ఐసీసీ టీ20 మహిళల ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఆస్ట్రేలియా బౌలర్ మెగాన్ స్కట్ భారత బ్యాట్స్ మెన్ షెఫాలీ వర్మ, స్మృతి మంథానాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.
సిడ్నీ: భారత మహిళలల జట్టుతో ఫైనల్స్ ఆడడాన్ని తాను అసహ్యించుకుంటున్నట్లు ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మెగాన్ స్కట్ వ్యాఖ్యానించారు. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ పోటీల ఫైనల్ మ్యాచులో భారత్, ఆస్ట్రేలియా ఈ నెల 8వ తేదీన తలపడనున్న విషయం తెలిసిందే.
ఆస్ట్రేలియా డిఫెండింగ్ ఛాంపియన్ కాగా, భారత్ తొలిసారి ఫైనల్ కి ప్రవేశించింది. దాంతో ఇరు జట్ల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. మహిళల టీ20 ప్రపంచ కప్ ప్రారంభ మ్యాచు ఈ రెండు జట్ల మధ్యే జరిగింది. ఫైనల్ కూడా ఈ జట్ల మధ్యనే జరుగుతోంది. తాను భారత్ ఆడడాన్ని అసహ్యించుకోవడానికి కారణాన్ని ఆస్ట్రేలియా బౌలర్ స్కట్ చెప్పింది.
undefined
Also Read: తిరగబడిన "0": ఇంగ్లాండ్ అప్పుడు గెలుపు... ఇప్పుడు ఓటమి
షెఫాలీ వర్మ, స్మృతి మంథానాల బ్యాటింగ్ తనకు వణుకు పుట్టిస్తోందని, ప్రధానంగా షెఫాలీ ఎదురుదాడికి తన వద్ద సమాధానం ఉండకపోవచ్చునని ఆమె అన్నది. స్మృతి, షెపాలీ భారత జట్టుకు వెన్నెముక లాంటివారని, వారు బలమైన షాట్లతో ఎదురు దాడి చేస్తున్నారని, వారికి తాను బౌలింగ్ చేయనని తమ కెప్టెన్ కు చెప్పానని ఆమె అన్నారు.
ఈ ప్రపంచ కప్ నకు ముందు జరిగిన ముక్కోణపు సిరీస్ లో షెఫాలీ కొట్టిన సిక్స్ తన కెరీర్ లోనే అత్యుత్తమ సిక్స్ అని ఆమె అన్నది. వారిద్దరికి తాను బౌలింగ్ చేయడం మంచిది కాకపోవచ్చు, ఆ జోడీకి తాను బౌలింగ్ కూడా సరైన మ్యాచింగ్ కాకపోవచ్చునని స్కట్ అన్నిది. పవర్ ప్లేలో వారికి తాను బౌలింగ్ చేయడం మంచిది కాకపోవచ్చునని అన్నది.
Also read: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్: ఇండియా ఫైనల్ ప్రత్యర్థి ఆస్ట్రేలియా
బౌలర్లుగా తాము కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నామని, పవర్ ప్లేలో తన బౌలింగు ఆడడం వారికి సులభంగా కనిపిస్తోందని అన్నది.