ఐపీఎల్ కి మరో షాక్: కోకాకోలా అవుట్

By Sreeharsha GopaganiFirst Published Jun 29, 2020, 5:49 PM IST
Highlights

ప్రతి ఏటా క్రికెట్‌ సీజన్‌ సహా ఐపీఎల్‌లో ప్రకటనల రూపంలో భారీ బడ్జెట్‌ కేటాయించే అమెరికా శీతలపానియాల దిగ్గజ కంపెనీ కోకాకోల 2020 ఐపీఎల్‌కు దూరంగా ఉండనుంది. మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి, భారీగా తగ్గుముఖం పట్టిన అమ్మకాలతో వ్యయ నియంత్రణపై కంపెనీ దృష్టి సారిస్తోంది. 

కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచం స్తంభించిపోయింది. క్రికెట్ తోసహా అన్ని క్రీడలు కూడా వాయిదా పడ్డాయి. ఇప్పుడిప్పుడే క్రికెట్ ఆట పై ఆశలు చిగురిస్తున్నాయి. పాకిస్తాన్ జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు బయల్దేరింది. 

కరోనా వైరస్‌ మహమ్మారితో పాటు ఎన్నో అవాంతరాలను ఎదుర్కొంటున్న ఐపీఎల్‌ 2020 సీజన్‌కు రోజుకో కొత్త సమస్య వచ్చి పడుతోంది!. ఈ పరిణామాలు ప్రత్యక్షంగా బీసీసీఐ ఆదాయంపై ప్రభావం చూపకపోయినా.. ఐపీఎల్‌ బ్రాండ్‌ విలువ తన ప్రాభవాన్ని కోల్పోయేలా చేస్తున్నాయి. 

ప్రతి ఏటా క్రికెట్‌ సీజన్‌ సహా ఐపీఎల్‌లో ప్రకటనల రూపంలో భారీ బడ్జెట్‌ కేటాయించే అమెరికా శీతలపానియాల దిగ్గజ కంపెనీ కోకాకోల 2020 ఐపీఎల్‌కు దూరంగా ఉండనుంది. మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి, భారీగా తగ్గుముఖం పట్టిన అమ్మకాలతో వ్యయ నియంత్రణపై కంపెనీ దృష్టి సారిస్తోంది. 

అందులో భాగంగా క్రికెట్‌ సీజన్‌పై ఖర్చు చేస్తున్న సుమారు రూ. 500 కోట్ల బడ్జెట్‌ను పొదుపు చేసుకోనుంది!. ఈ మేరకు కంపెనీ సీనియర్‌ అధికారులు ఒక ప్రకటన చేసారు. ఏప్రిల్‌-జూన్‌ సీజన్లో  జరిగే అమ్మకాలే వార్షిక అమ్మకాల్లో 50 శాతం వాటాను కలిగి ఉంటాయి. 

ఆ సమయంలో ఇచ్చే ప్రకటనల వాళ్ళ మాత్రమే కంపెనీ సేల్స్ పెరిగే ఆస్కారం ఉంటుంది. కానీ... ఈ ఏడాది ఐపీఎల్ పై అనిశ్చితి కొనసాగుతుంది. ఐపీఎల్‌ ఈ ఏడాది ఆఖర్లో నిర్వహించినా...  కోకాకోలా ప్రకటనలకు ఆసక్తి చూపించబోదు. 

2019 ఐపీఎల్‌ సమయంలో కోకాకోలా స్టార్‌స్పోర్ట్స్‌లో ప్రకటనలకు రూ.130 కోట్లు ఖర్చు చేసింది. ఈ ఏడాది కోకాకోల అసలు ప్రకటనలే ఇవ్వకూడదని నిశ్చయించటంతో, ఆమేరకు స్టార్‌స్పోర్ట్స్‌ ఆదాయంపై భారీగా ప్రభావం పడనుంది. 

ఐసీసీతో నాన్‌ ఆల్కహాలిక్‌ బేవరేజ్‌ భాగస్వామిగా కోకాకోల తన ఒప్పందాన్ని గౌరవించనుందని సమాచారం. ఐసీసీతో కోకాకోల సుమారు. 200 కోట్ల ఒప్పందం చేసుకుంది. ఐసీసీతో కోకాకోలా భాగస్వామ్యం కొనసాగుతుందని కంపెనీ అధికారి తెలిపారు.

click me!