ధోనీ ఖేల్ ఖతమ్: తేల్చేసిన బీసీసీఐ, తెలుగు క్రికెటర్ ఒకే ఒక్కడు

By telugu teamFirst Published Jan 16, 2020, 2:31 PM IST
Highlights

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ భవిష్యత్తును బీసీసీఐ పరోక్షంగా తేల్చేసింది. బీసిసీఐ విడుదల చేసిన ఆటగాళ్ల కాంట్రాక్ట్ జాబితాలో ధోనీ పేరు లేదు. దీంతో ఎంఎస్ ధోనీ ఇక అంతర్జాతీయ క్రికెట్ ఆడే అవకాశం లేదని అర్థమవుతోంది.

ముంబై: టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ ముగిసినట్లే అనిపిస్తోంది. టీమిండియాకు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) క్రీడాకారుల వార్షి కాంట్రాక్టుల జాబితాను విడుదల చేసింది. 

బిసీసీఐ విడుదల చేసిన ఆరు కెటగిరీలు ఉన్నాయి. అవి గ్రేడ్ ఏ+,  గ్రేడ్ ఏ, గ్రేడ్ బీ, గ్రేడ్ సీ. టాప్ గ్రేడ్ ఏ+ కెటగిరీల్లో కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ ప్రీత్ బుమ్రా ఉన్నారు. వీరు 7 కోట్ల రూపాయలు పొందుతారు. ఆ తర్వాతి కెటగిరీల్లో ఉన్న ఆటగాళ్లు 5 కోట్ల రూపాల చొప్పున పొందుతారు. గ్రేడ్ బీ కెటగిరీలో ఉన్న ఆటగాళ్లు 3 కోట్ల రూపాయలు, సీ కెటగిరీలో ఉన్న ఆటగాళ్లు కోటి రూపాయలు పొందుతారు. 

also Read: వన్డేలకు ధోనీ గుడ్ బై: తేల్చేసిన రవిశాస్త్రి, టీ20లపై ఇలా..

ఈ కాంట్రాక్టుల జాబితాలో తెలుగు క్రికెటర్ ఒకతనే ఉన్నాడు. హనమా విహారీ బీసీసీఐ కాంట్రాక్టు పొందిన ఆటగాళ్లలో ఉన్నాడు. అది కూడా సీ గ్రేడ్ లో ఉన్నాడు. అతనికి కోటి రూపాయలు లభిస్తాయి.

2019 జులైలో ఐసిసి ప్రపంచ కప్ ముగిసిన తర్వాత ఎంఎస్ ధోనీ జట్టులోకి రాలేదు. ధోనీకి బీసీసీఐ కాంట్రాక్టు ఇవ్వలేదు. దీంతో ధోనీ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ముగిసినట్లేనని భావిస్తున్నారు. ధోనీ కెరీర్ కు ముగిసిందనే సంకేతాలను దాంతో బీసీసీఐ ఇచ్చిందని భావిస్తున్నారు. 

Also Read: టీ20 ప్రపంచ కప్ 2020: ధోనీ వేస్ట్, వీవీఎస్ లక్ష్మణ్ జట్టు ఇదే..

గ్రేడ్ ఏ+ కెటగిరీలోని ఆటగాళ్లు....

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ ప్రీత్ బుమ్రా

గ్రేడ్ ఏ కెటగిరీ పొందిన ఆటగాళ్లు

 రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, ఛతేశ్వర పుజారా, అజింక్యా రహానే, కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్,  మొహమ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, కుల్దీప్ యాదవ్, రిషబ్ పంత్

గ్రేడ్ బీ కెటగిరీలో ఉన్న ఆటగాళ్లు

వృద్ధిమాన్ సాహా, ఉమేష్ యాదవ్, యుజ్వేందర్ చాహల్,  హార్దిక్ పాండ్యా, మాయాంక్ అగర్వాల్

గ్రేడ్ సీ కెటగిరీ ఆటగాళ్లు

కేదార్ జాదవ్, నవదీప్ సైనీ, దీపక్ చాహర్, మనీష్ పాండే, హనుమ విహారి, శార్దూల్ ఠాకూర్, శ్రేయాస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్

click me!