SA vs IND: "అతడు టీంలో లేకపోవడం పెద్ద లోటే.. చాలా మిస్ అవుతున్నాం.."

By Rajesh Karampoori  |  First Published Dec 26, 2023, 3:17 AM IST

SA vs IND: దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న టీమిండియా T20I సిరీస్‌ను 1-1తో డ్రా చేసి, ODI సిరీస్‌ను 2-1తో గెలుచుకుంది. ప్రస్తుతం మెన్ ఇన్ బ్లూ దక్షిణాఫ్రికాలో  ఎలాగైనా టెస్ట్ సిరీస్‌ను గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ తరుణంలో సెంచూరియన్‌లో జరిగే తొలి టెస్టు (IND vs SA)లో దక్షిణాఫ్రికా- భారత్ లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కీలక ప్రకటన చేశారు. ఇంతకీ ఆ ప్రకటనేంటీ? 


SA vs IND: దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న టీమిండియా టీ20 సిరీస్‌ను 1-1 తో సమం చేసి.. అనంతరం ఆడినా వన్డే సిరీస్‌లో దక్షిణాఫ్రికాపై అధిపత్యం చేలాయించి సిరీస్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే.. నేటీ నుంచి రోహిత్ శర్మ కెప్టెన్సీలో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు టీమిండియా సిద్దమైంది. ఇప్పటివరకు సఫారీ గడ్డపై భారత్ ఒక్కసారి కూడా టెస్ట్ సిరీస్‌ను గెలవలేకపోయింది. ఎలాగైనా ఈ సిరీస్ ను కైవసం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించాలని రోహిత్ సేన భావిస్తోంది. 

ఈ క్రమంలో సెంచూరియన్‌లోని సూపర్ ‌స్పోర్ట్ పార్క్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్‌ లోని తొలి మ్యాచ్ డిసెంబర్ 26( నేడు)నుంచి ప్రారంభం కానుంది. రెండో టెస్టు కేప్‌టౌన్‌లో జనవరి 03న మొదలవుతుంది. అయితే.. భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ ఈ సిరీస్‌లో ఆడడం లేదు. ఇది టీమిండియాకు ఖచ్చితంగా లోటే..  ఈ విషయాన్ని భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా అంగీకరించాడు. 

Latest Videos

సెంచూరియన్ టెస్టు మ్యాచ్‌కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మీడియా సమావేశంతో మాట్లాడుతూ ఈ ప్రకటన చేశాడు. షమీ లేకపోవడంతో సిరీస్‌లో టీమిండియా భారీ నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని రోహిత్ అన్నాడు. ఈ సిరీస్‌లో టీమిండియా వెటరన్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ ను చాలా మిస్ అవుతుందని అన్నారు. ప్రతి బౌలర్ కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని తెలిపారు. 

ICC క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మరియు జస్ప్రీత్ బుమ్రా వంటి సీనియర్ ఆటగాళ్లకు ఇది మొదటి అంతర్జాతీయ అసైన్‌మెంట్. మ్యాచ్‌కు ముందు విలేకరుల సమావేశంలో, రోహిత్ (IND vs SA పై రోహిత్ శర్మ) మాట్లాడుతూ, గత ఐదు నుండి ఏడేళ్లలో విదేశాలలో వారి ప్రదర్శనలతో భారత ఫాస్ట్ బౌలర్లు చాలా గౌరవం పొందారని, అయినప్పటికీ షమీ పెద్ద మిస్ అవుతాడని చెప్పాడు. గాయం కారణంగా.

"టీమిండియా ఫాస్ట్ బౌలర్లు విదేశీ పరిస్థితుల్లో ఎలా రాణిస్తారో అందరికీ తెలుసు. గత ఐదు నుండి ఏడు సంవత్సరాలుగా భారత బౌలర్లు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాలో అద్బుతంగా రాణించారు. దక్షిణాఫ్రికాలో కూడా మంచి ప్రదర్శనించారు. గత సంవత్సరం మొదటి టెస్ట్ గెలిచాం. షమీని చాలా మిస్ అవుతున్నాం. అతని అనుభవం, అతను మా జట్టు కోసం సంవత్సరాలుగా ఏమి చేసాడో అది అంత సులభం కాదు. కానీ ఎవరు అతని స్థానంలోకి వచ్చాడు. అతనిపై మాకు చాలా నమ్మకం ఉంది" అని రోహిత్ చెప్పాడు.

ఫిచ్ పరిస్థితుల గురించి కెప్టెన్ రోహిత్ మాట్లాడుతూ.. బౌన్స్ భారత బౌలర్లకు చాలా సహాయపడుతుందని, దక్షిణాఫ్రికాలో సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నామని తెలిపారు. పేస్ బౌలర్లు మ్యాచ్ లో ఆధిపత్యం చెలాయిస్తున్నారనీ, వీరే మ్యాచ్ లో కీ రోల్స్ ఫ్లే చేయగలరని అన్నారు. ప్రతి రోజు సవాళ్లు ఉన్నాయనీ, సవాళ్లను ఎదుర్కోడానికి టీమిండియా సిద్దంగా ఉందని అన్నారు.

ఈ సిరీస్‌కు సన్నద్ధం కావడానికి చాలా సమయం వెచ్చించామని రోహిత్ శర్మ తెలిపారు. స్పిన్నర్లకు ఈ పిచ్ అంతగా సహకరించగా పోయినా .. పరుగుల ప్రవాహాన్ని ఆపడానికి వారు కృషి చేయగలరని, వారే బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి తెస్తారనీ, టీమిండియాకు అనుభవజ్ఞులైన ఇద్దరు స్పిన్నర్లు ఉన్నారనీ, వ్యూహం పరంగా మనం పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదని అన్నారు. రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ ల బౌలింగ్ అటాక్ టీమిండియాకు కలిసి వస్తుందని దీమా వ్యక్తం చేశారు. 

click me!