Ashes 2021-22: డకౌట్లలో హాఫ్ సెంచరీ కొట్టిన ఇంగ్లాండ్.. ఈ ఏడాది చెత్త రికార్డు రూట్ సేనదే..

Published : Dec 26, 2021, 04:21 PM IST
Ashes 2021-22: డకౌట్లలో హాఫ్ సెంచరీ కొట్టిన  ఇంగ్లాండ్.. ఈ ఏడాది చెత్త రికార్డు రూట్ సేనదే..

సారాంశం

Record 50 Ducks in 2021: క్రికెట్ పుట్టినిల్లుగా పేరుగాంచిన ఇంగ్లాండ్ మరో చెత్త రికార్డును తన పేరిట నమోదు చేసుకుంది. ఈ ఏడాది అత్యధిక మంది సున్నా పరుగులకే వెనుదిరిగింది ఆ జట్టులోనే.. 

ప్రపంచ క్రికెట్ లోని ఏ జట్టూ కోరుకోని ఓ చెత్త రికార్డును ఇంగ్లాండ్ నమోదు చేసింది.  ఈ ఏడాది టెస్టు క్రికెట్ లో అత్యధిక డకౌట్లు అయిన జట్టుగా జో రూట్ అండ్ కో రికార్డులకెక్కింది. ఆస్ట్రేలియాతో మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న  బాక్సింగ్ డే టెస్టు లో భాగంగా ఆ జట్టు ఓపెనర్ హసీబ్ హమీద్ పరుగులేమీ చేయకుండానే నిష్క్రమించడంతో ఇంగ్లాండ్ కు ఈ రికార్డు సొంతమైంది. దీంతో 2021  లో టెస్టు  క్రికెట్ లో 50 మంది ఆటగాళ్లు డకౌట్ గా వెనుదిరిగిన జట్టుగా ఇంగ్లాండ్ చెత్త రికార్డు మూట గట్టుకుంది. ఇప్పటికే  యాషెస్ సిరీస్ లో ఆ జట్టు 2-0 తో వెనుకబడటం.. మూడో టెస్టులో కూడా ఆసీస్ బౌలింగ్ ధాటికి 185 పరుగులకే  ఆలౌట్ అయిన ఇంగ్లాండ్ కు ఈ రికార్డు పుండు మీద కారం చల్లడం వంటిదే.. 

మూడో టెస్టులో భాగంగా తొలి ఇన్నింగ్సులో ఇంగ్లాండ్ ఓపెనర్  హమీద్.. ఆస్ట్రేలియా సారథి పాట్ కమిన్స్ బౌలింగ్ లో  వికెట్  కీపర్ అలెక్స్ కేరీకి క్యాచ్ ఇచ్చి వెనుదిదిగాడు. పది బంతులు ఆడిన హమీద్.. సున్నాకే ఔటయ్యాడు.  హమీద్ నిష్క్రమణతో  ఈ ఏడాది ఒక జట్టు తరఫున అత్యధిక డకౌట్లు (50) అయిన జట్టుగా ఇంగ్లాండ్ రికార్డు నమోదు చేసింది. 

 

2021 లో అత్యధిక డకౌట్లు : 
- ఇంగ్లాండ్ : 50 
- ఇండియా : 34
- వెస్టిండీస్ : 23
- జింబాబ్వే : 23 

ఈ చెత్త రికార్డు నెలకొల్పడం ఇంగ్లాండ్ కు ఇదే తొలిసారి కాదు. గతంలో 1998లో కూడా ఇంగ్లీష్ జట్టులో 54 మంది ఆటగాళ్లు (ఒక ఏడాదిలో) డకౌట్ అయ్యారు. ఇక జట్టుగా కాకుండా వ్యక్తిగతంగా  చూసినా.. 2021లో టెస్టు క్రికెట్ లో అత్యధిక సార్లు డకౌట్ అయిన ఓపెనర్ల జాబితాలో కూడా ఇంగ్లాండ్ దే పైచేయి గా ఉంది. ఆ దేశ ఓపెనర్లు 14 సార్లు డకౌట్ కాగా.. బంగ్లాదేశ్ ఓపెనర్లు 5 సార్లు, పాకిస్థాన్ ఓపెనింగ్ జోడీ 4 సార్లు సున్నా పరుగులకే నిష్క్రమించింది. 

 

- గత 5 ఇన్నింగ్సులలో ఇంగ్లాండ్ ఓపెనర్లు కనీసం 50 పరుగుల భాగస్వామ్యాన్ని చేయలేకపోయారు. లాస్ట్ 5 ఇన్నింగ్సులలో ఆ జట్టు ఓపెనర్లు చేసిన పరుగుల భాగస్వామ్యం.. 0, 23, 7, 4, 4 
- బాక్సింగ్ డే టెస్టులో  ఇంగ్లాండ్ రెగ్యులర్ ఓపెనర్ రోరీ బర్న్స్ ను కాదనిజాక్ క్రాలేను తీసుకొచ్చినా అతడు ఇంగ్లాండ్ ఫేట్ ను మార్చలేదు. తొలి ఇన్నింగ్సులో అతడు 12 పరుగులే చేసి స్లిప్స్ లో గ్రీన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 
- తొలి రెండు టెస్టులలో ఇంగ్లాండ్ అగ్రశ్రేణి బ్యాటర్లు జో రూట్, జాస్ బట్లర్, జానీ బెయిర్ స్టో, హమీద్ లు  డకౌట్లు అయ్యారు.  

PREV
click me!

Recommended Stories

IPL 2026 Auction: చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కెచ్.. రూ. 43 కోట్లతో ఆ ఆటగాళ్లపై కన్నేసిన సీఎస్కే !
IPL Mini Auction చరిత్రలో అత్యంత ఖరీదైన 6 ఆటగాళ్లు వీరే.. రికార్డులు బద్దలవుతాయా?