భారత్ చూసిన అత్యుత్తమ కెప్టెన్.. ధోనిపై అప్పుడు విమ‌ర్శలు.. ఇప్పుడు గౌతమ్ గంభీర్ కామెంట్స్ వైరల్ !

By Mahesh Rajamoni  |  First Published Apr 8, 2024, 6:00 PM IST

MS Dhoni - Gautam Gambhir : టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూప‌ర్ కింగ్స్ స్టార్ ప్లేయ‌ర్ ఎంఎస్ ధోనిపై భార‌త మాజీ ఓపెన‌ర్, కేకేఆర్ మెంట‌ర్ గౌతమ్ గంభీర్ ప్రశంసల జల్లు కురిపించాడు. భారత్ చూసిన అత్యుత్తమ కెప్టెన్ ధోని అని కొనియాడాడు.
 


KKR vs CSK : ఐపీఎల్ 2024లో భాగంగా భార‌త మాజీ ఓపెన‌ర్, కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ కు మెంట‌ర్ గా కొన‌సాగుతున్న గౌత‌మ్ గంభీర్ తాజాగా ఎంఎస్ ధోని పై చేసిన కామెంట్స్ వైర‌ల్ గా మారాయి. భార‌త్ చూసిన అత్యుత్తమ కెప్టెన్ ధోని అని కోనియాడాడు. గ్రౌండ్ లో అత‌ని కెప్టెన్సీ లెక్క‌లు చాలా మెరుగ్గా ఉంటాయనీ, ఎవ‌రి ఎలా ఉప‌యోగించాల‌నే ప్ర‌ణాళిక‌లు ప‌క్కాగా ఉంటాయ‌ని చెప్పాడు. అందుకే విజ‌య‌వంత‌మైన కెప్టెన్ గా నిలిచాడ‌ని పేర్కొన్నాడు.

అయితే, ఎంఎస్ ధోనీపై గౌతమ్ గంభీర్ పలు సందర్భాల్లో తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు టీమిండియా మాజీ క్రికెటర్ ధోనీపై ప్రశంసల‌ జల్లు కురిపించడంతో గంభీర్ కామెంట్స్ వైర‌ల్ గా మారాయి. చెన్నై సూపర్ కింగ్స్ తో కోల్ కతా నైట్ రైడర్స్ మ్యాచ్ కు ముందు గంభీర్ ధోనీ గురించి మాట్లాడాడు. కోల్ క‌తా మాజీ కెప్టెన్ అయిన గంభీర్ ప్రస్తుతం ఆ జట్టుకు మెంటార్ గా వ్యవహరిస్తున్నాడు.

Latest Videos

undefined

అద్భుత బౌలింగ్ తో ఒంటిచెత్తో క‌ళ్లుచెదిరే క్యాచ్ ప‌ట్టిన ర‌వి బిష్ణోయ్.. వీడియో

భారత క్రికెట్లో అత్యుత్తమ కెప్టెన్ ల‌లో ధోనీ ఒకడని గంభీర్ అభివర్ణించాడు. అలాగే, ''ధోనీ మూడు ఐసిస్ టైటిళ్లు గెలిచాడు. మరెవరూ ఈ స్థానానికి రాగలరని నేను అనుకోవడం లేదు. విదేశాల్లో ఎవరైనా సిరీస్ గెలుచుకోవచ్చు. కానీ ఐసీసీ టైటిల్స్ గెలవడం అంత సులువు కాదు. భారత్ చూసిన అత్యుత్తమ కెప్టెన్ ధోనీ'' అని గంభీర్ పేర్కొన్నాడు. ఐపీఎల్ లో ధోనీ ప్రదర్శనపై గంభీర్ మాట్లాడుతూ.. 'ఐపీఎల్లోనూ ధోనీ తన విజయాన్ని పునరావృతం చేశాడు. ధోనీ సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఆటగాడు. 'స్పిన్నర్లను ఎలా ఎదుర్కోవాలో ధోనీకి బాగా తెలుసు. అంతేకాదు, మైదానాన్ని ఎలా సర్దుబాటు చేయాలో అందరికంటే ధోనీకే ఎక్కువ నమ్మకం. ధోనీ కూడా మ్యాచ్ ను ఫినిష్ చేయడంలో దిట్ట. ఆఖరి ఓవర్లో విజయానికి 20 పరుగులు అవసరం అయినా ధోనీని నమ్మొచ్చు' అని గంభీర్ చెప్పుకొచ్చాడు.

ఇదిలావుండ‌గా, ఐపీఎల్ 2024లో భాగంగా చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో సోమ‌వారం రాత్రి 7.30 గంటలకు చెన్నై, కోల్ క‌తా జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్ లో కోల్ క‌తా తిరుగులేని విజ‌యాల‌తో ముందుకు సాగుతోంది. మూడు మ్యాచుల్లోనూ గెలిచి ఆరు పాయింట్లు సాధించింది. రాజస్థాన్ రాయల్స్ తర్వాత రెండో స్థానంలో ఉంది. గత రెండు మ్యాచుల్లో ఓడిన చెన్నై నాలుగో స్థానంలో ఉంది. నేటి మ్యాచ్ పై ఉత్కంఠ నెల‌కొంది.

వాంఖడేలో అద‌ర‌గొట్టిన హిట్‌మ్యాన్.. కోహ్లీ, వార్నర్ క్ల‌బ్ లో రోహిత్ శ‌ర్మ !

click me!