స్టీరియో టైప్స్ కు బ్రేక్: మిథాలీ రాజ్ చీర కట్టి.. క్రికెట్ ఆడి.....

By telugu teamFirst Published Mar 6, 2020, 7:47 AM IST
Highlights

మహిళల వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ స్టీరియోటైప్స్ కు బ్రేక్ ఇచ్చి చీరలో క్రికెట్ ఆడి అలరించింది. మహిళా దినోత్సవం సందర్భంగా బొట్టు పెట్టి, చీర కట్టి క్రికెట్ ఆడుతున్న వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేసింది.

హైదరాబాద్: భారత మహిళల వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ స్టీరియోటైప్స్ ను బ్రేక్ చేసింది. చీరకట్టి క్రికెట్ ఆడింది. ఓ ప్రముఖ మల్టీనేషనల్ బ్రాండ్ టీవీ అడ్వర్టయిజ్ మెంట్ కోసం ఆ పనిచేసింది. ఆ వీడియో కమర్షియల్ ట్విట్టర్ లో వైరల్ అవుతోంది. 

మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం. అదే రోజును ఐసీసీ టీ20 మహిళల ప్రపంచ కప్ పోటీల ఫైనల్ జరుగనుంది. మహిళా దినోత్సవం సందర్భంగా మిథాలీ రాజ్ వీడియోను రూపొందించింది. దాన్ని ట్విట్టర్ లో పోస్టు చేసింది.

ఆ వీడియోను మిథాలీ రాజ్ ట్వట్టర్ లో పోస్టు చేసింది. "చీర కట్టుకుని బొట్టు పెట్టుకుని క్రికెట్ ఆడింది. ప్రతీ చీర మీకన్నా ఎక్కువగా మాట్లాడుతుంది. అది నాకు తెలుసు. మీరు ఫిట్ గాఉండాలని అది ఎప్పుడూ చెప్పదు. ఈ మహిళ దినోత్సవం రోజు ఏదైనా ప్రత్యేకంగా చేసి.. ప్రపంచానికి మీరే చాటండి. మీ జీవితాన్ని మీకు నచ్చినట్లు జీవించండి" అని మిథాలీ రాజ్ ఆ వీడియో పోస్టు చేసి ఆ వాక్యాలు పెట్టింది.

 

you’re a true inspiration for living life and breaking the stereotype! Still mithali mam is way too awesome😍😍😍😍😍

pic.twitter.com/wuvVlDZWfP

— Salik Zafar (@salikzafar_)
click me!