నేను చచ్చిపోవాలా: తీవ్ర భావోద్వేగానికి గురైన కనేరియా

By telugu teamFirst Published Dec 30, 2019, 11:08 AM IST
Highlights

జావెద్ మియాందాద్ వ్యాఖ్యలపై పాకిస్తాన్ మాజీ లెగ్ స్పిన్నర్ డానిష్ కనేరియా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మీకు ఇంకేం కావాలి, నేను చచ్చిపోవాలా అంటూ ఆయన అన్నారు. వేళ్లు రక్తమోడుతున్నా బౌలింగ్ చేశానని కనేరియా అన్నాడు.

కరాచీ: తనపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ మాజీ క్రికెటర్ జావెద్ మియాందాద్ పై డానిష్ కనేరియా తీవ్రంగా మండిపడ్డారు. ఈ మేరకు ఆయన శనివారం ఓ వీడియో విడుదల చేశాడు. మియాందాద్ వ్యాఖ్యలకు ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. హిందువు అయినందు వల్ల కనేరియా పట్ల పాక్ జట్టు సభ్యులు వివక్ష చూపారని షోయబ్ అక్తర్ ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. 

షోయబ్ అక్తర్ చెప్పిన విషయాలు నిజమేనని కనేరియా అన్నారు. దానిపై జావెద్ మియాందాద్ ఓ టీవీ కార్యక్రమంలో కనేరియాపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. డబ్బు కోసం కనేరియా ఏదైనా చేస్తాడని ఆయన అన్నారు. దీనిపై కనేరియా వీడియో విడుదల చేశారు.

Also Read: ఇక వదిలేయండి ప్లీజ్.... షోయబ్ అక్తర్

డబ్బుకోసం, చౌకబారు ప్రచారం కోసం తాను ఇలా చెస్తున్నానని చెప్పేవారికి ఓ విషయం గుర్తు చేస్తున్నానని, షోయబ్ అక్తర్ ఈ వివాదాన్ని ముందుకు తెచ్చారని, అతను ఓ జాతీయ టీవీ చానెల్ కార్యక్రమంలో ఆ విషయం చెప్పారని కనేరియా అన్నారు. 

"మీరు నా కాళ్లూ చేతులూ కట్టేశారని, చాలా కాలం నుంచి నాకు ఉపాధి లేకుండా పోయింది. మీకింకా ఏం కావాలి, నేను చచ్చిపోవాలా?" అని కనేరియా అన్నారు. తాను పాకిస్తాన్ కోసం పదేళ్లు ఆడానని, తన రక్తాన్ని ధారపోసి ఆడానని, తన వేళ్లు రక్తమోడుతుననా కూడా బౌలింగ్ చేశానని ఆయన చెప్పారు. 

Also Read: దాని కోసం ఏమైనా చేస్తావ్: కనేరియాపై నిప్పులు చెరిగిన మియాందాద్

కొంత మంది దేశాన్ని తాకట్టు పెట్టి ఫిక్సింగ్ చేశారని, అయినా వారిని జట్టులోకి తిరిగి తీసుకున్నారని, తాను డబ్బు కోసం తన దేశాన్ని తాకట్టు పెట్టలేదని ఆయన చెప్పారు.

డానిష్ కనేరియా వివాదం తన దృష్టికి వచ్చిందని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ అన్నారు. కనేరియా ఎక్కువ ఆడింది తన కెప్టెన్సీలోనే అని, తాను ఎప్పుడు కూడా పాకిస్తాన్ జట్టులో అలాంటి వివక్షను చూడలేదని ఆయన చెప్పారు. ముస్లిం కానంత మాత్రాన ఇతర ఆటగాళ్లు కనేరియాను అవమానించిన సంఘటనలను తాను చూడలేదని స్పష్టం చేశారు. 

click me!