పాకిస్తాన్ లో.. ఇంగ్లాండ్ టీం బసచేసిన హోటల్ బయట కాల్పుల కలకలం..

By SumaBala BukkaFirst Published Dec 9, 2022, 7:35 AM IST
Highlights

పాకిస్తాన్-ఇంగ్లాండ్ రెండో టెస్ట్ మ్యాచ్ కు ముందు రోజైన గురువారం ఉదయం.. ఇంగ్లాండ్ టీమ్ బస చేసిన హోటల్‌కు ఒక కిలోమీటరు దూరంలో తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపించాయి.

పాకిస్తాన్ : పాకిస్తాన్లో కాల్పులు కలకలం సృష్టించాయి. ముల్తాన్‌లో శుక్రవారం నుంచి పాకిస్తాన్ - ఇంగ్లాండ్ రెండో టెస్టు మ్యాచ్‌ జరగనుంది. ఈ  మ్యాచ్ లో ఇంగ్లండ్ క్రికెట్ జట్టు పాకిస్తాన్ తో తలపడనుంది. ఈ క్రమంలో మ్యాచ్‌కు ఒక్కరోజు ముందు, గురువారం ఉదయం ఇంగ్లాండ్ టీమ్ బసచేసిన హోటల్‌కు ఒక కిలోమీటరు దూరంలో తుపాకీ కాల్పుల శబ్దాలు కలకలం రేపాయి. 

అయితే, ఆ తుపాకీ శబ్దాలు స్థానిక ముఠాల మధ్య జరిగిన కాల్పులకు సంబంధించినవని, దీనికి సంబంధించిన నలుగురిని అరెస్టు చేశామని, ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదని తెలిసిందని టెలిగ్రాఫ్‌ పత్రిక ఒక నివేదికలో పేర్కొంది. విదేశీ బృందాలు పాకిస్తాన్‌ను సందర్శించినప్పుడల్లా భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తారని ఇతన నివేదికలు పేర్కొన్నాయి. 

చైర్మన్ నువ్వే కదా భయ్యో.. ఇలాంటి పిచ్‌లు తయారుచేయిస్తున్నావ్..! రమీజ్ రాజాపై అక్తర్ సెటైర్లు

కొన్ని సంవత్సరాల క్రితమే అంతర్జాతీయ క్రికెట్ దేశానికి తిరిగి వచ్చినందున, ఏదైనా భద్రతాపరమైన ముప్పు వారికే సమస్యగా మారుతుందని, హోం బైలాటరల్ సిరీస్‌లను నిర్వహించడానికి కూడా ప్రమాదంగా మారే అవకాశం ఉన్నందున అలాంటి ఇబ్బందులు తలెత్తవని.. పరిస్థితులు సజావుగానే ఉంటాయని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు భావిస్తోంది.

వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో జరిగే ఆసియా కప్‌లో భారత్ పాల్గొనడంపై ప్రశ్నలు తలెత్తడంతో పీసీబీ నిరసన కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈ సంఘటన జరిగింది. 2025లో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇచ్చే అవకాశాన్ని కూడా పాకిస్తాన్ దక్కించుకుంది. ఇక ఈ సిరీస్ విషయానికొస్తే, రావల్పిండిలో జరిగిన తొలి టెస్టులో కెప్టెన్ బెన్ స్టోక్స్ అద్భుతమైన డిక్లరేషన్ తో అంతగా సహకరించని పిచ్ మీద కూడా 74 పరుగుల తేడాతో ఇంగ్లండ్.. పాకిస్థాన్‌ను ఓడించి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ ఓటమితో వచ్చే ఏడాది జరిగే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరాలన్న పాకిస్థాన్ ఆశలపై నీళ్లు చల్లింది. 

click me!