మా కాలంలో అతడే మ్యాచ్ విన్నర్: గంగూలీ

By telugu teamFirst Published Dec 30, 2019, 12:40 PM IST
Highlights

మాజీ భారత కెప్టెన్ ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వీరేంద్ర సెహ్వాగ్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. తమ కాలంలో అతడు మ్యాచ్ విన్నర్ అని కొనియాడాడు. టీం లో చాలా మంది ఆటగాళ్లు ఉన్నప్పటికీ..సెహ్వాగ్ మాత్రం ప్రత్యేకమని చెప్పారు. 

న్యూ ఢిల్లీ: మాజీ భారత కెప్టెన్ ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వీరేంద్ర సెహ్వాగ్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. తమ కాలంలో అతడు మ్యాచ్ విన్నర్ అని కొనియాడాడు. టీం లో చాలా మంది ఆటగాళ్లు ఉన్నప్పటికీ..సెహ్వాగ్ మాత్రం ప్రత్యేకమని చెప్పారు. 

భారత్ తరుఫున ఇప్పటివరకు ఇద్దరు గొప్ప ఓపెనర్లు ఉన్నారని పేర్కొన్నారు గంగూలీ. ఒకరు సునీల్ గవాస్కర్ అయితే...మరొకరు వీరేంద్ర సెహ్వాగ్ అని ఆయన అభిప్రాయపడ్డాడు. ఇద్దరి ఆటతీరు వేరైనా ఇద్దరు కూడా భారత క్రికెట్ కి వెన్నుదన్నుగా ఉన్నారని గంగూలీ వ్యాఖ్యానించాడు. 

గవాస్కరేమో బంతిని ఆఫ్ స్టంప్ అవతలికి పంపిస్తే అది పాతబడుతుంది అని భావిస్తే...సెహ్వాగ్ ఏమో బాల్ పాతపడేవరకు బాదుతుంటాడు. ఇద్దరు డిఫరెంట్ టైపు అఫ్ ప్లేయర్స్ కానీ ఇద్దరి సేవలు మాత్రం గొప్పవి. 

Also read: ఫాస్ట్ బౌలింగ్: ధోనీని తప్పు పట్టిన ఇషాంత్ శర్మ

సెహ్వాగ్ టీంలోకి వచ్చిన కొత్తలో సెహ్వాగ్ ని ఓపెనర్ గా బరిలోకి దిగమనడానికి ఒక కారణం ఉందని, తమ లాగా ఒకటే స్థానంలో బ్యాటింగ్ కి అలవాటు పడకుండా ఏ స్థానంలో అయినా బ్యాటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉండాలని అతడికి పదేపదే చెప్పినట్టు గంగూలీ అన్నాడు. 

గవాస్కర్ హయాంలో విండీస్ లాంటి అగ్రదేశ బౌలర్లను చాలా కొద్దిపాటి రక్షణతో ఆడడం చాలా గొప్ప విషయం. అప్పట్లో హెల్మెట్లు కూడా పూర్తిగా ఉండేవి కావు. ఆర్మ్ గార్డ్స్ కూడా ఉండేవి కాదు. అలంటి పరిస్థితుల నేపథ్యంలో ఆయన ఓపెనర్ గా కొత్త బంతిని సమర్థవంతంగా ఎదుర్కోవడం చాలా గొప్ప విషయం. 

ఇక సెహ్వాగ్ గురించి మాట్లాడుతూ... సెహ్వాగ్ కి బ్యాటింగ్ అంటే భయం ఉండేది కాదని అభిప్రాయపడ్డాడు. ఒక మ్యాచును గుర్తుచేసుకుంటూ... సెహ్వాగ్ బాదుడు అలవాటు గురించి గంగూలీ వివరించాడు. ఒక మ్యాచులో సాధించాల్సిన రన్ రేట్ 8 దాకా ఉందని అప్పుడు క్రీజులో సెహ్వాగ్ బ్యాటింగ్ చేస్తుండగా, నాన్ స్ట్రైకర్ ఎండ్ లో గంగూలీ ఉన్నాడట. 

అప్పుడు సెహ్వాగ్ వద్దకు వచ్చి చిన్నగా సింగిల్స్, టాస్ తీసుకుంటే అలవోకగా గెలుస్తామని చెప్పాడట. సరే అని తల ఉపాది సెహ్వాగ్. అలా చెప్పి వచ్చిన తరువాత నెక్స్ట్ బంతిని సెహ్వాగ్ స్టాండ్స్ లోకి కొట్టాడట. సరే అయిపోయిందేదో అయిపోయింది చిన్నగా ఆడు ఇక ఈ ఓవర్ కి బౌండరీలు చాలు అని గంగూలీ చెప్పాడట. అప్పుడు కూడా బుద్ధిమంతుడు లాగానే తలఊపాడట సెహ్వాగ్. తరువాతి బంతిని కూడా మళ్ళీ బౌండరీ దాటించాడంట. 

Also read: ధోని వారిద్దరికీ మాత్రం తన నిర్ణయం చెప్పే ఉంటాడు : గంగూలీ

చెప్పినా కూడా వినట్లేదని కోపంతో సెహ్వాగ్ మీద అరిచాడట. సరే సరే అని అన్న సెహ్వాగ్ మల్లి బంతిని ఒక రిస్కీ షాట్ ఆది స్టాండ్స్ లోకి పంపాడట. ఇక చెప్పినా కూడా సెహ్వాగ్ వినడు అని ఊరికే చూస్తూ నిలబడ్డాడట. అతని ఆటతీరు అంత విధ్వంసకరంగా ఉంటుందని ఈ ఉదాహరణ చెప్పాడు గంగూలీ

click me!