IND vs AFG: మ‌స్తు క్రేజీ ఇది.. క్రికెట్ చ‌రిత్ర‌లో తొలిసారి డ‌బుల్ సూప‌ర్ ఓవ‌ర్ ! భార‌త్ గెలుపు

By Mahesh Rajamoni  |  First Published Jan 17, 2024, 11:31 PM IST

India vs Afghanistan T20: భార‌త్-ఆఫ్ఘనిస్తాన్ 3వ టీ20 మ‌స్తు క్రేజీగా సాగింది. రెండు జ‌ట్లు 40 ఓవ‌ర్ల‌లో ఏకంగా 423 ప‌రుగ‌లు కోట్టారు. అయినా ఫ‌లితం రాలేదు. సూప‌ర్ ఓవ‌ర్ కు వెళ్లారు అయినా మ‌ళ్లీ సేమ్ రిజ‌ల్ట్.. క్రికెట్ చ‌రిత్ర‌లోనే రెండో సారి సూప‌ర్ ఓవ‌ర్ కు దారితీసింది. చివరకు భారత్ విజయం సాధించింది ! 
 


India vs Afghanistan T20 Match: బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియంలో భార‌త్-ఆఫ్ఘ‌నిస్తాన్ మ్యాచ్ సూప‌ర్ థ్రిల్లింగ్ గా సాగింది. నిజం చెప్పాలంటే నిజంగానే మ‌స్తు క్రేజీ మ్యాచ్ ! మొద‌టిసారి మ్యాచ్ టై అయింది. సూప‌ర్ ఓవ‌ర్ వెళ్ల‌గా మ‌ళ్లీ టై అయింది. దీంతో క్రికెట్ చ‌రిత్ర‌లో రెండో సారి భార‌త్-ఆఫ్ఘ‌నిస్తాన్ లు ఒకే మ్యాచ్ లో రెండో సారి సూప‌ర్ ఓవ‌ర్ కు వెళ్లాయి. రెండు జ‌ట్ల ప్లేయ‌ర్స్ బ్యాట్ తో ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ ఆడారు. దీంతో ఇరు టీమ్స్ క‌లిపి 40 ఓవ‌ర్ల‌లో ఏకంగా 423 ప‌రుగ‌లు చేశాయి. అయినా ఫ‌లితం రాలేదు. సూప‌ర్ ఓవ‌ర్ కు దారితీసింది.

సూప‌ర్ ఓవ‌ర్ లో ఓవర్ లో అఫ్గానిస్తాన్ 16/1 స్కోరు చేసింది. భార‌త్ ముందు 17 ప‌రుగుల ల‌క్ష్యం ఉంచింది. సూప‌ర్ ఓవ‌ర్ లో బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు రోహిత్ శ‌ర్మ‌-య‌శ‌స్వి జైస్వాల్ లు ఓపెనింగ్ కు వచ్చారు. అజ్మతుల్లా బౌలింగ్ లో తొలి బంతిని ఎదుర్కొన్న రోహిత్ శ‌ర్మ‌కు లైగ్ బై రూపంలో సింగిల్ వ‌చ్చింది. రెండో బంతికి ఎదుర్కొన్న జైస్వాల్ సింగిల్ తీశాడు. ఇక మూడు, నాలుగో బంతుల‌ను వ‌రుస‌గా సిక్స‌ర్లుగా మ‌లిచాడు రోహిత్ శ‌ర్మ‌. ఐదో బంతిని ఎదుర్కొన్న రోహిత్ శ‌ర్మ సింగిల్ తీసి రిటైర్డ్ ఔట్ అయ్యాడు. ఆరో బంతికి జైస్వాల్ ఒక ప‌రుగు చేయ‌డంతో భార‌త్ కూడా 16 ప‌రుగులు చేసింది. మ‌రోసారి మ్యాచ్ టై అయింది. సూప‌ర్ ఓవ‌ర్ లో కూడా మ్యాచ్ ఫ‌లితం రాక‌పోవ‌డంతో రెండో సూప‌ర్ ఓవ‌ర్ కు వెళ్లింది. మ‌స్తు క్రేజీగా మారింది.

Latest Videos

 

IT'S A TIE! 😱

Scenes in Bengaluru as Afghanistan make 18 in the final over to force a Super Over 😯 📝: https://t.co/2CIOHrD17l pic.twitter.com/kUcUEtgd0F

— ICC (@ICC)

ఇక రెండో సూప‌ర్ ఓవ‌ర్ ఆడిన భార‌త్ బ్యాటింగ్ కు దిగి 11 ప‌రుగులు చేసింది. తొలి బంతిని రోహిత్ శ‌ర్మ సిక్స‌ర్ కొట్టాడు. త‌ర్వాతి బంతిని ఫోర్ గా మ‌లిచాడు. మూడో బంతికి సింగిల్ తీశాడు. నాలుగో బంతికి రింకు సింగ్ ఔట్ కాగా, ఐదో బందికి రోహిత్ ర‌నౌట్ అయ్యాడు. 12 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఆఫ్ఘ‌న్ ను దెబ్బ‌కొట్టిన‌ ర‌విబిష్ణోయ్ భార‌త్ కు విజ‌యం అందించాడు. రెండో సూప‌ర్ ఓవ‌ర్ తొలి బంతికే ఆఫ్ఘ‌న్ తొలి వికెట్ ను తీశాడు. రెండో బంతికి కరీం జనత్ సింగిల్ తీశాడు. మూడో బంతికి రహ్మనుల్లా ఔట్ కావ‌డంతో భార‌త్ విజ‌యం సాధించింది.. ఈ మ్యాచ్ క్రికెట్ ప్రియుల‌కు మ‌స్తు ఎంట‌ర్టైన్మెంట్ ను అందించింది.. ! 

 

A tied match 😮
A tied Super Over 😱

India win the second Super Over to seal a 3-0 whitewash 🙌 📝: https://t.co/DWK9Rn6PsN pic.twitter.com/gvQGEJVHMC

— ICC (@ICC)
click me!