బంగ్లాదేశ్ మీద ఓటమి: రోహిత్ శర్మ రియాక్షన్ ఇదే...

By telugu teamFirst Published Nov 4, 2019, 5:42 PM IST
Highlights

తమ జట్టులో అనుభవం లేని కుర్రాళ్లు ఉన్నారని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. బంగ్లాదేశ్ పై తొలి ట్వంటీ20 మ్యాచులో తమ ఓటమికి గల కారణాలను ఆయన వివరించాడు.

న్యూఢిల్లీ: మూడు మ్యాచుల సిరీస్ లో భాగంగా ఆదివారం ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన తొలి ట్వంటీ20 మ్యాచులో బంగ్లాదేశ్ మీద తన పరాజయంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. బంగ్లాదేశ్ మీద భారత్ ఏడు వికెట్ల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. మూడు బంతులు మిగిలి ఉండగానే బంగ్లాదేశ్ విజయాన్ని సొంతం చేసుకుంది.

భారత్ బంగ్లాదేశ్ ముందు 149 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. అయితే, బంగ్లాదేశ్ దాన్ని అత్యంత సునాయసంగా ఛేదించింది. బంగ్లాదేశ్ ముందు తాము ఉంచింది స్వల్ప లక్ష్యమేమీ కాదని రోహిత్ శర్మ అన్నాడు. బంగ్లాదేశ్ ను గెలిపించిన ముష్పికుర్ రహీంను అవుట్ చేసే అవకాశం తమకు రెండు సార్లు వచ్చిందని దాన్ని వాడుకోలేకపోయామని అన్నాడు.

Also Read: బంగ్లాతో టీ20 : పంత్ ని విపరీతంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

ముష్పికుర్ రహీం 60 పరుగులు చేసి అజేయంగా నిలిచిన విషయం తెలిసిందే. తమ జట్టులో అనుభవం లేని కుర్రాళ్లు ఉన్నారని, బ్యాటింగ్ ప్రారంభించినప్పటి నుంచే తాము ఒత్తిడికి గురయ్యామని రోహిత్ శర్మ అన్నాడు. తమ జట్టులోని లోటుపాట్లను గుర్తించిన బంగ్లాదేశ్ దాన్ని సద్వినియోగం చేసుకుందని అన్నాడు.

రోహిత్ శర్మ ఓపెనర్ గా దిగి కేవలం 9 పరుగులు మాత్రమే చేశాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ 42 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్ ను కట్టడి చేయడంలో భారత బౌలర్లు విఫలమయ్యారు. విరాట్ కోహ్లీ లేని టీమిండియాకు రోహిత్ శర్మ నాయకత్వం వహించాడు. 

Also Read: రివ్యూ కి ఒప్పించిన పంత్.... రోహిత్ కామిక్ రియాక్షన్

click me!