తెలంగాణ‌లోని ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షం.. ఇద్ద‌రు మృతి

By Mahesh Rajamoni  |  First Published May 13, 2024, 8:47 PM IST

Telangana rains : తెలంగాణలో ప‌లు చోట్లలో కురుస్తున్న వ‌ర్షాల మ‌ధ్య పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందగా, ఐదుగురు గాయపడ్డారు. మెదక్ జిల్లాలో ఒక వ్యక్తి, అతని మనవడు పిడుగుప‌డి ప్రాణాలు కోల్పోయారు. 
 


Telangana rains : ఆకాల వ‌ర్షాలు దేశంలోని చాలా ప్రాంతాల్లో విషాదాన్ని నింపుతున్నాయి. తెలంగాణ‌లోని ప‌లు ప్రాంతాల్లో గ‌త రెండుమూడు రోజులుగా వ‌ర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల వ‌ర్షాల తీవ్ర‌త అధికంగా ఉంది. ఉరుములు, మెరుగుపుల‌తో కూడిన వ‌ర్షాలు ప‌డుతున్నాయి. ప‌లు చోట్ల వ‌డ‌గళ్ల వాన‌లు కూడా ప‌డుతున్నాయి. ఇక సోమ‌వారం కురిసిన వాన‌లతో పాటు పిడుగులు ప‌డ్డాయి. దీంతో ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోయారు. ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఈదురు గాలుల మధ్య పిడుగులు పడి ఇద్దరు మృతి చెందారు. ఆదిలాబాద్ జిల్లాలో పిడుగుపాటుకు ఐదుగురు గాయపడ్డారు. మెదక్ జిల్లాలో ఒక వ్యక్తి, అతని మనవడు పిడుగుపాటుతో ప్రాణాలు కోల్పోయారు. మృతులను శ్రీరాములు (50), విశాల్ (11)గా గుర్తించారు.

Latest Videos

undefined

అలాగే, ఆదిలాబాద్ జిల్లాలో పిడుగుపాటుకు ఐదుగురు గాయపడ్డారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా కొమరం భీమ్, ఆసిఫాబాద్, వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి జిల్లాల్లో విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. కొత్తగూడ, మహబూబాబాద్ జిల్లాల్లో వర్షపాతం స్థాయి 9.25 సెంటి మీట‌ర్లు, భూపాలపల్లిలో 8.5 సెం.మీ, వరంగల్ జిల్లా గొర్రకుంటలో 7.4 సెంటీ మీట‌ర్లు న‌మోదైంది. వర్షం కారణంగా కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన ధాన్యం త‌డిసి నష్టం వాటిల్లిందని నివేదిక‌లు పేర్కొంటున్నాయి.

త్వ‌ర‌లోనే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పెళ్లి.. !

click me!