Ind Vs SA: చరిత్ర సృష్టించడానికి వస్తున్నాం.. డౌటుందా..? ఆసీస్ ను అడగండి.. రవిశాస్త్రి వీడియో అదుర్స్

Published : Dec 23, 2021, 12:18 PM IST
Ind Vs SA: చరిత్ర సృష్టించడానికి వస్తున్నాం.. డౌటుందా..? ఆసీస్ ను అడగండి.. రవిశాస్త్రి వీడియో అదుర్స్

సారాంశం

India Tour Of South Africa: ప్రపంచ అగ్రశ్రేణి జట్లైన ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లను వారి సొంత గడ్డపైనే మట్టికరపించిన టీమిండియా.. ఇంతవరకు దక్షిణాఫ్రికాలో సిరీస్ గెలవలేదు. కానీ కోహ్లీ సేన ఈసారి ఆ దాహాన్ని తీర్చుతుంది అంటున్నాడు టీమిండియా మాజీ హెడ్ కోచ్. 

దక్షిణాఫ్రికాలో ఇంతవరకు  టెస్టు సిరీస్ నెగ్గని భారత జట్టు.. చరిత్ర సృష్టించడానికి ఇదే మంచి అవకాశమని సీనియర్ క్రికెటర్లు అంటున్నారు.  సౌతాఫ్రికా కూడా గతంతో పోలిస్తే బలహీనంగానే ఉంది. ఈ సమయంలో విరాట్ కోహ్లీకి ఇదే మంచి అవకాశమని భావిస్తున్నారు. ప్రపంచంలోని టెస్టు క్రికెట్  ఆడే దేశాలపై సిరీస్ లు గెలిచిన టీమిండియా.. దక్షిణాఫ్రికా మీద మాత్రం ఇంకా ఆ ముచ్చట  తీర్చుకోలేదు. ఇక తాజాగా టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా ఓ వీడియోలో ఇవే విషయాలను ఊటంకిస్తూ  కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇటీవలే ‘ఫస్ట్ కా తస్ట్’ పేరుతో అదరగొట్టిన స్టార్ స్పోర్ట్స్.. తాజాగా శాస్త్రితో మరో వీడియోను విడుదల చేసింది. 

నాలుగు  రోజుల క్రితం రవిశాస్త్రిని చెఫ్ గా చూపించి అతడు ఏదో వండుతున్నట్టు చూపించిన  స్టార్ స్పోర్ట్స్.. ‘రవి ఏం వండుతున్నాడో కనుక్కోండి..?’ అని ఒక ప్రోమోను విడుదల చేసింది. తాజాగా అందుకు సంబంధించిన పూర్తి వీడియోను ఇప్పుడు ట్విట్టర్ లో ఉంచింది. 

 

ఇందులో రవిశాస్త్రి.. ‘మీరు నన్ను ఈ అవతారం (చెఫ్) లో చూడటం ఇదే మొదటిసారి అని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ గురించి  మాట్లాడాల్సి వస్తే.. దక్షిణాఫ్రికా సిరీస్ కు ముందు మొదటిసారి రికార్డులు సాధించిన వాళ్ల జాబితా పెద్దదే. 1992లో ఇండియా.. తొలిసారి దక్షిణాఫ్రికాలో ఫస్ట్ టెస్ట్ ఆడింది.  ఈ హ్యాండ్సమ్ బాయ్ (ఫోటోలో ఉన్న రవిశాస్త్రిని చూపిస్తూ..) అందులో భాగమయ్యాడు. 

మరో ఫస్ట్.. దక్షిణాఫ్రికాలో ఆ జట్టును ఓడించిన (2006లో) తొలి భారత జట్టుకు సారథ్యం వహించింది రాహుల్ ద్రావిడ్. ఇక సౌతాఫ్రికాలో ఇండియా ఇంతవరకు టెస్ట్ సిరీస్ నెగ్గలేదు. కానీ ఇప్పుడున్న ఇండియన్ టీమ్ ఆ దాహాన్ని తీరుస్తుందని నేను నమ్ముతున్నాను. డౌటుందా..? ఒకసారి ఆస్ట్రేలియాను అడగండి...’ అంటూ వీడియోను  ముగించాడు. 

 

టీమిండియా.. దక్షిణాఫ్రికా పర్యటన నేపథ్యంలో భారత జట్టు అఫీషియల్ బ్రాడ్కాస్టర్ అయిన స్టార్ స్పోర్ట్స్ ఈ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నది.  ‘బిలీవ్ ఇన్ బ్లూ’ అనే హ్యాష్ ట్యాగ్ తో ఈ వీడియోను ట్విట్టర్ లో ఉంచింది. 

ఇక డిసెంబర్ 26 నుంచి  సెంచూరీయన్ వేదికగా జరుగబోయే తొలి టెస్టు కోసం భారత జట్టు  నెట్స్ లో తీవ్రంగా శ్రమిస్తున్నది. కోచ్ రాహుల్ ద్రావిడ్ ఈ మేరకు ఆటగాళ్లకు పలు సూచనలు, సలహాలు ఇస్తున్నాడు. 

1992 నుంచి ఇప్పటివరకు దక్షిణాఫ్రికాలో ఏడు సిరీస్ లు ఆడిన  టీమిండియా.. ఒక్క సిరీస్ కూడా  గెలువలేదు.  6 సిరీసులను సౌతాఫ్రికా గెలవగా..  ఒక్క సిరీస్ డ్రాగా ముగిసింది. ఇప్పటివరకు అక్కడ 20 టెస్టులు ఆడగా.. మూడింటిలో మాత్రమే గెలిచింది. అవి.. 2006లో రాహుల్ ద్రావిడ్ సారథ్యంలో కాగా 2010లో మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలో..  2018లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో మాత్రమే.. మరి విరాట్ సేన ఈ ముప్పై ఏండ్ల  దాహాన్ని తీరుస్తుందా..? 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Team India: సూర్యకుమార్ యాదవ్‌కు షాక్.. కెప్టెన్సీ గోవిందా !
IND vs SA : సౌతాఫ్రికా చిత్తు.. భారత్ సూపర్ విక్టరీ.. సిరీస్ మనదే