Kevin Pietersen : లండన్ మేయర్ సాదిక్ ఖాన్ పై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. లండన్ లో వరుసగా వెలుగుచూస్తున్న హత్య, దోపిడి ఉదంతాలను ప్రస్తావిస్తూ ఫైర్ అయ్యారు.
London - Sadiq Khan - Kevin Pietersen : ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్, మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024) 17వ సీజన్ కోసం భారత్ లో ఉన్నారు. అయితే, ఆయన తాజాగా లండన్ ప్రస్తుత పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తూ లండన్ మేయర్ సాదిక్ ఖాన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. లండన్ లో కొనసాగుతున్న ప్రస్తుత దారుణ పరిస్థితులకు సాదిక్ ఖాన్ కారణమని ఆరోపించారు. లండన్ లో పట్టపగలు కొనసాగుతున్న దొపిడి ఉదంతాలు, హత్యయత్న పరిస్థితులను కెవిన్ పీటర్సన్ ప్రస్తావించారు.
ఒకప్పుడు అత్యంత అద్భుతనగరంగా ఉన్న లండన్ ను ఇప్పుడు దారుణంగా ఆందోళన కలిగించే పరిస్థితిలోకి దిగజారిందని పేర్కొన్నారు. దీనికి లండన్ మేయర్ సాదిక్ ఖాన్ కారణమని ఫైర్ అయ్యారు. రైలులో ఒక వ్యక్తిని పట్టపగలు కత్తితో దాడి చేసిన ఘటనను ప్రస్తావిస్తూ లండన్ లో చోటుచేసుకున్న ఈ వీడియో దృశ్యాలు చూసి యావత్ ప్రపంచం ఉలిక్కి పడిందని ఆందోళన వ్యక్తం చేశారు.
లండన్ లోని షార్ట్‌ల్యాండ్స్-బెకెన్‌హామ్ మధ్య విక్టోరియా స్టేషన్‌కు వెళ్లే రైలులో ఒక వ్యక్తిపై పట్టపగలు కత్తితో దాడి చేసిన వీడియో పై స్పందిస్తూ కెవిన్ పీటర్సన్ ఇటీవల జరిగిన ఇలాంటి పరిస్థితులను ప్రస్తావిస్తూ లండన్ మేయర్ సాదిక్ ఖాన్ ఈ విమర్శలు గుప్పించారు కెవిన్ పీటర్సన్. ట్విట్టర్ (ఎక్స్) వేదికగా పీటర్సన్ స్పందిస్తూ.. లండన్ ఒకప్పుడు అద్భుతమైన నగరం. ఇప్పుడు జరిగిన ఈ ఘటన పూర్తిగా ఈ ప్రాంతానికి అవమానకరంగా పేర్కొన్నాడు. అలాగే, సాదిక్ ఖాన్ ను టార్గెట్ చేస్తూ.. లండన్ లో ఇప్పుడు మీరు ఎలాంటి విలువైన వాచ్ లను ధరించలేరనీ, చేతిలో ఫోన్ పట్టుకుని తిరిగే స్వేచ్ఛ పరిస్థితిలేదని పేర్కొన్నాడు. అలాగే, మహిళలు తమ బ్యాగులు, నగలతో తిరగలేరని ఇలాంటి పరిస్థితులు సృష్టించిన లండన్ మేయర్ సాధిక్ ఖాన్ చేసిన దానికి నిజంగా గర్వపడాలా? అంటూ ప్రశ్నలు కురిపించాడు.
WTAF is this now in London?!?!?! London was once the most amazing city. It’s an absolute disgrace of a place.
• You cannot wear a watch of any value.
• you cannot walk around with your phone in your hand.
• women get their bags and jewellery ripped off them.
• cars get… https://t.co/6w5JL9KjuP
MI vs SRH : 'ముంబై ఇండియన్స్ చేసిన తప్పు అదే.. '