GT VS MI Highlights : ఫస్ట్ మ్యాచ్ ఓటమి చరిత్రను ముంబై ఇండియన్స్ మరోసారి మార్చుకోలేక పోయింది. ఐపీఎల్ 2024లో గెలిచే మ్యాచ్ ను చివర్లో వరుసగా వికెట్లు కోల్పోయిన ముంబై జట్టు గుజరాత్ చేతిలో 6 పరుగుల తేడాతో ఓడిపోయింది.
Mumbai Indians vs Gujarat Titans Highlights : గుజరాత్ టైటాన్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ (ఐపీఎల్ 2024)ను విజయంతో ప్రారంభించింది. ఐపీఎల్ 2024లో 5వ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ జట్లు తలపడ్డాయి. చివరివరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై గుజరాత్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరిగింది.
ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. గుజరాత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. అనంతరం ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. చివరి ఓవర్లో ముంబై గెలుపునకు 19 పరుగులు చేయాల్సి ఉండగా, ఉమేష్ యాదవ్ అద్భుతమైన బౌలింగ్ తో ముంబై టీమ్ ఓటమిని శాషించాడు. చివరి ఓవర్ లో హార్దిక్ పాండ్యా, పీయూష్ చావ్లాలను అవుట్ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు.
లాంగ్ ఆన్‌లో ఫీల్డింగ్.. హార్దిక్ పాండ్యా ఆదేశించడంతో రోహిత్ శర్మ ఏం చేశాడో తెలుసా..?
చివరి ఓవర్లో ఉమేష్ యాదవ్ బౌలింగ్ చేయగా, హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ లో ఉన్నాడు. తొలి బంతికి సిక్స్, రెండో బంతికి ఫోర్ బాదిన హార్దిక్.. మ్యాచ్‌లో తన జట్టును గెలిపిస్తాడని అనిపించింది. అయితే, ఉమేష్ వేసిన మూడో బంతికి సిక్సర్ కొట్టే ప్రయత్నంలో రాహుల్ తెవాటియాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అతని తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన పీయూష్ చావ్లా.. రషీద్ ఖాన్ కు క్యాచ్ ఇచ్చాడు. ఇక్కడ నుంచి జస్ప్రీత్ బుమ్రా, షమ్స్ ములానీ గెలుపునకు కావాల్సిన పరుగులు సాధించలేకపోయారు.
ముంబై ఇండియన్స్ తరఫున డెవాల్డ్ బ్రెవిస్ 46 పరుగులు, రోహిత్ శర్మ 43 పరుగులు చేశారు. 25 పరుగుల వద్ద తిలక్ వర్మ, 20 పరుగుల వద్ద నమన్ ధీర్ ఔటయ్యారు. టిమ్ డేవిడ్, హార్దిక్ పాండ్యా 11 పరుగులు చేశారు. ఇషాన్ కిషన్ ఖాతా తెరవలేకపోయాడు. గుజరాత్ తరఫున అజ్మతుల్లా ఒమర్జాయ్, ఉమేష్ యాదవ్, స్పెన్సర్ జాన్సన్, మోహిత్ శర్మ రెండేసి వికెట్లు తీశారు. గుజరాత్‌లో సాయి సుదర్శన్ 45 పరుగులు, శుభ్‌మన్ గిల్ 31 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 3 వికెట్లు తీశాడు.
RR vs LSG : రహానె, బట్లర్ ఆల్ టైమ్ రికార్డును సమం చేసిన రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్..
Perfect way to end the HOLI-DAY! 😉 | | | pic.twitter.com/qVubi38AeB
— Gujarat Titans (@gujarat_titans)