ఐసీసీ గ్రౌండ్ లో గ‌ల్లీ సీన్.. విరాట్ కోహ్లీ చేసిన ప‌నికి నెట్టింట కామెంట్ల వ‌ర్షం.. రోహిత్ కూడా.. వీడియో

By Mahesh Rajamoni  |  First Published Jun 23, 2024, 10:44 PM IST

Virat Kohli: టీ20 ప్రపంచ క‌ప్ 2024 సూపర్-8 రెండో మ్యాచ్‌లో భార‌త జ‌ట్టు బంగ్లాదేశ్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 50 పరుగుల తేడాతో ఘ‌న‌ విజయం సాధించింది. అయితే, ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మ చేసిన ప‌నికి సంబంధించిన వీడియో దృశ్యాలు వైర‌ల్ గా మారాయి. 
 


T20 World Cup 2024 - Virat Kohli :  టీ20 ప్రపంచ క‌ప్ 2024 లో భార‌త జ‌ట్టు అద్భుత‌మైన ఆట‌తో ముందుకు సాగుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు మెగా టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా టీమిండియా సూప‌ర్-8 ద‌శ‌కు చేరుకుంది. సూపర్-8 రెండో మ్యాచ్‌లో భారత్ బంగ్లాదేశ్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 50 పరుగుల తేడాతో విజయం సాధించింది. బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో తొలుత బ్యాటింగ్ కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 196 పరుగులు చేసింది. అనంతరం బంగ్లాదేశ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 146 పరుగులు మాత్రమే చేసింది. ఈ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా 27 బంతుల్లో 50 పరుగులతో అజేయంగా నిలిచాడు. అలాగే, బౌలింగ్‌లోనూ మంచి ప్రదర్శన చేశాడు. హార్దిక్ 3 ఓవర్లలో 32 పరుగులిచ్చి 1 వికెట్ తీశాడు. జ‌ట్టు విజ‌యంలో కీల‌క పాత్ర పోషించిన  అత‌ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.

రోహిత్ - కింగ్ కోహ్లీ వీడియో వైరల్.. 

Latest Videos

undefined

భార‌త్-బంగ్లాదేశ్ మ్యాచ్ లో చోటుచేసుకున్న ఒక వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్ గా మారింది. అది కింగ్ కోహ్లీకి సంబంధించిన వీడియో. ఐసీసీ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ  వీడియోను విడుదల చేసింది. ఇది చూసిన క్రికెట్ ల‌వ‌ర్స్ ఆశ్చర్యపోయారు. ఈ వీడియోలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు ఫన్నీ మూమెంట్స్‌ని అభిమానులు వీక్షించవచ్చు. మ్యాచ్‌లో రోహిత్ తనదైన శైలిలో ఆటగాళ్లకు వివరిస్తూ కనిపించాడు. ఇక కింగ్ కోహ్లీ వింతగా బంతి కోసం వెతకడం వీడియోలో కనిపించింది. ఇది చూసిన క్రికెట్ ల‌వ‌ర్స్ కు గల్లీ క్రికెట్ గుర్తుకొచ్చింది. ఇదేంటీ మావా ఐసీసీ గ్రౌండ్ లో గ‌ళ్లీ క్రికెట్ అంటూ అభిమానులు ఫన్నీ రియాక్షన్స్ ఇచ్చారు. కామెంట్ల వ‌ర్షం కురుపిస్తున్నారు.

విరాట్ బంతికోసం..

అర్ష్‌దీప్‌ సింగ్ బౌలింగ్ లో బంగ్లాదేశ్‌ బ్యాట్స్‌మెన్‌ సిక్సర్‌ కొట్టాడు. బంతి బౌండరీ లైన్ వెలుపల పడి అక్కడ ఉంచిన ఒక మిష‌న్ కింద‌కు వెళ్లింది. విరాట్ ఎవరి కోసం ఎదురుచూడకుండా, బంతిని తీసుకోవ‌డానికి చిన్నపిల్లాడిలా నేలపై పడుకున్నాడు. ఆ చిన్న సందులోంచి లోపలికి వెళ్లి బంతిని తీశాడు. విరాట్‌కి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. క్రికెట్ అభిమానులు కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ICC (@icc)

 

విరాట్ కోహ్లీ మ‌రో రికార్డు.. 

ఈ మ్యాచ్‌లో విరాట్ 37 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. అతను తన 28 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లు కొట్టాడు. ఈ క్ర‌మంలోనే ప్ర‌పంచ క‌ప్ లో కింగ్ కోహ్లీ స‌రికొత్త రికార్డు సృష్టించాడు. వన్డే ప్రపంచకప్-టీ20 ప్రపంచకప్‌లో కలిసి 3000 పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా ఘ‌న‌త సాధించాడు. వన్డే ప్రపంచకప్‌లో 37 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 1795 పరుగులు చేశాడు. అలాగే, టీ20 ప్రపంచకప్‌లో 32 మ్యాచ్‌లలో 1207 పరుగులు చేశాడు. ఇలా టీ20-వ‌న్డే ప్రపంచకప్‌లో 69 మ్యాచ్‌లలో మొత్తం 3002 పరుగులు చేశాడు.

దక్షిణాఫ్రికాను వైట్‌వాష్ చేసిన టీమిండియా.. స్మృతి మంధాన సరికొత్త రికార్డు

 

click me!