భారత్ vs సౌతాఫ్రికా తొలి టెస్టు: షెడ్యూల్, తేదీ, టైమ్, జట్టు పూర్తి వివ‌రాలు ఇవిగో..

By Mahesh Rajamoni  |  First Published Dec 26, 2023, 9:45 AM IST

India vs South Africa, 1st Test: డిసెంబర్ 26 నుంచి రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో భాగంగా సౌతాఫ్రికాతో భారత్ తలపడనుంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా వంటి భారత వెటరన్లు ప్రపంచకప్ ఫైనల్ ఓటమి తర్వాత తొలిసారి కలిసి ఆడనున్నారు. ఈ సిరీస్ గెలిస్తే స‌రికొత్త చ‌రిత్ర అవుతుంది. 
 


India vs South Africa, 1st Test details: ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా భార‌త్ ప్రొటీస్ జ‌ట్టుతో రెండు టెస్టు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ఆడ‌నుంది. డిసెంబర్ 26న సెంచూరియన్ లోని సూపర్ స్పోర్ట్ పార్క్ క్రికెట్ స్టేడియంలో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత్, ప్రొటీస్ జట్ల మధ్య రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్ జరగనుంది. ప్రపంచకప్ ఫైనల్లో ఘోర పరాజయం తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా వంటి భారత వెటరన్లు మెన్ ఇన్ బ్లూ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

2016 నుంచి సొంతగడ్డపై ఒక్క టెస్టు మ్యాచ్ కూడా డ్రా చేసుకోని ప్రొటీస్ జట్టు ఆ తర్వాత ఆడిన 32 మ్యాచుల్లో 24 విజయాలు, 8 ఓటములతో బరిలోకి దిగుతోంది. టెంబా బవుమా నేతృత్వంలోని పటిష్టమైన, ఫిట్ నెస్ ఉన్న దక్షిణాఫ్రికా జట్టుతో తలపడనున్న రోహిత్ కు 31 ఏళ్ల తర్వాత 'ఫైనల్ ఫ్రాంటియర్ 'ను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. వరుసగా భారత జట్లు సిరీస్ గెలవడంలో విఫలమైనప్పటికీ అనుభవజ్ఞులు, కొత్త రక్తం మేళవింపుతో బరిలోకి దిగుతున్న ఈ భారత జట్టుకు విజయావకాశాలు మెండుగా ఉన్నాయ‌ని చెప్పాలి.

Latest Videos

అయితే మహ్మద్ షమీ, ఇషాన్ కిషన్ వంటి స్టార్లు అందుబాటులో లేకపోవడంతో తొలి టెస్టుకు భారత జట్టు మేనేజ్మెంట్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. చీలమండ గాయంతో షమీ సిరీస్ కు దూరమవగా, ఇషాన్ కిషన్ ను సిరీస్ నుంచి తప్పించాలని కోరగా, రుతురాజ్ గైక్వాడ్ వేలి గాయంతో జట్టుకు దూరమయ్యాడు. ఇక టెస్టు జట్టులో రెగ్యులర్ గా పాల్గొనని యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్, భారత్ వెలుపల సీమింగ్, స్వింగ్ పరిస్థితుల్లో ఇంకా తమ సత్తాను నిరూపించుకోని శుభ్ మ‌న్ గిల్, శ్రేయాస్ అయ్యర్ వంటి ఆటగాళ్లతో సహా చాలా మంది భారత ఆటగాళ్లను, ముఖ్యంగా బ్యాట‌ర్స్ ను దక్షిణాఫ్రికా పరిస్థితులలో పరీక్షించనున్నారు.

Year Ender 2023: విరాట్ కోహ్లీ నుంచి రోహిత్ శ‌ర్మ వ‌ర‌కు.. 2023 టాప్-10 క్రికెట‌ర్స్

భారత్-దక్షిణాఫ్రికా తొలి టెస్టు ఎప్పుడు?

డిసెంబర్ 26 నుంచి భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది.

భారత్-దక్షిణాఫ్రికా తొలి టెస్టు మ్యాచ్ ఎప్పుడు ప్రారంభం కానుంది?

భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టెస్టు మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కానుంది.

భారత్-దక్షిణాఫ్రికా తొలి టెస్టు మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది?

సెంచూరియన్ లోని సూపర్ స్పోర్ట్ పార్క్ స్టేడియంలో భారత్- దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది.

భారత్-దక్షిణాఫ్రికా తొలి టెస్టు మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం ఎలా?

భారత్-దక్షిణాఫ్రికా తొలి టెస్టు మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్ వ‌ర్క్ లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ లో కూడా చూడ‌వ‌చ్చు. యాప్ తో పాటు వెబ్ సైట్ లో కూడా లైవ్ చూడ‌వ‌చ్చు. 

ఇరు జ‌ట్ల అంచ‌నాలు: 

భారత్: జ‌ట్టు అంచ‌నాలు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్‌, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ

దక్షిణాఫ్రికా: డీన్ ఎల్గర్, ఐడెన్ మార్క్‌రమ్, టోనీ డి జోర్జీ, టెంబా బవుమా (కెప్టెన్), డేవిడ్ బెడింగ్హామ్, కైల్ వెరెన్నే, మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, గెరాల్డ్ కోయెట్జీ, కగిసో రబాడ, లుంగి ఎంగిడి

INDIA VS SOUTH AFRICA, 1ST TEST: బాక్సింగ్ డే టెస్టు.. అలా అయితే స‌రికొత్త చ‌రిత్రే.. !

click me!