సిక్స్ కొడితే 250 డాలర్లు.. అంతా వాళ్లకి డొనేట్ చేస్తా: ఆసీస్ క్రికెటర్ మానవత్వం

By sivanagaprasad KodatiFirst Published Jan 3, 2020, 3:09 PM IST
Highlights

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సూత్రాన్ని క్రికెటర్ల పక్కగా అమలు చేస్తారు. దొరికినంత దోచుకోవాలనే ప్లాన్‌లో భాగంగా కోట్లు సంపాదిస్తారు. అయితే ఈ క్రికెటర్ మాత్రం సామాజిక బాధ్యతగా తనకు వచ్చే డబ్బును విరాళంగా అందిస్తానంటున్నాడు. 

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సూత్రాన్ని క్రికెటర్ల పక్కగా అమలు చేస్తారు. దొరికినంత దోచుకోవాలనే ప్లాన్‌లో భాగంగా కోట్లు సంపాదిస్తారు. అయితే ఈ క్రికెటర్ మాత్రం సామాజిక బాధ్యతగా తనకు వచ్చే డబ్బును విరాళంగా అందిస్తానంటున్నాడు.

Also Read:నేను నాటౌట్: క్రీజు వదలనంటూ శుభమన్ గిల్ పట్టు, అంపైర్‌పై తిట్ల దండకం

వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో అడవులు అంటుకుని ఎంతోమంది నిరాశ్రయులవ్వడంతో పాటు ఎన్నో మూగజీవాలు, ప్రకృతి సంపద అగ్నికి ఆహుతయ్యాయి. దీనిపై తీవ్రంగా చలించిపోయిన ఆస్ట్రేలియా క్రికెటర్ క్రిస్ లీన్.... వారిని ఆదుకోవడానికి ముందుకొచ్చాడు.

ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్)లో బ్రిస్బేన్ హీట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న లీన్.. ఈ లీగ్‌లో కొట్టే ప్రతీ సిక్స్‌ను అడవులు అంటుకుని బాధితులుగా మారిన వారికి డొనేట్ చేస్తానన్నాడు. తాను కొట్టే ప్రతీ సిక్స్‌కు నిర్వాహకులు అందించే 250 డాలర్లను వారిళంగా ఇస్తానంటూ లీన్ ట్వీట్ చేశాడు.

Also Read:నటాషాతో ఎంగేజ్ మెంట్.... హార్దిక్ మాజీ ప్రేయసి స్పందన ఇదే..

ఇతని దారిలోనే ఆసీస్ టెన్నిస్ స్టార్ నిక్ కిర్గియోస్ కూడా తన వంతు సాయాన్ని ప్రకటించాడు. ఏటీపీ కప్‌లో తాను కట్టే ప్రతీ ఏస్‌కు వచ్చే 200 డాలర్లను విరాళంగా ఇస్తానని ప్రకటించాడు.

కాగా గత కొన్ని రోజులుగా ఆస్ట్రేలియాలో అడవులు అంటుకుని న్యూసౌత్ వేల్స్, విక్టోరియాలోని ఈస్ట్ గిప్స్‌లాండ్ తదితర ప్రాంతాలు విలవిలాడిపోయాయి. ఇప్పటి వరకు 17 మంది మరణించగా, వందల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు.

click me!