IPL 2024, Sanju Samson : ఐపీఎల్ 2024లో 61వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో రాజస్థాన్ రాయల్స్ చిత్తుగా ఓడింది. వరుస హ్యాట్రిక్ ఓటముల మధ్య ఆర్ఆర్ కెప్టెన్ సంజూ శాంసన్ ఐపీఎల్ 2024 ప్లేఆఫ్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
Rajasthan captain Sanju Samson : ఐపీఎల్ 2024 లో 61వ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్-రాజస్థాన్ రాయల్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ ను చెన్నై చిత్తుగా ఓడించింది. రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. రియాన్ పరాగ్ ఒక్కడే 35 బంతుల్లో 47 పరుగులతో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. చెన్నై బౌలర్లు రాణించడంతో రాజస్థాన్ భారీ స్కోర్ చేయలేకపోయింది. సిమర్‌జీత్ సింగ్ 3 వికెట్లు, తుషార్ దేశ్‌పాండే 2 వికెట్లు తీశారు. స్వల్ప స్కోర్ టార్గెట్ తో బరిలోకి దిగిన చెన్నై కాస్త తడబడుతూ చివరకు 18.2 ఓవర్లలో 145 పరుగుల చేసి 5 వికెట్ల తేడాతో రాజస్థాన్ పై విజయాన్ని అందుకుంది.
ఐపీఎల్ 2024 పాయింట్ల పట్టికలో రాజస్థాన్ జట్టు 16 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ప్లేఆఫ్‌కు చేరుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ఓటమి.. అలాగే, వరుసగా మూడు పరాజయాల తర్వాత కెప్టెన్ సంజూ శాంసన్ చాలా నిరాశకు గురయ్యాడు. ఈ ఓటమికి బ్యాట్స్‌మెన్లే కారణమని ఆరోపించాడు. ఈ సీజన్‌లో రాజస్థాన్ జట్టు ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. అందులో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఒకే ఒక్క మ్యాచ్‌లో ఓడిపోయింది. ఆ తర్వాత ప్రత్యర్థి గడ్డపై మూడు పరాజయాలు అందుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోయింది.
అవే మా కోంపముంచాయి.. ఆటగాళ్లపై ఢిల్లీ కెప్టెన్ ఫైర్..
మ్యాచ్ ముగిసిన తర్వాత సంజూ శాంసన్ మాట్లాడుతూ, "పవర్‌ప్లే తర్వాత వికెట్ నెమ్మదిగా కదలడం వంటి అంశాలతో పవర్‌ప్లే తర్వాత మేము ఊహించిన స్కోరు 170. మేము 20-25 పరుగులు తక్కువ చేసాము. సిమర్‌జీత్ మంచి బౌలింగ్ చేశాడు. పిచ్ గురించి కూడా సరైన అంచనాకు రాలేకపోయామని" అన్నాడు. హోం గ్రౌండ్ కాకుండా జరిగే మ్యాచ్ లలో పిచ్ గురించి, అక్కడి పరిస్థితుల గురించి ఖచ్చితంగా తెలియదు. ఇలాంటి సమయంలో ముందుగా బ్యాటింగ్ చేయడం బెటర్ ఆప్షన్ అని అనుకున్నాం. కానీ, ఫలితం వేరేలా వచ్చిందని" చెప్పాడు.
చెన్నైలోని పరిస్థితి గురించి శాంసన్ మాట్లాడుతూ.. ‘‘రాత్రిపూట ఆడుతున్నప్పుడు మంచు కారణంగా వెంటాడటం కష్టం కాదు. వేసవిలో పిచ్ వేడిగా ఉంటుంది కాబట్టి రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నెమ్మదించబడుతుందని నేను ఆశించాను. ప్లేఆఫ్‌ల గురించి ఆలోచిస్తూ ఉండటం సాధారణం, మన నియంత్రణలో ఉన్న వాటిపై దృష్టి పెట్టాలి. మన చేతుల్లో ఉన్న విషయాలపై దృష్టి పెట్టాలని నేను నా ప్లేయర్లకు చెప్పాలనుకుంటున్నాను. ప్రస్తుతం రాబోయే మ్యాచ్ పై దృష్టి పెట్టాలి.. ఆ గేమ్ ను గెలుచుకోవాలని ఆశిస్తున్నానని" చెప్పాడు.
జడ్డుభాయ్ ఇదేందయ్యా.. ఔట్ కాకుండా మస్తు ప్లానేసిండు కానీ..