అదొక చెత్త రూల్.. తీసేస్తే బెటర్: ఆలోచింపజేస్తున్న ఆసీస్ మాజీ క్రికెటర్ ప్రతిపాదన

By Siva KodatiFirst Published Jan 3, 2020, 9:57 PM IST
Highlights

క్రికెట్‌లో ఎప్పటికప్పుడు వచ్చే మార్పులను అంచనా వేస్తూ ఐసీసీ కొత్త నిబంధనలు తీసుకొస్తుంది. కొద్దిరోజుల క్రితం నో బాల్ నిర్ణయాన్ని థర్డ్ అంపైర్‌కి ఇచ్చిన ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్‌కు మరో రూల్‌ను ఎత్తి వేయాల్సిందిగా కోరుతున్నాడు ఆసీస్ దిగ్గజ ఆటగాడు. 

క్రికెట్‌లో ఎప్పటికప్పుడు వచ్చే మార్పులను అంచనా వేస్తూ ఐసీసీ కొత్త నిబంధనలు తీసుకొస్తుంది. కొద్దిరోజుల క్రితం నో బాల్ నిర్ణయాన్ని థర్డ్ అంపైర్‌కి ఇచ్చిన ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్‌కు మరో రూల్‌ను ఎత్తి వేయాల్సిందిగా కోరుతున్నాడు ఆసీస్ దిగ్గజ ఆటగాడు.

వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్)లో భాగంగా గురువారం మెల్‌బోర్న్ స్టార్స్-సిడ్నీ థండర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌కు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మార్క్ వా కామెంటేటర్‌గా వ్యవహరించాడు.

Also Read:టీమిండియాపై కన్నేసిన టికెట్ కలెక్టర్: ధోనికి పట్టిన యోగం పడుతుందా..?

ఈ క్రమంలో బ్యాట్స్‌మెన్ తీసే లెగ్ బైస్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు. సిడ్నీ థండర్స్ బ్యాట్స్‌మెన్ అలెక్స్ రాస్ పదే పదే లెగ్‌ బై రూపంలో పరుగులు సాధించడంతో మార్క్‌ వాకు చిర్రెత్తుకొచ్చింది.

లెగ్ బైస్ అనేది అనవసరమైన రూల్ అని.. ఇది ఎప్పటి నుంచో క్రికెట్‌లో అమలవుతుందని మండిపడ్డాడు. బంతిని బ్యాట్స్‌మెన్ టచ్ చేయలేనప్పుడు పరుగు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించిన మార్క్ వా... శరీరానికి, ప్లాడ్లకు కానీ బంతి తగిలి పరుగులు ఇవ్వడం వల్ల క్రికెట్‌లో పారదర్శకత లోపించినట్లేనని అభిప్రాయపడ్డాడు.

Also Read:సిక్స్ కొడితే 250 డాలర్లు.. అంతా వాళ్లకి డొనేట్ చేస్తా: ఆసీస్ క్రికెటర్ మానవత్వం

ఇదే సమయంలో తోటి కామెంటేటర్ ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ మాత్రం మార్క్ వా ప్రతిపాదనను తప్పుబట్టాడు. ఇది క్రికెట్‌లో ఇక భాగమని పేర్కొన్నాడు. దీనికి మార్క్ సమాధానమిస్తూ ఈ పద్ధతిని తాను మారుస్తానంటూ సమాధానం ఇచ్చాడు.

మళ్లీ కలగజేసుకున్న మైఖేల్ వాన్.. నువ్వు క్రికెట్ లా మేకర్ ఎంసీసీలో సభ్యుడిగా ఉండాలంటూ చమత్కరించాడు. దీనికి బదులిచ్చిన మార్క్ వా ఈ రూల్‌ను మార్చాలనే నిబంధన తన సోదరుడు మార్క్ వాది కూడా అని పేర్కొన్నాడు. లెగ్ బైస్‌పై సీరియస్‌గా దృష్టి పెట్టి కనీసం వన్డే క్రికెట్ నుంచైనా దీనిని తొలగించాలని కోరాడు. 

click me!