Smriti Mandhana's Heartbreaking Reaction: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆదివారం జరిగిన మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్ 2024) మ్యాచ్ లో స్మృతి మంధాన సారథ్యంలోని ఆర్సీబీ ఒక పరుగు తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో పరాజయం చవిచూసింది. అయితే, ఈ మ్యాచ్ స్మృతి మంధాన హార్ట్ బ్రేకింగ్ దృశ్యాలు వైరల్ గా మారాయి.
WPL 2024 - Smriti Mandhana : మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2024లో భాగంగా ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరింది. చివరివరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో స్మృతి మంధాన కెప్టెన్సీలోని ఆర్సీబీ ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన డబ్ల్యూపీఎల్ 2024 సీజన్ 17వ మ్యాచ్ లో ఆర్సీబీ విజయానికి 182 పరుగులు అవసరం కాగా, చివరి బంతికి రెండు పరుగులు కావాల్సిన సమయంలో దానిని సాధించడంలో బెంగళూరు టీమ్ విఫలమైంది. రిచా ఘోష్ చివరివరకు జట్టుకు విజయం అందించడం కోసం పోరాడారు. ఈ 20 ఏళ్ల వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ 29 బంతుల్లో 51 పరుగులు చేసినప్పటికీ మ్యాచ్ చివరి బంతికి రనౌట్ కావడంతో ఆర్సీబీ ఓడిపోయింది.
డబ్ల్యూపీఎల్ 20234 చివరి లీగ్ దశ మ్యాచ్ లో ఒక్క పరుగు తేడాతో ఓడిన ఆర్సీబీ ఇప్పుడు ప్లేఆఫ్స్ కు చేరే అవకాశాలు అంచున ఉన్నాయి. అయితే, ఒక్కపరుగు తేడాతో ఆర్బీబీ ఓటమిని ఆ జట్టు ప్లేయర్లు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆర్బీబీ ప్లేయర్లు ఓటమి తర్వాత గ్రౌండ్ లో ఇచ్చిన హార్ట్ బ్రేకింగ్ రియాక్షన్స్ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా కెప్టెన్ స్మృతి మంధాన ప్రతిస్పందన అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. స్మృతి మంధాన బాగా నిరాశతో బాధపడుతూ కనిపిస్తున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.
కాగా, స్మృతి మంధాన నాయకత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ ఇప్పటివరకు 7 మ్యాచ్ లు ఆడి మూడు విజయాలతో 6 పాయింట్లతో పాయింట్స్ టేబుల్ లో 3వ స్థానంలో ఉంది. మొదటి రెండు స్థానాల్లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబయి ఇండియాన్స్ ఉన్నాయి.
