టీమిండియా ప్రధాన కోచ్ రేసులో దిగ్గ‌జ ప్లేయ‌ర్లు.. అప్పుడే ర‌చ్చ మొద‌లైంది !

By Mahesh Rajamoni  |  First Published May 16, 2024, 6:53 PM IST

Team India : టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్ర‌విడ్ కాంట్రాక్టు రాబోయే టీ20 ప్రపంచకప్ తో ముగియ‌నుంది. ఈ క్ర‌మంలోనే ద్రవిడ్ స్థానంలో భారత జట్టు ప్ర‌ధాన కోచ్ ఎంపిక కోసం బీసీసీఐ క‌స‌ర‌త్తులు ప్రారంభించింది. దీంతో ప‌లువురు దిగ్గ‌జ ప్లేయ‌ర్లు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు.


Team India Head Coach : ఐపీఎల్ 2024 ముగిసిన వెంట‌నే భార‌త ప్లేయ‌ర్లు మ‌రో మెగా క్రికెట్ లీగ్ కు సిద్ధం కానున్నారు. అదే టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024. ఇప్ప‌టికే భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి (బీసీసీఐ) టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 కోసం జ‌ట్టును ప్ర‌క‌టించింది. అయితే, ప్రపంచ కప్ ముగిసిన తర్వాత భారత మాజీ కెప్టెన్, ప్ర‌ధాన కోచ్ గా ఉన్న‌ రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్టు ముగియ‌నుంది. దీంతో బీసీసీఐ కొత్త కోచ్ కోసం క‌స‌ర‌త్తులు ప్రారంభించింది. ఈ క్ర‌మంలోనే దిగ్గ‌జ‌ క్రికెట‌ర్లు, ప‌లువురు కోచ్ లు టీమిండియా ప్ర‌ధాన కోచ్ ప‌ద‌వికోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. వారిలో ముందు వ‌రుస‌లో ఉన్న వారి వివ‌రాలు గ‌మ‌నిస్తే.. 

వీవీఎస్ లక్ష్మణ్

Latest Videos

భారత బ్యాటింగ్ ఐకాన్, హైద‌రాబాద్ ఆట‌గాడైన వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్ ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. అద్భుత‌మైన బ్యాటింగ్ క్రికెట్ ప్ర‌పంచంలో త‌న‌దైన ముద్ర‌వేసిన అత‌ను ద్రవిడ్ తర్వాత టీమిండియాకు ప్ర‌ధాన కోచ్ బహుశా లక్ష్మణ్ కావచ్చు. ద్రవిడ్ తర్వాత భారత క్రికెటర్లు, ప్రస్తుత బ్యాచ్‌కు అత్యంత సుపరిచితుడు, వారిలో చాలా మంది అతని పర్యవేక్షణలో ఎన్సీఏలో పునరావాసం పొందుతున్నారు. లక్ష్మణ్ భార‌త్ ఏ,  ఇండియా అండ‌ర్-19 క్రికెట్ జట్ల అభివృద్ధిని కూడా పర్యవేక్షిస్తున్నారు. గత ఏడాది ఐర్లాండ్ పర్యటన, రెండు నెలల తర్వాత హాంగ్‌జౌ ఆసియా క్రీడలతో సహా ద్రవిడ్ విరామం తీసుకోవాలనుకున్నప్పుడు లక్ష్మణ్ భారత జట్టుకు కోచ్‌గా కూడా పనిచేశాడు.

స్టీఫెన్ ఫ్లెమింగ్

ప్ర‌స్తుతం క్రికెట్ ప్ర‌పంచంలోని కోచ్‌లలోఅత్యంత గౌరవనీయమైన వ్య‌క్తుల్లో ఒక‌రు స్టీఫెన్ ఫ్లెమింగ్. ఐపీఎల్ లో విజ‌య‌వంత‌మైన చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టుకు ప్ర‌ధాన కోచ్ గా కొన‌సాగుతున్నాడు. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ 2009 నుండి చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రధాన కోచ్‌గా కొన‌సాగుతున్నారు. ఎంఎస్ ధోనితో పాటు టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్-కోచ్ కాంబినేషన్‌లో ఒకటిగా వీరి జోడీ నిలిచింది. చెన్నై సూపర్ కింగ్స్‌కు తొమ్మిది ఫైనల్స్‌కు చేరుకోవడం.. ఐదు టైటిళ్ల‌ను ఈ జోడీ అందించింది. లక్ష్మణ్ కాద‌నుకుంటే.. స్టీఫెన్ ఫ్లెమింగ్ ముందు వ‌రుస‌లో ఉంటాడు. అయితే, అభిమానుల పోల్ ఆధారంగా భారత ప్రధాన కోచ్‌ని ఎంపిక చేస్తే మాత్రం ఫ్లెమింగ్ కు అధిక ఓట్లు రావ‌డం ఖాయం. చెన్నై సూప‌ర్ కింగ్స్ తో పాటు సౌతాఫ్రికా 20 లీగ్, మేజర్ లీగ్ క్రికెట్‌లో సీస్కేకు చెందిన ఇత‌ర ఫ్రాంచైజీలు అయిన జోబర్గ్ సూపర్ కింగ్స్, టెక్సాస్ సూపర్ కింగ్స్ కు కోచ్ గా ఉన్నారు. అలాగే, ది హండ్రెడ్‌లో సదరన్ బ్రేవ్‌కు శిక్షణ ఇచ్చాడు, ప్రారంభ ఎడిషన్‌ను గెలవడంలో వారికి సహాయం అందించాడు. 

జస్టిన్ లాంగర్

ప్రస్తుతం ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ) ప్రధాన కోచ్‌గా పనిచేస్తున్న జస్టిన్ లాంగర్ గతంలో 2018-2022 మధ్య ఆస్ట్రేలియా పురుషుల క్రికెట్ జట్టుకు కోచ్‌గా పనిచేశాడు. ఆ సమయంలో అతను జట్టు సెమీ-ఫైనల్‌కు చేరుకోవడానికి సహాయం చేశాడు. అత‌ను కోచ్ గా ఉన్న స‌మ‌యంలో ఇంగ్లాండ్ 2019 ఐసీసీ  ప్రపంచ కప్‌తో పాటు 2021-22 హోమ్ యాషెస్‌ను 4-0తో గెలుచుకుంది. కీలకమైన ఐదు-టెస్టుల సిరీస్ కోసం భారతదేశం ఆస్ట్రేలియాకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నందున, డౌన్ అండర్‌లో వరుసగా మూడవ సిరీస్ విజయానికి వారిని మార్గనిర్దేశం చేయడానికి లాంగర్ సరైన ఎంపిక కావ‌చ్చు. ఈ ఆస్ట్రేలియన్ మాజీ ఓపెనర్ చురుకైన వ్యూహకర్తగా గుర్తింపు సాదించాడు.

గౌతమ్ గంభీర్/ఆశిష్ నెహ్రా

గౌతమ్ గంభీర్‌కు పైన పేర్కొన్న పేర్లలో ఉన్నంత కోచింగ్ అనుభవం లేదు కానీ,  ఐపీఎల్ 2024 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌లో చేరడానికి ముందు ఐపీఎల్ లో ల‌క్నో టీమ్ కు మెంటార్‌గా పనిచేశాడు. గంభీర్ తన ఆట జీవితంలో చాలా విజయవంతమైన నాయకుడిగా, కేకేఆర్  కు రెండు ఐపీఎల్  టైటిళ్లను అందించిన కెప్టెన్ ఉన్నాడు. ఇది అతని అద్భుతమైన మ్యాన్-మేనేజ్‌మెంట్ స్కిల్స్‌తో పాటు పదునైన క్రికెట్ మెదడుతో కలిసి మెంటార్‌గా విజయం సాధించడంలో సహాయపడింది. దీంతో ఎల్ఎస్జీ బ్యాక్-టు-బ్యాక్ ప్లేఆఫ్‌లకు చేరుకుంది. ప్ర‌స్తుతం కేకేఆర్ తో న‌డుస్తున్న గంభీర్.. త‌న జ‌ట్టును ఇప్ప‌టికే ప్లేఆఫ్ కు అర్హ‌త సాధించ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు. ఢిల్లీ ప్లేయ‌ర్, మాజీ స్టార్ బౌల‌ర్ ఆశిష్ నెహ్రా కూడా టీమిండియా కోచ్ రేసులో ఉన్నాడు. గంభీర్ లాగా కాకుండా ఐపీఎల్ లో ప్రధాన కోచ్ గా కొన‌సాగుతున్నాడు. ఆల్ రౌండర్ హార్దిక్‌తో కలిసి గుజరాత్ టైటాన్స్‌ను బ్యాక్-టు-బ్యాక్  ఐపీఎల్ ఫైనల్స్‌కు నడిపించాడు నెహ్రా. 

ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్ కు ముందు గాడిత‌ప్పిన రాజ‌స్థాన్.. పరాగ్ ఇన్నింగ్స్ ఫలించలేదు !

click me!