T20 World Cup 2024 : మెగా టోర్నీలో సెమీస్ చేరే జ‌ట్లు ఇవే..

By Mahesh Rajamoni  |  First Published May 28, 2024, 4:07 PM IST

T20 World Cup 2024 : టీ20 ప్రపంచకప్ 2024 జూన్ 1 నుంచి ప్రారంభం కానుంది. వెస్టిండీస్, అమెరికా వేదిక‌లుగా జ‌ర‌గున్న ఈ మెగా టోర్నీ లో సెమీస్ చేరే జ‌ట్ల‌లో భార‌త్ ఉంటుంద‌నీ, టాప్-4 జట్ల పై సునీల్ గవాస్కర్  చేసిన కామెంట్స్ వైర‌ల్ గా మారాయి. 
 


T20 World Cup 2024 : 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడంతో ఐసీసీ ట్రోఫీని గెలుచుకోవాలన్న టీమిండియా కల చెదిరిపోయింది. అయితే, వచ్చే నెలలో అంటే జూన్ లో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ 2024 ను ఎలాగైనా గెలుచుకోవాల‌నే వ్యూహాల‌తో ముందుకు సాగుతోంది. ఇప్ప‌టికే భార‌త జ‌ట్టు మెగా టోర్నీ కోసం అమెరికా చేరుకుంది. జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీకి అమెరికా, వెస్టిండీస్ సంయుక్త ఆతిథ్యం ఇవ్వ‌నున్నాయి. జూన్ 29న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ క్ర‌మంలోనే భారత క్రికెట్ దిగ్గ‌జం సునీల్ గవాస్కర్ ఈ ప్ర‌పంచ క‌ప్ లో సెమీస్ చేరే జ‌ట్ల గురించి చేసిన కామెంట్స్ వైర‌ల్ గా మారాయి.

 టాప్-4 లో నిలిచే జ‌ట్లు ఇవే.. భార‌త్ కూడా..

Latest Videos

undefined

రాబోయే టీ20 ప్రపంచ కప్ 2024 లో భార‌త్ తో పాటు టాప్-4 నిలియే జ‌ట్ల గురించి ప్ర‌స్తావించిన సునీల్ గ‌వాస్క‌ర్.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, వెస్టిండీస్‌లు సెమీస్ చేరుతాయ‌ని పేర్కొన్నాడు. గ‌తంలో ధోనీ సారథ్యంలో భారత జట్టు 2007 టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుంది. అప్పటి నుంచి ఈ ఫార్మాట్‌లో జరిగే ఐసీసీ టోర్నీలో ఛాంపియ‌న్ గా నిల‌వ‌లేక‌పోయింది. కానీ, రాబోయే ప్ర‌పంచ క‌ప్ లో జూన్ 5న ఐర్లాండ్‌తో త‌న తొలి మ్యాచ్ నుంచే విన్నింగ్ ట్రాక్ లోకి వెళ్లాల‌ని భార‌త్ భావిస్తోంది. రెండో మ్యాచ్జూన్ 9న పాకిస్థాన్‌తో జరుగుతుంది. ఆ తర్వాత అమెరికా (జూన్ 12), కెనడా (జూన్ 15)తో మ్యాచ్ ల‌ను ఆడ‌నుంది.

ఆస్ట్రేలియాతో పాటు డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ కూడా..

టీ20 ప్రపంచకప్ గెలిచిన ఇంగ్లండ్ జట్టును కూడా 2025లో కూడా సెమీస్ చేరుతుంద‌ని సునీల్ గ‌వాస్క‌ర్ పేర్కొన్నాడు. ఇప్ప‌టివ‌ర‌కు టీ20 ప్రపంచకప్‌ను ఇంగ్లండ్ జట్టు రెండుసార్లు గెలుచుకుంది. అలాగే, వెస్టిండీస్ కూడా సెమీస్ చేరుతుంద‌ని గ‌వాస్క‌ర్ అంచ‌నా వేశాడు. వెస్టిండీస్ కూడా రెండుసార్లు టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుంది. 2021లో ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకున్న ఆస్ట్రేలియా జట్టును కూడా గవాస్కర్ టాప్-4లో ఉంచాడు. ఈ టోర్నీని ఆస్ట్రేలియా ఒక్కసారి మాత్రమే గెలుచుకుంది. రాబోయే సీజన్‌లో ఆస్ట్రేలియా జట్టు మిచెల్ మార్ష్ కెప్టెన్సీలో ఆడనుంది. జట్టులో ట్రావిస్ హెడ్, మిచెల్ స్టార్క్ వంటి ప్రమాదకరమైన ఆటగాళ్లు కూడా ఉన్నారు.

క్రికెట్ గ్రౌండ్ లోనే కాదు బిజినెస్ లోనూ సూప‌ర్.. మ‌న క్రికెట‌ర్ల రెస్టారెంట్లు చూస్తే దిమ్మ‌దిరిగిపోవాల్సిదే.

click me!