Eoin Morgan: క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ఇంగ్లాండ్ కెప్టెన్.. ఇంగ్లీష్ జట్టు రాత మార్చిన మోర్గాన్..

By Srinivas MFirst Published Jun 28, 2022, 7:41 PM IST
Highlights

Eoin Morgan Retirement: ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల సారథి ఇయాన్ మోర్గాన్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు గుడ్ బై చెప్పాడు. ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసింది. 

క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లాండ్ కు దశాబ్దాల నిరీక్షణ అనంతరం వన్డే వరల్డ్ కప్ అందించిన ఇయాన్ మోర్గాన్.. అంతర్జాతీయ కెరీర్ కు గుడ్ బై చెప్పేశాడు. గత వారం రోజులుగా బ్రిటీష్ మీడియాలో వస్తున్న వార్తలకు చెక్ పెడుతూ.. తాను ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. 2015 నుంచి ఇంగ్లాండ్ కు పరిమిత ఓవర్ల సారథిగా  వ్యవహరిస్తున్న మోర్గాన్..  ఆ జట్టు తరఫున 126 మ్యాచుల (వన్డే)కు కెప్టెన్ గా ఉన్నాడు. 72 వన్డేలకు కూడా నాయకుడిగా వ్యవహరించాడు. 13 ఏండ్ల పాటు ఇంగ్లాండ్ తరఫున ఆడిన మోర్గాన్.. ప్రయాణం స్ఫూర్తివంతంగా సాగింది. 2022 లో జరగాల్సి ఉన్న టీ20  ప్రపంచకప్ లో ఆడాలని భావించినా అతడు ఫిట్నెస్ సమస్యల కారణంగా తప్పుకున్నాడు. 

ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల ఫార్మాట్ కు ఏడేండ్లుగా సేవలందిస్తున్న మోర్గాన్ సొంతదేశం ఐర్లాండ్. ఇంగ్లాండ్ తో చేరకముందు వరకు అతడు 2006 నుంచి 2009 వరకు ఐర్లాండ్  జాతీయ జట్టుకు ఆడాడు. కానీ 2009 నుంచి ఇంగ్లాండ్ కు ఆడుతున్నాడు.  

2015 తర్వాత  ఇంగ్లాండ్ కు వన్డే కెప్టెన్ గా నియమితుడైన ఈ ఐరిష్ క్రికెటర్.. 2019 లో ఆ జట్టుకు ప్రపంచకప్ అందించిన సారథిగా గుర్తింపుపొందాడు. అంతకుముందు అతడు ఇంగ్లాండ్ 2010 లో టీ20  ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడు కూడా కావడం గమనార్హం. 

 

You’ve changed English cricket forever.

An innovator 🏏 A motivator 💪 A champion 🏆

Your legacy will live on... ❤️ pic.twitter.com/a32SSvCDXI

— England Cricket (@englandcricket)

మోర్గాన్ రిటైర్మెంట్ గురించి ఈసీబీ స్పందిస్తూ.. ‘అవును..  మా పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు గుడ్ బై చెప్పాడు..’ అని స్పష్టం చేసింది. ఇక ఇంగ్లాండ్ క్రికెట్ అధికారిక ట్విటర్ ఖాతాలో.. ‘నువ్వు ఇంగ్లీష్ క్రికెట్ రాతను మార్చేశావు. నువ్వు రిటైరైనా నీ లెగసీ కొనసాగుతుంది..’ అని ట్వీట్ చేసింది. 

తన కెరీర్ లో ఇంగ్లాండ్ తరఫున 225 వన్డేలు ఆడిన  మోర్గాన్.. 6,957 పరుగులు (మొత్తంగా 248 వన్డేలు, 7,701 రన్స్) చేశాడు.  39.29 సగటుతో  14 సెంచరీలు సాధించాడు. ఇక టీ20లలో 115 మ్యాచ్ లలో 2,458 పరుగులు చేశాడు.  టీ20లలో ఇంగ్లాండ్ కు 72 మ్యాచులలో సారథిగా ఉన్నాడు. ఈ ఫార్మాట్ లో అత్యధికంగా టీ20 లకు సారథ్యం వహించిన ఎంఎస్ ధోని తర్వాత స్థానంలో నిలిచాడు. 16 టెస్టులాడిన మోర్గాన్.. 700 రన్స్ చేశాడు. ఇందులో రెండు సెంచరీలు కూడా ఉన్నాయి.  

126 మ్యాచులలో ఇంగ్లాండ్ కు సారథిగా ఉన్న మోర్గాన్.. 76 విజయాలు సాధించాడు. అతడి విజయాల శాతం 60 గా ఉంది. ఇంగ్లాండ్ కు సారథ్యం వహించిన (పురుషుల) మరెవ్వరికీ ఈ రికార్డు లేదు. 

 

A leader par excellence! 🙌

Wish you a happy second innings, 💜 pic.twitter.com/dLIPYLjbUL

— KolkataKnightRiders (@KKRiders)

గత ఏడాదిన్నర కాలంగా ఫామ్ కోల్పోవడంతో పాటు ఫిట్నెస్ సమస్యలతో సతమతమవుతున్న  మోర్గాన్ ఇటీవలే ముగిసిన నెదర్లాండ్ తో సిరీస్ లో కూడా అట్టర్ ఫ్లాఫ్ అయ్యాడు. వరుసగా రెండు మ్యాచులలో అతడు డకౌట్ అయ్యాడు.  దీంతో అతడు ఇక తాను క్రికెట్ లో కొనసాగడం వృథా అనే నిర్ణయానికి వచ్చాడు. కాగా ఇంగ్లాండ్ జట్టుకు పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో తదుపరి సారథిగా జోస్ బట్లర్ ఎంపికయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 2015 నుంచి బట్లర్  ఈ రెండు ఫార్మాట్లకు వైస్ కెప్టెన్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. 

కెప్టెన్ గా మోర్గాన్ : 

- 2016 టీ20 ప్రపంచకప్ లో రన్నరప్ 
- 2017 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ లో సెమీస్ 
- 2019  వన్డే వరల్డ్ కప్ లో విజేత 
- 2021 టీ20 ప్రపంచకప్ లో సెమీస్ 

click me!