యువరాజ్ సింగ్ చేయలేదని హార్దిక్ పాండ్యా సాధించాడు..

By Mahesh Rajamoni  |  First Published Jun 24, 2024, 12:17 PM IST

Hardik Pandya - Yuvraj Singh : టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 సూప‌ర్ 8 భారత్ vs బంగ్లాదేశ్ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా 27 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 50 పరుగులు చేశాడు.185.19 స్ట్రైక్ రేట్‌తో ధ‌నాధ‌న్ బ్యాటింగ్ చేయ‌డంతో పాటు బంగ్లా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ లిటన్ దాస్ వికెట్ ను కూడా తీసుకున్నాడు. ఈ క్రమంలోనే సరికొత్త రికార్డు సాధించాడు. 
 


Hardik Pandya - Yuvraj Singh : టీ20 ప్రపంచకప్ 2024లో సూపర్-8 మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ను చిత్తు చేస్తూ టీమిండియా సూప‌ర్ విక్ట‌రీ అందుకుంది. ఈ మ్యాచ్ లో భారత్ 50 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంలో భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కీలక పాత్ర పోషించాడు. 27 బంతుల్లో అజేయంగా 50 పరుగులు చేయడంతో పాటు, ఒక వికెట్ కూడా తీశాడు. దీంతో హార్దిక్ తన పేరిట ఓ ప్రత్యేక రికార్డు సృష్టించాడు. టీ20 ప్రపంచకప్‌లో 300కి పైగా పరుగులు, 20కి పైగా వికెట్లు తీసిన తొలి భాత‌ర క్రికెట‌ర్ గా నిలిచాడు.

హార్దిక్‌ కంటే భారత ఆల్‌రౌండర్లెవరూ చేయని రికార్డు ఇది. యువరాజ్‌సింగ్‌ నుంచి ఇర్ఫాన్‌ పఠాన్‌ వరకు ఈ రికార్డును ఏ ఆల్ రౌండ‌ర్ సాధించ‌లేక‌పోయారు కానీ, హార్దిక్‌ ఈ ఘనత సాధించాడు. హార్దిక్ పాండ్యా 27 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 50 పరుగులు చేశాడు.185.19 స్ట్రైక్ రేట్‌తో ధ‌నాధ‌న్ బ్యాటింగ్ చేయ‌డంతో పాటు బంగ్లా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ లిటన్ దాస్ వికెట్ ను కూడా తీసుకున్నాడు. హార్దిక్ పాండ్యా టీ20 ప్రపంచ కప్ కెరీర్‌లో 21 మ్యాచ్‌లు-13 ఇన్నింగ్స్‌లలో 27.45 సగటు-137.89 స్ట్రైక్ రేట్‌తో 302 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. అత్యుత్తమ స్కోరు 63 పరుగులు. అలాగే, ఈ 21 మ్యాచ్‌లలో 21 వికెట్లు తీసుకున్నాడు.  3/27 అత్యుత్తమ వికెట్ గ‌ణాంకాలు.

Latest Videos

undefined

టీ20 ప్రపంచకప్‌ హిస్టరీలో అత్యధిక ఫోర్లు కొట్టిన ప్లేయ‌ర్లు వీరే..

ఇక పాకిస్థాన్‌కు చెందిన షాహిద్ అఫ్రిది (34 మ్యాచ్‌ల్లో 546 పరుగులు, 39 వికెట్లు), బంగ్లాదేశ్‌కు చెందిన షకీబ్ అల్ హసన్ (42 మ్యాచ్‌ల్లో 853 పరుగులు-50 వికెట్లు), వెస్టిండీస్‌కు చెందిన డ్వేన్ బ్రావో (27 మ్యాచ్‌ల్లో 530 పరుగులు-27 వికెట్లు), ఆస్ట్రేలియాకు చెందిన షేన్ వాట్సన్ ( 24 మ్యాచ్‌ల్లో 537 పరుగులు-22 వికెట్లు) ఈ ఘనత సాధించిన ఇతర ఆటగాళ్లు. టీ20 ప్రపంచకప్‌లో హార్దిక్‌తో పాటు యువరాజ్ సింగ్ 593 పరుగులు చేసి 12 వికెట్లు తీశాడు. రవీంద్ర జడేజా 102 పరుగులు చేసి 22 వికెట్లు తీశాడు. ఇర్ఫాన్ పఠాన్ 86 పరుగులతో 16 వికెట్లు పడగొట్టాడు. కాగా, సురేష్ రైనా 453 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీశాడు. అయితే, పాండ్యా మినహా ఎవరూ 300+ పరుగులు లేదా 20+ వికెట్లు తీయ‌లేదు. 

4 రోజుల్లో 3 హ్యాట్రిక్‌లు...అమెరికాపై విధ్వంసంతో సెమీస్ చేరిన ఇంగ్లండ్

click me!