చాణక్యుడి ఇమేజ్ సృష్టించిన శాస్త్రవేత్తలు బృందం.. ఆ ఫొటో చూసి ఎంఎస్ ధోనినే అని నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
కొందరు శాస్త్రవేత్తలు కలిసి భారత తాత్వికుడు చాణక్యుడి ఇమేజ్‌ను సృష్టించారు. తీరా చూస్తే ఆ బొమ్మ ఎంఎస్ ధోనీ తరహాలో ఉన్నది. దీంతో ఆ ఫొటోలపై నెటిజన్లు ఫన్నీ కామెంట్ చేస్తున్నారు.
చాణక్యుడు ప్రాచీన భారత చరిత్రలో ప్రముఖమైన బోధకుడు, రచయిత, వ్యూహకర్త, తాత్వికుడు, ఆర్థిక వేత్త, న్యాయ కోవిదుడిగా పేరుగడించాడు. రాజు చంద్రగుప్త మౌర్యకు రాజకీయ సలహాదారుగా పని చేసినట్టు చరిత్ర చెబుతున్నది. ఆయన రాసిన అర్థ శాస్త్ర ఇప్పటికీ ఫేమస్. అది క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో రాసినట్టు చెబుతారు.
Scientists at Magadha DS University have reconstructed this 3D model of how Chanakya, the author of Arthashastra might have looked. pic.twitter.com/M443FytXCu
— ⛄🎄Jerxn🥑 (@jerxn_)
బిహార్‌లోని మగద యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం టెక్నాలజీతో చాణక్యుడి చిత్రాన్ని సృష్టించారు. అయితే... ఆ చిత్ర టీమిండియా మాజీ కెప్టెన్, సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనిని పోలి ఉన్నది. ఎంఎస్ ధోనిని కూడా క్రికెట్ చాణక్యుడిగా అభిమానులు కొలుస్తుంటారు. ఎంఎస్ ధోని తీసుకునే కీలక నిర్ణయాలు జట్టు విజయానికి చాలా సార్లు ఉపయోగపడ్డాయి.
Also Read: David Miller: గర్ల్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకున్న డేవిడ్ మిల్లర్
ఇప్పుడు ఎంఎస్ ధోనిలా కనిపిస్తున్న చాణక్య చిత్రంపై నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. నవ్వులు చిందిస్తున్నారు.