మాజీ క్రికెటర్‌కు కరోనా... ఫ్లాస్మా చేయించాలని గంభీర్ విజ్ఞప్తి, చివరికి

By Siva KodatiFirst Published Jun 29, 2020, 6:29 PM IST
Highlights

కరోనా వైరస్ కారణంగా దేశంలో రోజు రోజుకు మరణాలు పెరుగుతున్నాయి. వీరిలో సామాన్యులతో పాటు ప్రముఖులు కూడా ఉంటున్నారు. తాజాగా కోవిడ్ 19 బారినపడి మాజీ క్రికెటర్ సంజయ్ దోబల్ ప్రాణాలు కోల్పోయారు

కరోనా వైరస్ కారణంగా దేశంలో రోజు రోజుకు మరణాలు పెరుగుతున్నాయి. వీరిలో సామాన్యులతో పాటు ప్రముఖులు కూడా ఉంటున్నారు. తాజాగా కోవిడ్ 19 బారినపడి మాజీ క్రికెటర్ సంజయ్ దోబల్ ప్రాణాలు కోల్పోయారు.

53 ఏళ్ల సంజయ్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు సిద్ధాంత్ .. రాజస్థాన్ తరపున ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడుతుండగా.. చిన్న కుమారుడు ఎకాన్ష్ అండర్-23 జట్టులో ఢిల్లీ తరపున అరంగేట్రం చేశాడు.

Also Read:ఢిల్లీలో కరోనా రోగుల చికిత్సకు ప్లాస్మా బ్యాంకు

కాగా, క్లబ్ క్రికెట్‌లో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన సంజయ్...అండర్- 23 జట్టుకు సపోర్టింగ్ స్టాఫ్‌గా సేవలందించారు. ఈ క్రమంలో ఆయనకు ఇటీవల కరోనా సోకింది. ఇప్పటికే ధీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స తీసుకుంటున్న క్రమంలో దోబల్ కోవిడ్ 19 బారినపడ్డారు.

మూడు వారాల క్రితమే ఆయనలో వైరస్ లక్షణాలు కనిపించగా, ఆదివారం సంజయ్ పరిస్ధితి విషమించింది. చివరికి ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారడంతో వెంటిలేటర్‌పై చికిత్స అందించారు.

మరోవైపు ఫ్లాస్మా థెరపీ చేయించినా ఫలితం లేకుండా పోయిందని ఆయన సన్నిహితుడు తెలిపారు. మరోవైపు సంజయ్ మృతిపై ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది.

Also Read:24 గంటల్లో 19,459 కొత్త కేసులు: ఇండియాలో మొత్తం 5,48,318కి చేరిన కరోనా కేసులు

సంజయ్ పరిస్ధితి విషమించిన క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ ఫ్లాస్మా థెరపీ చేయించాలని విజ్ఞప్తి చేశారు. తన స్నేహితుని కోసం డోనర్ కావాలంటూ ట్విట్టర్ వేదికగా కోరారు.

ఈ పరిస్ధితిపై స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎంఎల్ఏ దిలీప్ పాండే.. సంజయ్‌కు డోనర్‌ను ఏర్పాటు చేసినా అది సత్ఫలితాన్ని ఇవ్వలేదు. సంజయ్‌కు రంజీ ట్రోఫీ ఆడిన అనుభవం లేకపోయినా జూనియర్ క్రికెటర్లతో మంచి సాన్నిహిత్యం కల్గి వుండేవారు. ఆ క్రమంలోనే గౌతం గంభీర్‌తో మంచి అనుబంధం ఏర్పడింది. ఆయన ఎక్కువగా ఎయిరిండియా తరపున ఎక్కువ మ్యాచ్‌లు ఆడాడు. 

click me!