హనుమ విహారికి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ నుంచి షోకాజ్ నోటీసులు

By Mahesh Rajamoni  |  First Published Mar 28, 2024, 11:28 PM IST

Hanuma Vihari: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ పాలకమండలి తనను కెప్టెన్సీ నుంచి రాజ‌కీయ ఓత్తిడితో అకస్మాత్తుగా తొలగించిందని ఆరోపించిన టీమిండియా ప్లేయ‌ర్ హ‌నుమ‌ విహారి..  మళ్లీ ఆంధ్ర‌ రాష్ట్రం తరఫున ఆడబోనని పేర్కొన్నాడు.
 


Hanuma Vihari : మాజీ కెప్టెన్ హనుమ విహారిని జట్టు సారథిగా తొలగించడం కోసం అసోసియేషన్‌లో రాజకీయ జోక్యం ఉందన్న ఆరోపణలపై షోకాజ్ నోటీసు పంపాలని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) నిర్ణయించింది. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ పాలకమండలి తనను కెప్టెన్సీ నుంచి రాజ‌కీయ ఓత్తిడితో అకస్మాత్తుగా తొలగించిందని ఆరోపించిన టీమిండియా ప్లేయ‌ర్ హ‌నుమ‌ విహారి..  మళ్లీ ఆంధ్ర‌ రాష్ట్రం తరఫున ఆడబోనని పేర్కొన్నాడు. ఈ క్ర‌మంలోనే కొద్ది రోజుల క్రితం ఏసీఏ అపెక్సీ కౌన్సిల్ సమావేశం జరిగిన తర్వాత తనకు పంపిన నోటీసుపై 30 ఏళ్ల బ్యాటర్ ఇంకా స్పందించలేదు.

హ‌నుమ విహారికి షోకాజ్ నోటీసులు పంపామ‌నీ, ఇంకా స్పందించ‌లేద‌ని తెలిపారు. అత‌ని స‌మాధానం కోసం ఎదురుచూస్తున్నామ‌ని ఏసీఏ అధికారి ఒక‌రు తెలిపారు. ఈ విష‌యాన్ని మ‌రింత‌గా పొడిగించడాన్ని అసోసియేష‌న్ వ్యతిరేకిస్తున్నట్లు అధికారి పేర్కొన్నారు. ఇది కేవ‌లం విహారి గ‌త నెలలో ఎలా స్పందించాడో కనుగొనడానికి మాత్రమేన‌ని తెలిపాడు. ఇంకా అత‌ని ప్ర‌తిస్పంద‌న‌లు చేర‌లేద‌నీ, ఇది తన మనోవేదనలను బయటకు రావడానికి ఇది ఒక అవకాశంగా పేర్కొన్నారు. "విహారి, ఆంధ్ర‌ రాష్ట్ర క్రికెట్ వృద్ధికి అతని సహకారాన్ని మేము విలువైనదిగా భావిస్తున్నామని చెప్పిన అసోసియేష‌న్.. అతను దేశవాళీ క్రికెట్‌లో ర్యాంక్‌లో ఎదగడంలో పెద్ద పాత్ర పోషించాడని" వెల్ల‌డించారు.

Latest Videos

undefined

ఇటీవల ముగిసిన రంజీ ట్రోఫీ టోర్నీ క్వార్టర్‌ఫైనల్‌లో మధ్యప్రదేశ్‌పై ఆంధ్రప్రదేశ్ ఓటమి పాలైన వెంటనే ఆశ్చర్యకరమైన సంఘటనలు ప్రారంభమయ్యాయి. విహారి తన సోషల్ మీడియా వేదిగా ఆంధ్ర క్రికెట్ ఆసోసియేష‌న్ తీరుపై విమ‌ర్శ‌లు గుప్పించాడు. కావాల‌నే రాజ‌కీయ ఒత్తిడితో త‌న‌ను కెప్టెన్సీ నుంచి త‌ప్పించార‌ని ఆరోపించారు. ఒక మ్యాచ్‌లో 17వ ఆటగాడైన ఒక ప్లేయ‌ర్ ను దూషించాడ‌ని ఆరోప‌ణ‌ల‌తో స్థానిక రాజకీయ నాయకుడు ఒత్తిడి కారణంగా ఏసీఏ ఈ నిర్ణయం తీసుకుందని విహారి తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో చెప్పాడు. త‌న ఆత్మ గౌర‌వాన్ని  దెబ్బ‌తీసిన ఆంధ్రా టీమ్ కు ఇక ఆడ‌బోన‌ని తెలిపాడు. ఈ క్ర‌మంలోనే త‌న‌పై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేశాడ‌ని పేర్కొంటూ పృథ్వీ రాజ్ సోష‌ల్ మీడియా వేదిక‌గా పేర్కొన్నాడు.

స్వేచ్ఛ‌గా తిర‌గ‌లేని ప‌రిస్థితులు.. లండన్ మేయర్ సాదిక్ ఖాన్ పై కెవిన్ పీటర్సన్ ఫైర్..

click me!