IND vs IRE: టాస్ గెలిచిన హార్థిక్.. టీమిండియా బ్యాటింగ్

Published : Jun 28, 2022, 08:45 PM IST
IND vs IRE: టాస్ గెలిచిన హార్థిక్.. టీమిండియా బ్యాటింగ్

సారాంశం

IND vs IRE Live: ఐర్లాండ్ తో జరగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో భారత జట్టు సారథి హార్థిక్ పాండ్యా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. వర్షం ముప్పు పొంచి ఉన్న ఈ మ్యాచ్ లో.. 

ఐర్లాండ్ పర్యటనలో ఉన్న భారత జట్టు  సిరీస్ విజేతను తేల్చే రెండో టీ20లో టాస్ నెగ్గింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కెప్టెన్ హార్థిక్ పాండ్యా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. గత మ్యాచ్ లో వర్షం కారణంగా 12 ఓవర్లకు కుదించిన మ్యాచ్ లో భారత్ నే విజయం వరించగా.. ఈ  మ్యాచ్ లో కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. అయితే  రెండో మ్యాచ్ కూడా గెలిచి సిరీస్ ను 2-0 తో నెగ్గాలని టీమిండియా భావిస్తున్నది. 

ఈ మ్యాచ్ కోసం భారత జట్టు పలు మార్పులు చేసింది. తొలి మ్యాచ్ లో అస్వస్థతకు గురైన రుతురాజ్ స్థానంలో సంజూ శాంసన్ ఆడుతున్నాడు అవేశ్ ఖాన్ స్థానంలో హర్షల్ పటేల్ ఆడుతుండగా.. చాహల్ స్థానంలో బిష్ణోయ్ బరిలోకి దిగాడు. ఐర్లాండ్ లో మార్పులేమీ లేవు. గత మ్యాచ్ లో బరిలోకి దిగిన జట్టే ఈ మ్యాచ్ లో కూడా ఆడుతుంది. 

 

తుది జట్లు : 
ఇండియా : సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా,  సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, రవి బిష్ణోయ్, ఉమ్రాన్ మాలిక్ 

ఐర్లాండ్ : పాల్ స్టిర్లింగ్, ఆండ్రూ బల్బ్రిని (కెప్టెన్),  గరెత్ డెలాని, హరీ టెక్టార్, లొర్కానర్ టక్కర్, జార్జ్ డొక్రెల్, మార్క్ అడైర్, అండీ మెక్ బ్రైన్, క్రెయిగ్ యంగ్, జోషువా లిటిల్, కోనోర్ ఒల్ఫర్ట్

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Lalit Modi: డైమండ్స్ క్వీన్.. సుస్మితా సేన్ సీక్రెట్ లవ్ స్టోరీ బయటపెట్టిన లలిత్ మోదీ !
Team India Schedule: ఐపీఎల్ అయిపోయింది.. అసలు ఆట ఇప్పుడే మొదలైంది! 2027 వరల్డ్ కప్ దాకా భారత్‌కు నో రెస్ట్