Maxwell retirement : వన్డే క్రికెట్ కు మాక్స్‌వెల్ గుడ్ బై

Published : Jun 02, 2025, 01:03 PM ISTUpdated : Jun 02, 2025, 01:51 PM IST
Glenn Maxwell

సారాంశం

భారత గడ్డపై జరిగిన 2023 ప్రపంచకప్ లో ఆసిస్ ఆటగాడు మాక్స్ వెల్ విధ్వంసాన్ని క్రికెట్ ప్రియులు ఎప్పటికీ మరిచిపోలేరు. అలాంటిది అతడు వన్డే క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించడం ఆసిస్ ఫ్యాన్స్ నే కాదు క్రికెట్ ప్రియులకు కూడా షాకే.

Glenn Maxwell : ఆస్ట్రేలియా  ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ వన్డే క్రికెట్‌కి వీడ్కోలు పలికాడు. దీంతో 36 ఏళ్ల ఈ ఆసిస్ క్రికెటర్ 13 ఏళ్ల వన్డే కెరీర్‌ ముగిసింది. ఇతడు ఆస్ట్రేలియా తరపున 2012 ఆగస్టులో వన్డేల్లోకి అడుగుపెట్టాడు… ఇప్పటివరకు 149 మ్యాచ్‌లు ఆడాడు. వన్డేలకు దూరమైనా టీ20 జట్టులో మాత్రం మాక్స్ వెల్ కొనసాగనున్నారు. 

2023 లో భారత్ వేదికన జరిగిన వన్డే ప్రపంచ కప్‌లో మ్యాక్స్ వెల్ అద్భుత ప్రదర్శన చేసాడు. ముంబైలో ఆఫ్ఘనిస్తాన్‌పై జరిగిన మ్యాచ్ లో అతడు విశ్వరూపం చూపించాడు… గాయపడిన కాలితో కుంటుతూనే 201* పరుగులు చేసి జట్టును ఒంటిచేత్తో గెలిపించుకున్నాడు. వన్డే చరిత్రలోనే అత్యుత్తమ ఇన్నింగ్స్‌గా దీన్ని చెప్పుకుంటారు. 

మాక్స్‌వెల్ వన్డే కెరీర్

ఆస్ట్రేలియా తరపున 149 వన్డేలు ఆడిన మాక్స్‌వెల్ 3990 పరుగులు చేసి, 77 వికెట్లు తీసుకున్నాడు. అంతర్జాతీయ వన్డేల్లో 33.81 సగటుతో, 126.70 స్ట్రైక్‌రేట్‌తో మాక్సీ బ్యాటింగ్ చేశాడు. ఆసీస్ 2015, 2023 ప్రపంచకప్ విజయాల్లో ఇతడు భాగస్వామి. 2023 వన్డే ప్రపంచ కప్‌లో ఆఫ్ఘన్‌పై చేసిన 201* పరుగులే మాక్స్‌వెల్ కెరీర్ లో అత్యధిక వన్డే స్కోరు.

వన్డేల్లో మూడు సెంచరీలు, 23 అర్ధసెంచరీలు మాక్సీ ఖాతాలో ఉన్నాయి. ఆఫ్ స్పిన్నర్ అయిన మాక్స్ వెల్ నాలుగు సార్లు నాలుగు వికెట్లు తీసుకున్నాడు. ఆస్ట్రేలియా అత్యుత్తమ ఫీల్డర్లలో ఒకడైన మాక్సీ వన్డేల్లో 91 క్యాచ్‌లు పట్టుకున్నాడు. 

గాయాల కారణంగా ఇక టీ20 ఫార్మాట్‌పైనే దృష్టి పెట్టాలని మాక్స్‌వెల్ భావిస్తున్నాడు. మాక్సీ రిటైర్మెంట్‌తో 2026 వన్డే ప్రపంచకప్‌కి ముందు ఆస్ట్రేలియా కొత్త జట్టుని సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. మాక్సీ సహచరులు స్టీవ్ స్మిత్ 2025 మార్చిలో, మార్కస్ స్టోయినిస్ 2025 ఫిబ్రవరిలో, మాథ్యూ వెయిడ్ 2024 అక్టోబర్‌లో, డేవిడ్ వార్నర్ 2024 జనవరిలో రిటైర్ అయ్యారు.

ప్రపంచకప్‌లో 201* నాటౌట్

2023 వన్డే ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై 201* పరుగులు మాక్స్‌వెల్ కెరీర్‌లో అత్యుత్తమ ఇన్నింగ్స్. వన్డేల్లో ఆసీస్ ఆటగాడి తొలి డబుల్ సెంచరీ ఇది. వన్డేల్లో ఛేజింగ్‌లో డబుల్ సెంచరీ కూడా అదే తొలిసారి. వన్డే డబుల్ సెంచరీ చేసిన తొలి నాన్ ఓపెనర్‌గా కూడా మాక్సీ నిలిచాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చి మాక్సీ డబుల్ సెంచరీ చేయడం విశేషం. 

ఆఫ్ఘన్ నిర్దేశించిన 292 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆసీస్ 91-7తో కష్టాల్లో పడింది. అప్పుడు తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన కెప్టెన్ పాట్ కమిన్స్‌తో కలిసి ఆసీస్‌ని 46.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా గెలిపించాడు మాక్సీ. ఆసీస్ మూడు వికెట్లతో అద్భుత విజయం సాధించగా, మాక్సీ 128 బంతుల్లో 201*, కమిన్స్ 68 బంతుల్లో 12* పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. మాక్సీ 21 ఫోర్లు, 10 సిక్సర్లు బాదాడు. 47వ ఓవర్లో ఆఫ్ఘన్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్‌పై 6, 6, 4, 6 బాది మాక్సీ డబుల్ సెంచరీ పూర్తి చేసి ఆసీస్‌ని గెలిపించాడు. ఆ విజయంతో సెమీస్‌కి చేరిన ఆస్ట్రేలియా ఫైనల్లో టీమిండియాను ఓడించి కప్పు గెలిచింది. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IND vs SA : జైస్వాల్ తొలి సెంచరీ.. విశాఖలో సౌతాఫ్రికా చిత్తు
Rohit Sharma: వైజాగ్ వన్డేలో రోహిత్ చరిత్ర.. 20 వేల పరుగుల క్లబ్‌లో మనోడి మాస్ ఎంట్రీ !