తెలంగాణలోని రాజన్న సిరిసిల్లా జిల్లాకు చెందిన అవనీష్ రావు (Avanish Rao) ఇండియా అండర్-19 వరల్డ్ కప్ (Under-19 ICC World Cup) పురుషుల జట్టులో చోటు దక్కించుకున్నారు. దీంతో ఆయనను మాజీ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో అభినందించారు.
Avanish Rao : తెలంగాణకు చెందిన క్రికెటర్ కు గొప్ప అవకాశం లభించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామానికి చెందిన 18 ఏళ్ల వికెట్ కీపర్ అవనీష్ రావు కు ఇండియా అండర్-19 వరల్డ్ కప్ పురుషుల జట్టులో చోటు దక్కించుకున్నారు. దక్షిణాఫ్రికాలో ముక్కోణపు సిరీస్, 2024లో ఐసీసీ పురుషుల అండర్-19 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఈ ప్రకటన చేసింది.
ఆకాశంలో అద్భుతం.. నేటి నుంచి ఐదు రోజుల పాటు ఉల్కాపాతాలు.. ఎలా చూడాలంటే ?
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీఏ) 15 మంది సభ్యుల అండర్-19 జట్టులో వికెట్ కీపర్-బ్యాట్స్ మన్ గా అవనీశ్ రావు ఎంపికయ్యారు. డిసెంబర్ 29 నుంచి జనవరి 10 వరకు దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ జట్ల మధ్య ముక్కోణపు సిరీస్ జరగనుంది. 2024లో దక్షిణాఫ్రికాలో జరగనున్న ఐసీసీ పురుషుల అండర్-19 ప్రపంచకప్ లో ఆయన ఆడనున్నారు.
ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీఆర్ఎస్ కే అత్యధిక నిధులు..
అండర్-19 వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకోవడం పట్ల తెలంగాణ మాజీ ఐటీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ స్పందించారు. సోషల్ మీడియా ద్వారా అవనీష్ కు అభినందనలు తెలిపారు. ఈ ఫ్యూచర్ స్టార్ సిరిసిల్ల నియోజకవర్గం పోతుగల్ గ్రామానికి చెందినవాడని ట్వీట్ చేశారు.
Hearty congratulations to Aravelly Avanish Rao on getting selected for U-19 Cricket World Cup and Tri Series in South Africa. This promising cricketer hails from Pothgal village in Rajanna Sircilla Constituency. pic.twitter.com/yGMX7YYpnd
— KTR (@KTRBRS)అవనీష్ సాధించిన ఈ విజయం పట్ల కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో పాటు జిల్లా వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. జిల్లా క్రికెట్ అసోసియేషన్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వివిధ క్రీడా సంఘాలు ఆయనకు అభినందనలు తెలిపాయి. క్రికెట్ లో అవనీష్ నిరంతరం విజయం సాధించాలని ఆకాంక్షించాయి.