500 వికెట్ల క్లబ్‌: అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్‌లు ఆల్‌టైం గ్రేటంటూ స్ట్రాస్ ప్రశంసలు

By Siva KodatiFirst Published Jul 28, 2020, 3:33 PM IST
Highlights

టెస్ట్ క్రికెట్ చరిత్రలో అరుదైన 500 వికెట్ల మైలురాయిని అందుకోవడానికి ఇంగ్లాండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్‌ ఒక్క వికెట్ దూరంలో నిలిచాడు. ఈ క్రమంలో బ్రాడ్‌పై ఆ దే మాజీ క్రికెటర్ ఆండ్రూ స్ట్రాస్ ప్రశంసల వర్షం కురిపించాడు

టెస్ట్ క్రికెట్ చరిత్రలో అరుదైన 500 వికెట్ల మైలురాయిని అందుకోవడానికి ఇంగ్లాండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్‌ ఒక్క వికెట్ దూరంలో నిలిచాడు. ఈ క్రమంలో బ్రాడ్‌పై ఆ దే మాజీ క్రికెటర్ ఆండ్రూ స్ట్రాస్ ప్రశంసల వర్షం కురిపించాడు.

సుధీర్ఘకాలంగా మరో బౌలర్ అండర్సన్‌తో కలిసి పేస్ విభాగాన్ని పంచుకుంటున్న బ్రాడ్‌ను ప్రస్తుత సిరీస్ కంటే గొప్ప ఫామ్‌లో చూసిన దాఖలాలు లేవన్నాడు. విండీస్‌తో తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు సాధించిన బ్రాడ్.. రెండో ఇన్నింగ్స్‌లో మరో రెండు వికెట్లు సాధించాడు.

Also Read:నెలాఖరు నుంచి ఐసీసీ వన్డే సూపర్ లీగ్, క్రికెట్ రూల్స్ లో మార్పులివే...

తద్వారా 499 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా ఇప్పటికే ఇంగ్లీష్ జట్టు తరపున ఐదొందల వికెట్ల క్లబ్‌లో ఉన్న అండర్సన్ సరసన చేరడానికి ఒకే ఒక్క వికెట్ దూరంలో నిలిచాడు.

వీరిద్దరూ ఇంగ్లాండ్ ఆల్‌టైమ్ గ్రేట్‌లలో స్థానం సంపాదించారంటూ కొనియాడాడు. గతంలో మణికట్టు గాయంతో బాధపడ్డ తాను తిరిగి ఫామ్‌ను అందుకోవడానికి ఎంతగానో శ్రమించానని గుర్తుచేసుకున్నాడు. ముఖ్యంగా కుడిచేతి వాటం ఆటగాళ్లకు బౌలింగ్ వేసే క్రమంలో ఎదురయ్యే ఇబ్బందుల్ని బ్రాడ్ అధిగమించాడని స్ట్రాస్ ప్రశంసించాడు.

Also Read:భర్తతో మహిళా క్రికెటర్ విడాకులు... మురళీ విజయ్ పై ట్రోల్స్

సౌతాంప్టన్‌లో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయినప్పుడు బ్రాడ్ తొలగించబడ్డాడని.. కానీ ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరిగిన మ్యాచ్‌లో సిరీస్‌ను సమం చేయడంలో ముఖ్యపాత్ర పోషించాడని అభినందించాడు. 

click me!