
భారత ఫుట్‌బాల్ దిగ్గజం, కోచ్ చున్నీ గోస్వామి కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా మధుమేహం, నరాల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న గోస్వామి గురువారం సాయంత్రం కోల్‌కతాలో గుండెపోటుతో మరణించారు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. ఆయన వయసు 82 సంవత్సరాలు.
Also Read:బాదుడే బాదుడు... మూడేళ్లలో 217 సిక్సర్లు: అందుకే అతను హిట్‌మ్యాన్
1956-64 మధ్యకాలంలో జాతీయ ఫుట్‌బాల్ జట్టులో ప్రాతినిథ్యం వహించిన గోస్వామి 50 మ్యాచ్‌లు ఆడారు. ఇదే సమయంలో 1962 ఆసియా క్రీడల్లో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఆయన విజేతగా నిలిపారు.
భారత ఫుట్‌బాల్‌కు గోస్వామి అందించిన సేవలకు గాను ఆయనను భారత ప్రభుత్వం పద్మశ్రీ, అర్జున అవార్డుతో సత్కరించింది. ఫుట్‌బాల్‌తో పాటు క్రికెట్‌లోనూ గోస్వామి తనదైన ముద్రవేశారు.
Also Read:నమ్మశక్యం కాని నిజం.. రిషీ కపూర్ మృతిపై క్రీడా ప్రముఖుల సంతాపం
ఫస్ట్‌క్లాస్ క్రికెటర్‌గాను ఆయన రాణించారు. గోస్వామి మృతిపై ఆలిండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్) అధ్యక్షుడు ప్రపుల్ పటేల్‌తో పాటు క్రీడా ప్రముఖులు సంతాపం ప్రకటించారు.