగా, పంకజ్ జైస్వాల్ 4 వికెట్లు పడగొట్టాడు. 

315 పరుగుల భారీ టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన హిమాచల్ ప్రదేశ్‌కి శుభారంభం దక్కింది. ఓపెనర్లు తొలి వికెట్‌కి 60 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 21 పరుగులు చేసి ప్రశాంత్ చోప్రా, అవుటైన తర్వాత కొద్దిసేపటికే దిగ్విజయ్ రంగి డకౌట్ కావడంతో వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయింది హిమాచల్ ప్రదేశ్. 

నిఖిల్ గంగ్టా 18 పరుగులు చేసి అవుటైనా అమిత్ కుమార్, ఓపెనర్ శుబ్‌మన్ అరోరా కలిసి నాలుగో వికెట్‌కి 148 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 79 బంతుల్లో 6 ఫోర్లతో 74 పరుగులు చేసిన అమిత్ కుమార్ అవుటైనా కెప్టెన్ రిషి ధావన్‌తో కలిసి స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు ఓపెనర్ శుబ్‌మన్ అరోరా...

131 బంతుల్లో 13 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 136 పరుగులు చేసి అజేయంగా నిలిచిన శుబ్‌మన్ అరోరా, ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గెలవగా, రిషి ధావన్ 23 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 42 పరుగులు చేశాడు. 47.3 ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది హిమాచల్ ప్రదేశ్. 

Read Also: అజింకా రహానే అదరగొడితే, ఆ ఇద్దరి పరిస్థితి ఏంటి... శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారిలకు...

అయితే అప్పటికే మబ్బులు పట్టి, బంతి కనిపించకపోవడంతో ఆటను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు అంపైర్లు. వీజేడీ పద్ధతి ప్రకారం హిమాచల్ ప్రదేశ్ కావాల్సిన పరుగుల కంటే 11 పరుగులు ఎక్కువ చేయడంతో వారిని విజేతలుగా నిర్ణయించారు...

 

PREV
click me!

Recommended Stories

ఆక్షన్‌లోకి కొత్త సరుకొచ్చింది బాసూ.! వీళ్ల కోసం గట్టి పోటీ.. ఆ ప్లేయర్స్ ఎవరంటే.?
'మాకు డబ్బులు లేవు సార్'.. టాప్ కుర్రోళ్లపైనే ముంబై టార్గెట్..