ఆసిస్ క్రికెటర్లు కనీసం ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా చితక్కొట్టారు. టీమిండియా బౌలర్లంతా విఫలమయ్యారు. అందరూ టాప్ బౌలర్లు అయినా.. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. స్పిన్నర్లు కాస్త పర్వాలేదనిపించినా.. పేసర్లు మాత్రం తేలిపోయారు.
టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా పై ఆసిస్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రశంసల వర్షం కురిపించాడు. బుమ్రా వేసే యార్కర్లు, బౌన్సర్లు తనను ఆశ్చర్యానికి గురి చేయాలని వార్నర్ పేర్కొన్నాడు. బుమ్రా బౌలింగ్‌లో ఆడటం ఎంతో కష్టమని ఆయన అంటున్నాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మంగళవారం ముంబైలోని వాంఖడే మైదానంలోటీమిండియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆసీస్ ఘన విజయం సాధించింది.
ఆసిస్ క్రికెటర్లు కనీసం ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా చితక్కొట్టారు. టీమిండియా బౌలర్లంతా విఫలమయ్యారు. అందరూ టాప్ బౌలర్లు అయినా.. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. స్పిన్నర్లు కాస్త పర్వాలేదనిపించినా.. పేసర్లు మాత్రం తేలిపోయారు.
undefined
Also Read ఆసీస్ పై తొలి వన్డేలో చేదు అనుభవం: కోహ్లీ సేనకు మరో భారీ షాక్...
అయితే... బుమ్రా పై మాత్రం వార్నర్ ప్రశంసల వర్షం కురిపించాడు. మ్యాచ్ అనంతరం వార్నర్ మాట్లాడుతూ... 'బ్రెట్‌లీ లాంటి బౌలర్ కొంత తడబడుతూ 150 కి.మీ వేగంతో బంతులు వేయడాన్ని నేను ఊహించలేను. అందుకు అలవాటు పడాలంటే కాస్త సమయం అవసరం. బుమ్రాది గొప్ప బౌలింగ్ నైపుణ్యం. అతడి బౌన్సర్లు, యార్కర్లు ఆశ్చర్యానికి గురిచేస్తాయి. బుమ్రా బౌలింగ్‌లో మార్పు చేస్తే కష్టంగా అనిపిస్తుంది. లసిత్ మలింగ 140 కి.మీ వేగంతో స్వింగ్ చేసినప్పుడు ఎదుర్కొనేందుకు ఉండేంత సంక్లిష్టంగా అనిపిస్తుంది. అయితే క్రీజులో నిలదొక్కుకోవడంతోనే పరుగులు చేశా' అని తెలిపాడు.